Bigg Boss Telugu 6: గీతూ చేసిన అతి దారుణమైన పొరపాట్లు.. మొత్తం రెమ్యునరేషన్ ఎంతంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఎంతో రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో కొందరు బలంగానే పోరాడుతున్నారు. ఇక కొందరు అతి తెలివి కారణంగా జనాల్లో అనవసరంగా నెగిటివ్ కామెంట్స్ అందుకుంటూ బలవుతున్నారు. గీతూ రాయల్ కూడా అనవసరంగా తన అతి కారణంగానే ఇప్పుడు హౌస్ లో నుంచి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక ఆమె ఎలిమినేట్ కాబోతున్న గీతూ చేసిన తప్పులు ఏమిటి? అలాగే ఆమె 9 వారాలకు ఆమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..

టాప్ 5లో ఒకరిగా..
బిగ్ బాస్ లో మొన్నటివరకు టైటిల్ విన్నర్ అనే ట్యాగ్ తో కొనసాగుతూ వచ్చిన గీతూ రాయల్ మొత్తానికి ఈ వారం ఎలిమినేట్ కావడానికి రెడీ అయ్యింది. అసలు ఆమె టాప్ 5లో ఒకరిగా ఉంటారని అందరూ అనుకున్నారు. ఎందుకంటే గీతు ఆ రేంజ్ లో బిల్డప్ ఇచ్చింది. అసలు ఆమె గత రెండు వారాల వరకు కూడా టాప్ ఓటింగ్స్ తో నెంబర్ వన్ కు పోటీగా నిలిచింది.

గీతూ చేసిన తప్పులు
గీతూ రాయల్ కొన్ని చేయకూడని తప్పులు చేసి మూల్యం చెల్లించుకుందని చెప్పవచ్చు. అసలైతే గీతూ పెద్దగా హడావిడి చేయకుండా నార్మల్ గా కొనసాగిన కూడా సరిపోయేది. కానీ అనవసరంగా గేమ్ లో రూల్స్ కూడా బ్రేక్ చేస్తూ సంచాలకురాలిగా ఉన్నా కూడా ఆటను కొనసాగించింది. అంతే కాకుండా ఇతరుల ఆటలు కూడా చెడగొట్టాలని చూసింది.

హడావిడి క్రియేట్ చేసే ప్రయత్నం
మిషన్ పాసిబుల్ టాస్కులో అయితే గీతూ రాయల్ తానే హైలెట్ అవ్వాలని అనుకుంది. బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజెస్ లో ఆమె ఓడిపోయినప్పటికీ కూడా అదే పనిగా మళ్లీ ఆటలో ఏదో ఒక హడావిడి క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది. ఎటు తిరిగి తాను హైలైట్ అవ్వాలని చూసుకుంది కానీ మరోవైపు గేమ్ రూల్స్ బ్రేక్ చేస్తున్నాను అనే విషయాన్ని ఆమె పట్టించుకోలేదు. అయితే బిగ్ బాస్ కూడా ఆమెకు పెద్దగా అడ్డు చెప్పకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఒక్కసారిగా రివర్స్
ఏదేమైనా కూడా గీత రాయల్ బిగ్ బాస్ లో చాలా వరకు రూల్స్ బ్రేక్ చేసే నెటిజన్స్ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలకు మూటగట్టుకుంది. అంతేకాకుండా మిగతా కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ కూడా ఆమెపై ఒక్కసారిగా రివర్స్ అయ్యారు. దీంతో చాలావరకు ఓట్లపై ప్రభావం చూపాయి. ఈ వారం అతి తక్కువ ఓట్లు అందుకున్న గీతూ మొత్తానికి ఎలిమినేట్ కాక తప్పడం లేదు.

రెమ్యునరేషన్ ఎంత?
ఇక గీతూ రాయల్ మొత్తంగా తొమ్మిది వారాలకు ఏ స్థాయిలో పారితోషికం అందుకుంది అనే వివరాల్లోకి వెళితే ఆమె ఒక్క వారానికి దాదాపు 25 వేలకు పైగా పారితోషికం డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. అంటే మొత్తానికి 9 వారాలకు గాను గీతూ రాయల్ రెండు లక్షల 25 వేల వరకు అందుకున్నట్లు సమాచారం. ఒక విధంగా ఆమెకు ఇది చాలా పెద్ద అమౌంట్. మరి బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ తో గీతు రాయల్ తన కెరీర్ ను ఏ విధంగా సెట్ చేసుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











