For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: నువ్ ఒక పెరుగు దొంగవి.. పోటాపోటీగా రేవంత్-గీతూ.. అక్కడ పెట్టుకోమంటూ

  |

  బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ జోరుగా కొనసాగుతోంది. శని, ఆది వారాల ఎపిసోడ్స్ దివాళి సెలబ్రేషన్స్ తో సూపర్ ఎంటర్టైనింగ్ గా జరిగాయి. ఇక ఆదివారం అయితే చాలా మంది గెస్ట్ లు వచ్చి సందడి చేశారు. యాంకర్ రష్మీ, హీరోయిన్ అవికా గోర్ తదితరులు డ్యాన్స్ తో అదరగొడితే శ్రీరామ్ చంద్ర పాటలతో ఆకట్టుకున్నాడు. ఇక సైంటిస్ట్ గా వచ్చిన హైపర్ ఆది ఒక్కొక్కరి గురించి చెబుతూ నవ్వించాడు. అయితే ఆదివారం కన్నా ఎంటర్టైనింగ్ గా సోమవారం నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ప్రతి ఒక్కరూ తమ గురించి స్టాండ్ తీసుకుని చాలా గట్టిగా వాదించుకున్నారు. ఈ క్రమంలో సింగర్ రేవంత్, గీతూ రాయల్ మధ్య పోటాపోటీగా మాటల యుద్ధం జరిగింది. బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ అక్టోబర్ 24 సోమవారం నాటి 50వ రోజు 51 ఎపిసోడ్ విశేషాలు చూద్దాం!

  ఆటపై లేదన్న ప్రధాన కారణంతో..

  ఆటపై లేదన్న ప్రధాన కారణంతో..

  బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ఏడో వారం అర్జున్ కల్యాణ్ ఎలిమినేట్ అయి ఇంటి బయటకు వెళ్లిపోయాడు. శ్రీసత్యపై ఉన్న కాన్సంట్రేషన్ బిగ్ బాస్ ఆటపై లేదన్న ప్రధాన కారణంతో ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇక సోమవారం ఎనిమిదో వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ రంజుగా సాగింది. గార్డెన్ ఏరియాలో మంట పెట్టిన బిగ్ బాస్ అందులో నామినేట్ చేయాలనుకున్న వాళ్ల ఫొటోలు వేసి కారణం చెప్పాల్సిందిగా ఆదేశించాడు.

  తమ కోసం స్టాండ్ తీసుకుని..

  తమ కోసం స్టాండ్ తీసుకుని..

  దీంతో మిగిలిన ఇంటి సభ్యులు 14 మంది ఇతరులను కారణాలు చెబుతూ నామినేట్ చేశారు. ఈసారి ప్రతి ఒక్కరూ తమ కోసం స్టాండ్ తీసుకుని మాట్లాడారు. అలాగే అందరూ డిఫెన్స్ చేసుకోడానికి చాలా బాగా ప్రయత్నించారు. ఇక రోహిత్, వాసంతి అప్పటికే నేరుగా నామినేట్ అయినందున వారిని నామినేట్ చేయకూడదని బిగ్ బాస్ తెలిపాడు. శ్రీ సత్యతో మొదలైన నామినేషన్ శ్రీహాన్ తో ముగిసింది.

  జడ్జ్ చేయడం తప్పు..

  జడ్జ్ చేయడం తప్పు..

  సూర్య, మెరీనాను శ్రీ సత్య నామినేట్ చేసింది. చిట్టీలు వేసుకున్న తర్వాత ఓటింగ్ విషయంలో ఎందుకు చెప్పలేదన్న పాయింట్ రైజ్ చేసింది శ్రీ సత్య. ఈ విషయంలో నీ ఫూలిష్ నెస్ తో వేరే వాళ్లను జడ్జ్ చేయడం తప్పు, లీడర్ లా ప్రవర్తించు అని మెరీనా అంది. దానికి నీ దగ్గర నేర్చుకుంటాలే అని శ్రీ సత్య అంది. తర్వాత మెరీనా, గీతూకు మధ్య మాటల యుద్దం జరిగింది. 7 వారాల్లో నువ్ 5 వారాలు గేమ్ ఆడలేదు. నువ్ గుడ్ పర్సన్ కానీ, గేమర్ కాదు. ఈ ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు అని గీతూ అంటే మెరీనా చాలా బాధపడింది.

