Bigg Boss Telugu 6: హౌస్ లో పంచ్ తో మరో గొడవ.. కామెడీగా ఉందంటూ చంటిపై గీతూ సెటైర్
బిగ్ బాస్ ఈవారం తుది దశకు చేరుకుంటున్న కొద్ది కూడా సరికొత్త మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా కెప్టెన్సీ టాస్క్ కోసమైతే ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా వారి శక్తికి మించి పోరాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధంగా గత వారం కంటే ఈ వారం కంటెస్టెంట్స్ మరింత కోపంగా కూడా కనిపిస్తున్నారు. అయితే బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ లో మరొక లెవెల్ ను కూడా మొదలు పెట్టేసాడు. ఈ గేమ్ లో కంటెస్టెంట్స్ మధ్యలో చాలా గొడవలు జరగబోతున్నట్లు అర్థమవుతుంది. ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో కూడా వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

అర్థం లేని గొడవలు
మరోసారి కెప్టెన్సీ టాస్క్ లో పోటీపడేందుకు కంటెస్టెంట్స్ అందరూ ఎవరికివారు మేమే స్ట్రాంగ్ అంటూ చెప్పుకుంటూ తిరుగుతున్నారు. అయితే ఈ క్రమంలో కపుల్స్ రోహిత్ మెరీనా మధ్యలో మరోసారి అర్థం లేని గొడవలు మొదలయ్యాయి. నేను స్ట్రాంగ్ అంటూ గేమ్ ఆడతాను అంటూ మెరీనా చెబుతూ ఉంది ఇక రోహిత్ ఏదో చెప్పబోతూ ఉండగా ఆమె పక్కకు వెళ్ళిపోతూ ఉండడంతో మాట్లాడురా అంటూ మళ్లీ అతను సీరియస్ అయిపోయాడు. ఇక వీరి మధ్యలో గొడవలు ఎందుకు జరుగుతాయో అర్థం కాదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కెప్టెన్సీ టాస్క్ సెకండ్ లెవెల్
ఈసారి కెప్టెన్సీ టాస్క్ లో మొదటి లెవెల్లో బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ పంచ్ పడు. ఇక ఎవరైతే బాక్సింగ్ గ్లోవ్స్ ముందుగా పట్టుకుంటారో వారు ఒకరిని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించే అవకాశం పొందుతారు అని బిగ్ బాస్ చెప్పినట్లుగా రేవంత్ తెలియజేశారు. అయితే ఈ క్రమంలో ఎవరికి వారు వారికి నచ్చని కంటెస్టెంట్స్ ఫోటోలపై పంచ్ ఇచ్చు బలమైన కారణాన్ని చెప్పే ప్రయత్నం చేశారు.

రేవంత్ అతన్ని టార్గెట్
ఇక రేవంత్ అయితే ఊహించినట్లుగానే రాజశేఖర్ ను ఈ పోటీలో నుంచి తప్పిస్తున్నట్లుగా నామినేట్ చేశాడు. ఒకసారి అవకాశం వచ్చినప్పుడు నువ్వు దాన్ని సరిగా యూజ్ చేసుకోలేదు అని అన్నాడు. ఇక మధ్యలో రాజశేఖర్ ఒకసారి అవకాశం ఇస్తే మరోసారి రాకూదా అని అన్నాడు. ఇక తర్వాత వాసంతిని కెప్టెన్సి రేసు నుంచి తప్పిస్తున్నట్లు సూర్య తెలియజేశాడు. ఆమెకు ఇనిషియేట్ తీసుకోవడం తెలియదు అని సూర్య ఓపెన్ గా తెలియజేశాడు.

గీతూ vs చంటి
మరోసారి ఆదిరెడ్డి కూడా అర్జున్ అయితే అసలు సెట్ అవ్వడు అనే విధంగా మాట్లాడేశాడు. ఇక మరోసారి బజర్ మోగినప్పుడు చంటి పరుగెత్తుకుంటూ బాక్సింగ్ గ్లోవ్స్ పట్టుకున్నాడు. ఇక కెప్టెన్సీ అంటే అందరితోనూ కలిసి మెలిసి ఉండాలి అని.. అన్ని పనులు షేర్ చేసుకోవాలి అని అందులో గీతూ కరెక్ట్ కాదు అని చంటి చెప్పడంతో గేమ్ రాని వాళ్ళు నా గురించి మాట్లాడుతుంటే నాకు కామెడీగా ఉంది అని గీతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది.
గొడవకు వస్తానంటే..
ఇక నాకు అనిపించింది చెప్పాను.. అయినప్పటికీ గీతూ ప్రతిసారి పోకింగ్ చేస్తోంది అని చంటి అసహనం వ్యక్తం చేశాడు. ఇక గీతూ అందుకు నిజంగానే గేమ్ రాని వాళ్ళు నా గురించి మాట్లాడుతుంటే కామెడీగా ఉంది అని మరోసారి అదే మాట చెప్పింది. ఏ గేమ్ ఆడలేదు అని చంటి కూడా ప్రశ్నించాడు. ఇక నీకు తెలిసిందే చటాకు అంటూ కౌంటర్ ఇచ్చిన చంటి నీకు వంద సార్లు చెప్పాను ఈ ఇలాంటి మాటలు ఆపేసుకుంటే మంచిది అంటూ.. ప్రతిదానికి గొడవకు వస్తానంటే ఎవడు ఖాళీగా కూర్చోలేదు అని చంటి మరింత సీరియస్ అయ్యాడు. మరి వీరి గొడవ ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











