Bigg Boss Telugu 6: నాగ్ చెప్పేవరకు బిగ్ బాస్ కు తెలియదా?.. గీతూ గేమ్ పై అనుమానాలు!
బిగ్ బాస్ లో ప్రతివారం కూడా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతున్నాయి. కంటెస్టెంట్స్ అందరూ కూడా సొంత ప్రణాళికలతోనే వారి స్థాయిని పెంచుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఆట లో కూడా హైలెట్ కావాలి అని గీతూ చేస్తున్న ప్రయత్నాలు అయితే ఊహించిన విధంగా ఉన్నాయి. కొన్నిసార్లు ఆమె నియమాలను తప్పుతూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే గతవారం గీతూ చేసిన పొరపాట్లపై బిగ్ బాస్ ఎందుకు మౌనంగా ఉన్నాడు ఎవరికి అర్థం కాలేదు. ఈ విషయంలో అయితే తీవ్ర స్థాయిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వివరాలలోకి వెళితే..

ఓవరాక్షన్ చేస్తుంది
ప్రతి గేమ్ లో కూడా హైలెట్ కావాలి గీతూ చేస్తున్న ప్రయత్నాలు అయితే తీవ్ర స్థాయిలో విమర్శలను కలిగిస్తున్నాయి. అసలు ఆమె మొదటి రెండు మూడు వారాల్లోనే వెళ్లిపోతుంది అని అందరూ అనుకున్నారు . చాలా వరకు ఆమె ఓవరాక్షన్ చేస్తుంది అనే కామెంట్స్ కూడా అందుకుంది.

కోపాన్ని తెచ్చుకొని..
గతవారం చేపల చెరువు టాస్క్ లో గీతూ రాయల్ మొదటి రౌండ్ లోనే ఓడిపోయింది. అందుకు కారణం రేవంత్ అని అలాగే అదిత్య విభేదించాడని ఆమె కాస్త కోపాన్ని తెచ్చుకుంది. ఈ క్రమంలో వాళ్లని ఓడించాలి అనే విధంగా కూడా ఆమె మళ్లీ కొన్ని రూల్స్ బ్రేక్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. బిగ్ బాస్.. గీతూ అలాగే ఆదిరెడ్డి ఇద్దరినీ కూడా సంచాలకులుగా నియమించాడు.

బిగ్ బాస్ మౌనం?
ఆదిరెడ్డి సంచాలకుడిగా తన బాధ్యతను సక్రమంగానే నిర్వర్తించాడు. కానీ గీతూ మాత్రం మొదటి రౌండ్ లోనే ఓడిపోయాను అని ఆ తర్వాత తాను హైలైట్ కాలేనేమో అని సంచలకురాలిగా కూడా గేమ్ లో కొనసాగడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ సమయంలో బిగ్ బాస్ ఎందుకు మౌనంగా ఉన్నాడు అనేది ఎవరికి అర్థం కాలేదు.

నల్ల చేపతో..
అసలు సంచాలకుడిగా ఉన్నప్పుడు గేమ్ లో ఎవరు కూడా ఆడడానికి వీలులేదు. ఇక ఆమెకు నల్ల చేప దొరకడం ఆ తర్వాత ఆదిత్య ను కావాలని ఓడించే విధంగా చేయడం చూసిన తర్వాత అసలు ఈ ఆటలు ఏమైనా న్యాయంగా కొనసాగుతున్నాయా అనే కామెంట్స్ అయితే చాలానే వినిపించాయి. అసలు బిగ్ బాస్ ఆమెకు నల్లచెప దొరికిన తర్వాత కూడా మౌనంగా ఉండడం మరొక షాకింగ్ విషయం అనే చెప్పాలి.

రేటింగ్స్ కోసమేనా?
శనివారం ఎపిసోడ్లో నాగార్జున గీతూ ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అసలు నాగర్జున చెప్పారు అంటే అంతకుముందే బిగ్ బాస్ కూడా ఆ విషయంపై స్పందించాల్సి ఉంటుంది. ఆమె క్లియర్ గా చెప్పింది.. గేమ్ చేంజర్ గా ఉండాలి అని అందరూ బలంగా పోరాడాలి అని నీతులు చెప్పింది.
కానీ అది బిగ్ బాస్ చూసుకుంటాడు కదా నువ్వు ఎందుకు మధ్యలో దురావు.. అని బొచ్చులా ఉంది అని నాగ్ కామెంట్ చేశాడు. అసలు గీతూ విషయంలో బిగ్ బాస్ ఎందుకు మౌనంగా ఉన్నాడు? రేటింగ్ కోసమే ఈ విధంగా ఆట నియమాలను తప్పిస్తున్నారా అని విధంగా కామెంట్స్ కూడా వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











