Bigg Boss Telugu 6: అర్ధరాత్రి రచ్చ.. ఆమె దుప్పట్లో చేయి పెట్టిన శ్రీహాన్.. చివర్లో బిగ్ షాక్

బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా ఇండియాలోకి పరిచయం అయిన కార్యక్రమమే బిగ్ బాస్. హిందీలో ఎప్పుడో ప్రారంభం అయిన దీనికి ప్రేక్షకులు మంచి స్పందనను అందించారు. దీంతో ఇది సూపర్ హిట్ అవడంతో ఎన్నో సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. హిందీలో వచ్చిన స్పందనను చూసి మిగిలిన భాషల్లోనూ ఈ షోను పరిచయం చేశారు.

అలా ఆదేళ్ల క్రితమే తెలుగులోకి కూడా ఇది వచ్చింది. ఎన్నో అనుమానాల మధ్య వచ్చిన ఈ షో.. ప్రేక్షకుల నుంచి ఊహించని విధంగా భారీ స్పందనను అందుకుంది. దీంతో ఇప్పుడు ఆరో సీజన్‌ను ప్రతిష్టాత్మకంగా ప్రసారం చేస్తున్నారు. ఇక, రాబోయే ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల మధ్య ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. ఆ వివరాలేంటో మీరే చూడండి!

ఆసక్తికరంగా సాగుతోన్న ఆరో సీజన్

ఆసక్తికరంగా సాగుతోన్న ఆరో సీజన్

తెలుగులో ప్రసారం అయ్యే బిగ్ బాస్‌కు మాత్రమే భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. సామాన్యులే కాదు.. దీనికి సెలెబ్రిటీలు కూడా అభిమానులుగా మారిపోయారు. ఫలితంగా ఈ షోపై భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఆరో సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. ఈ సీజన్ అంచనాలకు తగ్గట్లుగానే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది.

 రెండో వారం కెప్టెన్సీ టాస్కు ఇలా

రెండో వారం కెప్టెన్సీ టాస్కు ఇలా

బిగ్ బాస్ ఆరో సీజన్ రెండో వారానికి సంబంధించిన 'సిసింద్రీ' అనే కెప్టెన్సీ టాస్కును ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో అందరూ బొమ్మలు పట్టుకుని ఉండాలి. ఆ బొమ్మలకు బిగ్ బాస్ చెప్పిన వాళ్లు సపర్యలు చేయాలి. ఆ తర్వాత వాటిని తీసుకొచ్చి ట్రాలిలో వేయాలి. అలా వేసిన వాళ్లకు టాస్కు ఉంటుంది. అందులో గెలిచిన ఒకరిని కెప్టెన్సీ కంటెండర్‌గా ఎంపిక చేస్తారు.

చంటి విన్.. మరో నలుగురి కోసం

చంటి విన్.. మరో నలుగురి కోసం

మంగళవారం రాత్రి జరిగిన 'సిసింద్రీ' టాస్కులో భాగంగా మొదటి రౌండ్‌లో జరిగిన టాస్కులో చలాకీ చంటి విజయం సాధించి తొలి కెప్టెన్సీ పోటీదారుడిగా నిలిచాడు. ఈ టాస్కు జరిగిన సమయంలో ఫైమా, రేవంత్ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రేవంత్ అక్కడ జరిగిన దానికి అసహనంతో తన బొమ్మను వదిలేశాడు. ఫలితంగా అతడిని ఈ టాస్కు నుంచి తప్పించాడు.

అర్ధరాత్రి కూడా ఆట కొనసాగేలా

అర్ధరాత్రి కూడా ఆట కొనసాగేలా

'సిసింద్రీ' టాస్కులో భాగంగా మొదటి పోటీదారుడిని ఎంపిక చేసిన తర్వాత విరామం ప్రకటించాడు బిగ్ బాస్. ఈ టాస్కు బుధవారం కంటిన్యూ అవుతుందని చెప్పాడు. అయితే, ఆఖర్లో ట్విస్ట్ ఇస్తూ ప్రతి కంటెస్టెంట్ తమ బొమ్మలను తమ దగ్గరే దాచుకోవాలని కూడా చెప్పాడు. దీంతో ప్రతి ఒక్కరూ తమ బొమ్మలను కాపాడుకునేందుకు ఎంతగానో వ్యూహాలను రచించుకున్నారు.

అర్జున్ కల్యాణ్‌కు శ్రీహాన్ బిగ్ షాక్

అర్జున్ కల్యాణ్‌కు శ్రీహాన్ బిగ్ షాక్

ఇక, బుధవారం జరగనున్న 'సిసింద్రీ' టాస్కుకు సంబంధించిన ప్రోమోను బిగ్ బాస్ టీమ్ తాజాగా విడుదల చేసింది. ఇందులో తెల్లవారుజామున మూడు గంటల సమయంలో శ్రీహాన్.. అర్జున్ కల్యాణ్ బెడ్ దగ్గరకు వెళ్లి అతడి బొమ్మను దొంగతనం చేసి తీసుకొచ్చాడు. ఆ వెంటనే డిస్‌క్వాలిఫై చేసే ప్రాంతంలో దాన్ని పెట్టాడు. దీనిపై అర్జున్.. శ్రీహాన్‌తో వాగ్వాదానికి దిగినట్లు చూపారు.

గీతూ దుప్పట్లో చేయి పెట్టడంతో

అర్జున్ కల్యాణ్ బొమ్మను దొంగలించిన తర్వాత శ్రీహాన్.. చాలా మంది కంటెస్టెంట్ల దగ్గరకు వెళ్లడం తాజా ప్రోమోలో కనిపించింది. ఈ క్రమంలోనే అతడు గీతూ రాయల్ పడుకున్న బెడ్ దగ్గరకు వెళ్లాడు. అంతేకాదు, దుప్పట్లో చేయి పెట్టి పైకి లేపాడు. అప్పుడు ఆమె టీషర్ట్‌లో బొమ్మ ఉండడంతో భయపడి అక్కడి నుంచి వచ్చేశాడు. ఇది హౌస్‌లోని కొందరు చూసి నవ్వుకున్నారు.

 శ్రీహాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చింది

శ్రీహాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చింది

అర్జున్ కల్యాణ్ బొమ్మను దొంగిలించి.. మిగిలిన వాళ్లను దెబ్బకొట్టాలని ప్రయత్నించిన శ్రీహాన్.. తెల్లవారుజామున పడుకున్నాడు. ఆ సమయంలో గీతూ రాయల్ అతడి బెడ్ దగ్గరకు వెళ్లి బొమ్మను దొంగిలించింది. వెంటనే దాన్ని తీసుకొచ్చి డిస్‌క్వాలిఫై చేసే ప్రాంతంలో పెట్టేసింది. ఇలా ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఈ ఎపిసోడ్‌ను మరింతగా రక్తి కట్టించినట్లు ప్రోమోలో చూపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X