For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: రేవంత్ నాకు ముద్దు పెట్టాడు.. ఫైమాపై పడుకుని అలా.. నీ భార్య చూస్తే?

  |

  చాలా అనుమానాల నడుమ తెలుగు బుల్లితెరపైకి వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకులందరి దృష్టినీ ఆకర్షించి.. భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్న ఏకైక షో బిగ్ బాస్. ఎప్పటికప్పుడు సరికొత్త టాస్కులు ఇస్తూ, బోల్డు కంటెంట్‌ను ప్రసారం చేస్తూ ఈ షోను నిర్వహకులు మరింత సక్సెస్ చేశారు. ప్రస్తుతం ప్రసారమవుతున్న బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ రసవత్తరంగానే సాగుతోంది. మొన్నటివరకు బిగ్ బాస్ పుట్టిన రోజు వేడుకలతో ఎవరికీ నచ్చిన పర్ఫామెన్స్ వారు ఇచ్చారు. ఇక తాజాగా అక్టోబర్ 6 గురువారం ప్రసారమైన 32వ రోజు 33వ ఎపిసోడ్ లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నిర్వహించారు. అంతేకాకుండా ఈ ఎపిసోడ్ లో సింగర్ రేవంత్ గురించి పలు షాకింగ్ విషయాలు తెలిశాయి.

  వరుసగా సీజన్లు..

  వరుసగా సీజన్లు..

  తెలుగులో బిగ్ బాస్ షో ఎంత సక్సెస్ అయిందో తెలిసిందే. అందుకే నిర్వాహకులు వరుసగా సీజన్లను ప్రసారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఆరో సీజన్‌ను ఎన్నో అంచనాల నడుమ మొదలు పెట్టారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని టాస్కులు ఇస్తూ కొత్త కంటెంట్‌ను చూపిస్తున్నారు. కానీ, ఎందుకనో ఈ సీజన్‌కు స్పందన రావట్లేదు. దీంతో రేటింగ్ కూడా దక్కట్లేదు.

  గొడవలు లేకుండా..

  గొడవలు లేకుండా..


  ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్‌లో ఐదో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ప్రతి నామినేషన్లల కాకుండా పెద్దగా గొడవలు లేకుండానే సాగింది. ఇందులో త్యాగాలు, ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా కనిపించాయి. ఇలా ఈ ప్రక్రియలో మొత్తంగా 8 మంది నామినేట్ అయ్యారు. వారిలో ఇనాయా సుల్తానా, మెరీనా, బాలాదిత్య, చలాకీ చంటి, ఫైమా, వాసంతి కృష్ణన్, ఆది రెడ్డి, అర్జున్ కల్యాణ్‌లు ఉన్నారు.

   నువ్ బాగా ఫ్రీ మోడ్ లో వెళ్లిపోతున్నావ్..

  నువ్ బాగా ఫ్రీ మోడ్ లో వెళ్లిపోతున్నావ్..


  ఇక రెండు రోజులు జరిగిన బిగ్ బాస్ బర్త్ డే వేడుకల్లో కంటెస్టెంట్లు చురుగ్గా పాల్గొన్నారు. ఈ వేడుకల తర్వాత ప్రసారమైన అక్టోబర్ 6 నాటి 32వ రోజు 33వ ఎపిసోడ్ లో రేవంత్ గురించి పలు విషయాలు తెలిశాయి. రేవంత్, ఆది రెడ్డి, గీతూ రాయల్ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే నీకు ఇది జరిగినప్పుడే చెప్పొచ్చో లేదో అని అప్పుడు ఊకున్నా.. కానీ ఇప్పుడు చెబుతున్నా.. అమ్మాయిలతో నువ్ బాగా ఫ్రీ మోడ్ లో వెళ్లిపోతున్నావ్.. వాళ్లు కంఫర్టబులో కాదో చూస్కో అని అంది గీతూ రాయల్.

  నేను కంఫర్టబుల్ గా ఫీల్ కాలేదు..

  నేను కంఫర్టబుల్ గా ఫీల్ కాలేదు..

  దేని గురించి అంటున్నావో క్లారిటీగా చెప్పు అని రేవంత్ అడగడంతో.. నువ్ నాకు బుగ్గ మీద ముద్దుపెట్టావ్ కదా.. నేను కంఫర్టబుల్ గా ఫీల్ కాలేదు. నీ ఉద్దేశం అది కాదని నాకు తెలుసు. నువ్ ఎంత ఫ్రీగా ఉన్నా కానీ, అంతగా వాళ్ల కంఫర్ట్ కూడా చూసుకోవాలి అని గీతూ చెప్పింది. దీనికి ఛీ ఛీ.. నాకు అలాంటి ఉద్దేశమే లేదు, నీకు అలా ఎందుకు అనిపించిందో నాకు తెలియదు అని రేవంత్ అన్నాడు.

  నిన్న ఫైమాపై కూడా పడుకున్నావ్..

  నిన్న ఫైమాపై కూడా పడుకున్నావ్..

  అది నాకు తెలుసు. నిన్న ఫైమాపై కూడా పడుకున్నావ్.. ఆమె కంఫర్టబులో కాదో నీకు తెలియదు.. వాళ్లను ఒకసారి అడుగు కంఫర్టా కాదా అని. బ్యాడ్ ఇంప్రెషన్ కలుగుతుంది. ఎంట్రా రేవంత్ ఇలా చేస్తున్నాడు అని అనుకుంటారు. చూసేవాళ్లు ఏం అనుకుంటారో తెలియదు కదా.. ఇది వేరేలా వెళ్లదు బట్.. నీకు జాగ్రత్త చెబుతున్నా.. మీ అన్విత (రేవంత్ భార్య) కూడా ఏం అనుకోకుడదు కదా.. మా రేవంత్ ఏంటీ ఇలా చేస్తున్నాడు అని అనుకోకూడదనే చెబుతున్నా అని గీతూ అంది.

  ఎవరైనా ఏమైనా అంటున్నారా..

  ఎవరైనా ఏమైనా అంటున్నారా..


  దీనికి రేవంత్ యా యా అవును.. థ్యాంక్స్ అని చెప్పాడు. తర్వాత అక్కడికి వచ్చిన ఫైమాతో.. నేను నిన్న నీమీద పడుకున్నా కదా.. ఏం అనుకోకు.. అని రేవంత్ అంటాడు. అందుకు ఏ.. ఎవరైనా ఏమైనా అంటున్నారా అని ఫైమా అంది. లేదు మాములుగానే చెబుతున్నా సారీ అని రేవంత్ అంటే.. నేనేం ఫీల్ కాలేదు, నువ్ ఫీల్ కాకు అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఫైమా. అయితే రేవంత్ ముద్దు పెట్టుకోవడం, ఫైమాపై పడుకోవడం ప్రసారమైన ఎపిసోడ్ లలో మాత్రం చూపించలేదు.

  మొత్తంగా 21 మంది కంటెస్టెంట్లు..

  మొత్తంగా 21 మంది కంటెస్టెంట్లు..


  ఈ సీజన్‌లోకి కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు 21 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. కానీ వీరిలో ఇప్పటికీ 4 వారాల్లో షానీ, అభినయ, నేహా, ఆరోహి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఐదో వారం నామినేషన్లలో 8 మంది ఉన్నారు.

  English summary
  Bigg Boss Telugu 6th Season October 6th 32 Day 33 Episode Written Updates And Geetu Royal Says Revanth Kissed Her.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X