Bigg Boss Telugu 6: చెల్లి చెల్లి అంటూనే అలా చేస్తాడని గీతూ కామెంట్.. పర్ఫెక్ట్ రివెంజ్ ప్లాన్!

బిగ్ బాస్ 8వ వారం కెప్టెన్సీ టాస్క్ లో కంటెస్టెంట్స్ అందరూ ఎలాగైనా ఈవారం కెప్టెన్ అవ్వాలి అని పోటీపడ్డారు. కానీ ఫైనల్ గా అందరూ ఊహించినట్లే కూల్ గా వెళ్ళిన కంటెస్టెంట్ కెప్టెన్ గా నిలిచాడు. అయితే ఈ కెప్టెన్సీ టాస్క్ లో మాత్రం ఎక్కువగా అందరి ఫోకస్ గీతూ పైన పడింది. ఆమె ఫస్ట్ ఛాలెంజ్ లోనే ఓడిపోయినప్పటికీ కూడా ఆ తర్వాత కంటిన్యూగా ఆటలో హైలెట్ అవుతూ కనిపించింది. బిగ్ బాస్ కూడా ఆమె బ్రేక్ చేసిన రూల్స్ పై పెద్దగా అభ్యంతరం చెప్పకపోవడం ఆఆశ్చర్యం. అయితే ఒక కంటెస్టెంట్ మాత్రం తనను చెల్లి చెల్లి అంటూనే ఊహించిన విధంగా ప్రవర్తించాడు అని కామెంట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

 బిగ్ బాస్ భయం

బిగ్ బాస్ భయం

బిగ్ బాస్ లో ఎవరైనా సరే కెప్టెన్సీ టాస్క్ లో ఏ మాత్రం పట్టు విడవకుండా గెలవాలని అనుకుంటారు. ఈ వారం ఎలిమినేషన్ లో దయ లేకుండా బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తాడు అని అందరికీ అర్థమైంది. ఇంతకుముందు ఎంత కష్టపడినా కూడా ఈ వారం ఆడకపోతే మాత్రం బయటకు వెళ్లి పోవాల్సిందే అనే హెచ్చరికలు కూడా వచ్చాయి. అందుకే కంటెస్టెంట్స్ అందరూ కూడా కెప్టెన్సీ టాస్క్ లో చాలా బలంగా పోరాడి ప్రయత్నం చేశారు.

పగ పెంచుకున్న గీతూ

పగ పెంచుకున్న గీతూ


చేపల చెరువు టాస్క్ లో గీతూ అయితే ఫస్ట్ లోనే వెనుతిరగడం కొంత ఆశ్చర్యం కలిగించింది. ప్రతి కెప్టెన్సీ ఛాలెంజ్ లో కూడా చివరి వరకు పోటీ ఇచ్చేందుకు ఎంతో కసిగా పోరాడుతుంది. అయితే ఈసారి రేవంత్ కారణంగానే తాను ఓడిపోయాను అని పగ పెంచేససుకున్న గీతూ అతను మాత్రం కెప్టెన్ గా గెలవకూడదు అని మొండి పట్టుదలతో నిలిచింది. సంచాలక్ అయినప్పటికీ గేమ్ కంటిన్యూ చేసింది.

 ఇది కరెక్ట్ గేమ్ కాదు

ఇది కరెక్ట్ గేమ్ కాదు

సంచాలక్ గా ఉన్నప్పుడు అసలు గేమ్ లో ఆడుతూ తలదూర్చాల్సిన అవసరం లేదని చాలామంది ఆమెతో వాదించారు. ముఖ్యంగా మరో సంచాలకుడిగా ఉన్న ఆదిరెడ్డి సైతం గీతం ఇది కరెక్ట్ గేమ్ కాదు అని చాలా సార్లు చెప్పాడు. ఇక రేవంత్ బాలాదిత్యా కూడా ఆమెపై సెటైర్లు గట్టిగానే వేశారు. గట్టిగా అరిచినప్పటికి మరోవైపు బాలదిత్యా మాత్రం సున్నితంగానే ఆమెపై కౌంటర్లు వేశాడు.

 గెలవనివ్వకుండా చేయాలి

గెలవనివ్వకుండా చేయాలి

రేవంత్ తో పాటు ఈ ఆటలో నేను ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆదిత్య అంటూ గీతూ అయితే చాలా పగ పెంచుకుంది. ఎలాగైనా అతన్ని గెలవనివ్వకుండా చేయాలి అని తన అధికారాన్ని చాలా తెలివిగా ఉపయోగించుకుంది. చివరగా ఆదిత్య అలాగే శ్రీహన్ రెండు జంటలు మధ్యలో చేపలను స్వాప్ చేసుకునే శక్తి గీతూకి రావడంతో శ్రీహన్ వైపు మొగ్గు చూపింది.

 చెల్లి చెల్లి అంటూనే

చెల్లి చెల్లి అంటూనే


చెల్లి చెల్లి అంటూనే తనపై చాలాసార్లు రివెంజ్ తీర్చుకున్నట్లు ప్రవర్తించాడని తాను ఓడిపోవడానికి అతను కూడా ఒక కారణమని ఆదిత్య పై అందుకే ఈ విధంగా ప్రవర్తించాను అని గీతూ ఆదిరెడ్డితో చెప్పుకుంది. నా గేమ్ నేను ఇలానే ఆడతాను అనే విధంగా గీతు ముందుకు సాగింది. ఈ విషయంలో మాత్రం నేను చాలా న్యాయంగానే ఆడాను అని కూడా గీతూ చాలా గొప్పగా ప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X