Bigg Boss Telugu 6: ఇండస్ట్రీలో ఒక్కడు కూడా నాతో ఆ పని చేయలేదు.. చెప్పకూడనిదే చెప్పిన గీతూ
బిగ్ బాస్ లో ఎప్పుడు ఆచారంగా వచ్చే రెండు విషయాలు శని, ఆది వారాల్లో హోస్ట్ వచ్చి ఎంటర్టైన్ చేయడం ఒకటైతే.. సోమవారం జరిగి నామినేషన్లు రెండోది. ఎప్పటిలానే శని, ఆది వారాల్లో వచ్చిన హోస్ట్ నాగార్జున బాగానే ఎంటర్టైన్ చేశాడు. ఎప్పుడూ బద్దకంగా ఉండే గీతూ రాయల్ కు ప్రతిసారి పని చెప్పి ఆమె లేజినెస్ ను వదిలించాడు. అంతేకాకుండా వయసొచ్చిన చిరుత అని కాంప్లిమెంట్ ఇస్తే.. వయసు అయిపోయిన చిరుత అని బాలాదిత్య పంచ్ వేశాడు. ఇక సోమవారం నామినేషన్లు వాడివేడీగా జరిగాయి. కానీ నామినేషన్ల కంటే ముందు ఇంటిసభ్యుల మధ్య జరిగిన చర్చలు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మరి ఆ వివరాల్లోకి వెళితే..

రెండు వారాలుగా మాత్రం..
బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ మొన్నటివరకు బాగా ఎంటర్టైన్ చేసేందుకు హౌజ్ సభ్యులు ఎంత ప్రయత్నించిన అది వర్కౌట్ కాలేదనే చెప్పాలి. కానీ గత రెండు వారాలుగా మాత్రం ఇంటి సభ్యులు బాగానే ఆకట్టుకున్నారు. కొందరు అవసరమైన మేరకు నటిస్తే.. మరికొందరు అపరిచితుడికి మించి ఓవర్ పర్ఫామెన్స్ ఇస్తున్నారు.

అవసరానికి అడ్డ దారులు తొక్కే పాత్రలు..
ఇక తాజాగా ప్రసారమైన సోమవారం అంటే అక్టోబర్ 17 నాటి 43వ రోజు 44వ ఎపిసోడ్ లో నామినేషన్లు జోరుగా సాగాయి. అందులో ఎవరు నామినేట్ అయ్యారు అనే విషయాలు పక్కన పెడితే నామినేషన్ల కంటే ముందు ఇంటి సభ్యుల మధ్య జరిగిన చర్చలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఎపిసోడ్ ప్రారంభంలోనే అన్నా చెల్లెల్లు బాలాదిత్య, గీతూ రాయల్, ఆదిరెడ్డితో కూర్చొని మాట్లాడుకున్నారు. ఆదివారం జరిగిన డైలాగ్ టాస్క్ లో అవసరానికి అడ్డ దారులు తొక్కే పాత్రలు తప్పా హీరోలు విలన్లు లేరు అనేది నాకెందుకు వేశావ్. నేను అవసరానికి అడ్డ దారులు తొక్కుతానా అని నాగార్జున సార్ అంటే ఎందుకు అవును అన్నావ్ అని బాలాదిత్యతో వాదించింది గీతూ రాయల్.

సుదీప లేకపోతే నువ్ సెట్ అయిపోతావ్..
నేను నా గురించి అన్నాను.. నీ గురించి కాదు అని వివరణ ఇచ్చిన విన్లేదు గీతూ. తర్వాత సూర్యను అడగ్గా.. కొంచెం అర్థం చేసుకునేందుకు ప్రయత్నించింది. నాగార్జున సార్ నీ పేరు అనింది నేను వినలేదు. నా గురించి అంటున్నారేమో అనుకుని అలా అవును అన్నా అని చెప్పుకొచ్చాడు బాలా. నీ పేరు విన్లేదేమో అని ఆదిరెడ్డి చెప్పగా ఊరుకుంది గీతు. తర్వాత సుదీప లేకపోతే నువ్ సెట్ అయిపోతావ్ అని అన్నావ్ కాబట్టి వచ్చి అడుగుతున్నా అని గీతుతో బాలా చెప్పాడు.