  గేమ్ ఆడుతున్నట్లు కవరింగ్..

  గేమ్ ఆడుతున్నట్లు కవరింగ్..

  తర్వాత వచ్చిన రోహిత్.. గీతూ రాయల్ ని నామినేట్ చేశాడు. సర్వైవర్ టాస్క్ లో తను కావాలనే స్ట్రాంగ్ గా ఉన్న ఆదిరెడ్డి, శ్రీహాన్ పట్టుకుని లాగుతున్నట్లు, గేమ్ ఆడుతున్నట్లు కవరింగ్ ఇచ్చిందని కారణం చెప్పాడు. దీంతో గీతూ.. నువ్ స్మార్ట్ కాదు.. నేను చాలా స్మార్ట్.. అందుకే నా స్మార్ట్ గేమ్ అర్థం కాలేదు అంది. నేను నీ గేమ్ గురించి మాట్లాడుతున్న అని రోహిత్ అంటే.. నేను నీ మైండ్ గురించి మాట్లాడుతున్న అని గీతూ వాదించింది.

  నువ్ పెరుగు దొంగవే..

  నువ్ పెరుగు దొంగవే..

  రేవంత్ వచ్చి గీతూను నామినేట్ చేశాడు. నువ్ నన్ను పెరుగు దొంగ అని ఎలా అంటావ్ అని రేవంత్ క్వశ్చన్ చేస్తే.. అవును నువ్ పెరుగు దొంగవే.. అని మళ్లీ గీతూ అంది. ఈ క్రమంలోనే నువ్ ఒక ఫుడ్ దొంగవి. ఈ విషయం ఇక్కడ అందరికీ తెలుసు అని గీతూ అంటే ఏది ఒక్కరితో చెప్పించూ అని రేవంత్ అన్నాడు. దీంతో గీతూకి సపోర్టింగ్ గా కీర్తి ఉంది. తర్వాత నువ్ నా ముందు నథింగ్ అని రేవంత్ అంటే.. గీతూ కూడా అలానే ఉంది. నువ్ నన్ను ఏం పీకలేవ్ అంటూ రేవంత్ వెళ్లి కూర్చున్నాడు. దా.. ఏం పీకుతనో చూపిస్తా అని గీతూ అంది.

  ముందు పెట్టుకో, వెనుక పెట్టుకో..

  ముందు పెట్టుకో, వెనుక పెట్టుకో..


  తర్వాత ఫైమా వర్సెస్ మెరీనా పడింది. తనకు డిజాస్టర్ ట్యాగ్ ఇవ్వడం గురించి మాట్లాడుతూ ఫైమాను నామినేట్ చేసింది మెరీనా. ఈ క్రమంలో నా ఒపినియన్ ముందు పెట్టొచ్చు అని మెరీనా అంటే.. ముందు పెట్టుకో, వెనుక పెట్టుకో, పక్కన పెట్టుకో అని వెటకారంగా ఫైమా అంది. దీంతో వెనుక పెట్టుకోవడం ఏంటీ.. మాటలు కొంచెం సరిగ్గా మాట్లాడాలి, వయసుకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని మెరీనా చెప్పింది. అయినా ఫైమా ఏమాత్రం తగ్గలేదు. మెరీనా ఎలా అంటే అలా అనుకుంటూ ఇమిటేట్ చేస్తూ వెటకారంగా సమాధానాలిచ్చింది.

  ఎవరూ సేవ్ కాకుండా..

  ఎవరూ సేవ్ కాకుండా..

  అనంతరం ఒకరంటే ఒకరికి అసహ్యం వేస్తుందని, ఇరిటేషన్ వస్తుందని కీర్తి, రేవంత్ వాదించుకున్నారు. ఇక బిగ్ బాస్ తెలుగు 6 ఎనిమిదో వారం నామినేషన్లలో మొత్తం ఇంటి సభ్యులు 14 మంది ఉన్నారు. ఈ వారం ఇంటికి కెప్టెన్ కూడా లేడు. దీంతో ఎవరూ సేవ్ కాకుండా అందరూ నామినేట్ అయ్యారు.

  English summary
  Bigg Boss Contestant Geetu Royal Vs Revanth In Eighth Week Nominations And Bigg Boss Telugu 6th Season October 24 Day 50 Episode 51.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X