twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: డబ్బులు ఇచ్చినా వెన్నుపోటు పొడిచారు.. బోరుమని ఏడ్చిన గీతూ రాయల్

    |

    బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ మొదట కొంత నీరసంగా కొనసాగినప్పటికీ ఆ తర్వాత మెల్లమెల్లగా ట్రాక్ లోకి వచ్చినట్లు అనిపించింది. అయితే మళ్లీ కొందరు అతి తెలివి ఉపయోగించే బిగ్ బాస్ హౌస్ లో చిరాకు తెప్పించారు. దీంతో అసలు ఈసారి సీజన్ ఏమీ బాగోలేదు అని, కంటెస్టెంట్స్ పూర్తిస్థాయిలో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం లేదు అనే కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. అయితే బిగ్ బాస్ ఊహించిన విధంగా ఎలిమినేషన్స్ ను కంటిన్యూ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక గీతూ రాయల్ కూడా వెళ్లిపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఆమె బయటకు వచ్చిన తర్వాత మొదటిసారి తన యూట్యూబ్ ఛానల్ లో బోరుమని ఏడ్చి కొందరు తనను వెన్నుపోటు పొడిచారని చెప్పుకొచ్చింది..

    టాప్ 5లో ఉంటుందని..

    టాప్ 5లో ఉంటుందని..

    బిగ్ బాస్ 6వ సీజన్ అట్టహాసంగా మొదలైనప్పటికీ కూడా రేటింగ్స్ అందుకోవడంలో మాత్రం ఈసారి ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ముఖ్యంగా కొంతమంది కంటెస్టెంట్స్ ఈసారి చాలా బాగా క్లిక్ అవుతారు అని అనుకుంటే వాళ్ళు తొందరగానే హౌస్ ల నుంచి వెళ్ళిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా గీతూ టాప్ 5 లో ఉంటుంది అనుకుంటే ఆమె షో సగం కూడా పూర్తికాకముందే ఎలిమినేట్ కావడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది.

    ఎమోషనల్ అయిన గీతూ

    ఎమోషనల్ అయిన గీతూ

    ఇక గీతు రాయల్ వెళ్లిపోయే రోజు కూడా బోరుమని విలపించి అస్సలు వెళ్లిపోలేను అని ఎంతగానో ఎమోషనల్ అయింది. ఆమె కండతడి పెట్టుకున్న విధానం ఆమె ఫ్యాన్స్ ను కూడా తీవ్రంగా హర్ట్ చేసింది. అసలు గీతూ కంటే దారుణంగా ఆడిన వాళ్ళు గ్రూప్లో చాలామంది ఉన్నారు అని వాళ్ళని పంపించకుండా గీతూ ను పంపించడం ఏమాత్రం కరెక్ట్ కాదు అని కూడా సోషల్ మీడియాలో ఓ వర్గం వారి నుంచి మద్దతు లభించింది.

     చేసిన తప్పులు

    చేసిన తప్పులు

    ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులపాటు గీతూ రాయల్ ఎక్కడ కూడా పెద్దగా ఇంటర్వ్యూలు ఇచ్చింది లేదు. అయితే మొదటిసారి ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తాను బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు ఎలా గడిచింది? అలాగే చేసిన తప్పులు ఏమిటి అనే విషయాల గురించి ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.

    వెన్నుపోటు పొడిచినట్లుగా..

    వెన్నుపోటు పొడిచినట్లుగా..

    ఒక విధంగా బిగ్ బాస్ లో జరిగిన కొన్ని విషయాలపై చాలా ఎమోషనల్ అయినా గీతూ రాయల్ మరొక విషయంలో కూడా బోరుమని విలపించింది. ముఖ్యంగా హౌస్ లోకి వచ్చే ముందే తనను ప్రమోట్ చేయమని కొందరికి 25 వేల వరకు ఇచ్చాను అని అయితే వాళ్ళు ఏ పని చేయకుండా డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు వెన్నుపోటు పొడిచినట్లుగా ఆమె ఎమోషనల్ గా తెలియజేసింది..

    నేను చేస్తే తప్పా?

    నేను చేస్తే తప్పా?

    తన గురించి ఒక్క పాజిటివ్ కామెంట్ కూడా హైలెట్ చేయలేదు అని ఆఖరికి నేను నమ్మిన స్నేహితులు కూడా నన్ను మోసం చేశారు అని గీతూ వివరణ ఇచ్చింది. చాలామంది తనకు సపోర్ట్ చేస్తారు అని నమ్మకంతోనే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లినప్పటికీ ఏ ఒక్కరి నుంచి కూడా తనకు సరైన సపోర్ట్ దొరక లేదని కూడా ఆమె వివరణ ఇచ్చింది. ఒక విధంగా నా గేమ్ ను తప్పు పట్టడం కూడా కొంత బాధ కలిగించింది. గతంలో కౌశల్ అభిజిత్ కంటే నేను తక్కువ కాదు అనుకున్నాను. వాళ్ళు చేస్తే రైట్ అనుకొన్నది నేను చేస్తే తప్పు ఏంటి? అని గీతూ ఏడుస్తూ చెప్పుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతొంది.

    English summary
    Bigg boss telugu 6 geetu royal emotional comments on cheating friends
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X