నేను నిన్ను డిస్టర్బ్ చేయను..
నీ మీద ప్రేమ లేకపోతే నా భార్యతో నీ గురించి చెప్తానా అన్నాడు. నీకు నాతో మాట్లాడకుండా ఉంటనే సంతోషం అనిపిస్తే అలానే చేయు నేను నిన్ను డిస్టర్బ్ చేయను అని చెప్పేసి వెళ్లిపోయాడు బాలాదిత్య. తర్వాత ఇనయా దగ్గరికి వెళ్లిన సూర్య ఇద్దరం కావాలని గొడవ పెట్టుకుందాం అని చెప్పి అప్పటి నుంచే స్టార్ట్ చేస్తారు. తర్వాతి రోజు ఉదయం నా వల్ల ఇనయా గేమ్ డిస్టర్బ్ కావడం నాకు ఇష్టం లేదు బిగ్ బాస్.

ఇనయా గేమ్ నేనే మారుస్తా..
నా వల్ల తను డిస్టర్బ్ అయిందేమో తెలియదు కానీ, నాకు ఎక్కువ అటెన్షన్ ఇవ్వడం వల్లే తన గేమ్ పోవడం నచ్చలేదు బిగ్ బాస్. ఇనయా గేమ్ నేనే మారుస్తా.. ఇనయా ఇండిపెండెంట్ ఉమెన్. అలాంటి వాళ్లు అంటే నాకు ఇష్టం. అమ్మ కానీ, బుజ్జమ్మను కానీ పట్టుకుని ఏడవాలని ఉంది బిగ్ బాస్ అంటూ కెమెరాలకు వినొచ్చేలా మాట్లాడాడు సూర్య. తర్వాత గీతూ, రేవంత్, ఆదిరెడ్డి, అర్జున్ లతో కూర్చొని మాట్లాడింది.

గీతూకు ఆదిరెడ్డి, రేవంత్ పంచ్ లు..
నన్ను ఇండస్ట్రీలో ఒక్కడు కూడా.. కనీసం ఫ్లర్ట్ కూడా చేయలేదు. నన్ను అంతా అక్కా అనే పిలుస్తారు తెలుసా.. అని గీతూ చెప్పుకొచ్చింది గీతూ రాయల్. దీంతో కంపని తెచ్చి తగిలించుకోవడం ఎందుకుని ఊకున్నారేమో అని ఆదిరెడ్డి పంచ్ వేశాడు. తర్వాత నేను అందంగా లేనేమో అని గీతూ చెప్పడంతో.. నువ్ అందంగా లేకపోవడం ఏంటీ తల్లి.. నీతో పెట్టుకుంటే వాళ్లు మందంగా అయిపోతారని ఊకున్నారు. వాళ్లంతా లక్కీ ఫెల్లోస్ అని కౌంటర్ వేశాడు రేవంత్.

బురదతో నామినేట్..
తర్వాత మళ్లీ నన్ను ఒక్కడంటే ఒక్కడూ కూడా ఏం చేయలేకపోయారని చెప్పకూడని మాటలు మాట్లాడింది గీతూ రాయల్. ఈ డిస్కషన్ల తర్వాత బురదతో ఇంటి సభ్యులను నామినేట్ చేయాలి. ఇంటి సభ్యులు కారణాలు చెబుతూ నామినేట్ చేశారు. నామినేట్ అయిన సభ్యులు కుర్చీలో కూర్చున్నప్పడు వారిపై పైనుంచి బురద పడుతుంది. ఈ నామినేషన్లలో 13 మంది నామినేట్ అయ్యారు.


Click it and Unblock the Notifications











