Bigg Boss Telugu 6 అల్లు అర్జున్, మహేష్ బాబును దించేశాడుగా.. నాగ్‌కు ఆర్జే సూర్య అలా షాక్
బిగ్‌బాస్ తెలుగు 6 రియాలిటీ షో బ్రహ్మండంగా ప్రారంభమైంది. ఇప్పటికే భారీ పాపులారిటిని సంపాదించుకొన్న ఈ షోలోకి ఈ సారి యువతరానికి పెద్ద పీట వేశారు. నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షోలోకి ఆర్జే సూర్య అడుగుపెట్టాడు. ఆర్జే సూర్య గురించి క్లుప్తంగా వివరాలు మీ కోసం..
ఆర్జే అందరికి సుపరితులైన సూర్య అసలు పేరు సూర్యనారాయణ అలియాస్ కొండబాబు. వినోదరంగంలో రేడియో జాకీగా, యాంకర్, మిమిక్రీ ఆర్టిస్టుగా, రచయితగా నటుడిగా రాణిస్తున్నారు. ఈస్ట్ గోదావరి జిల్లాలోని పసువల్లంక పుట్టిన ఆయన భీమవరంలో పెరిగాడు. ఓ దశలో పసువుల్లంకను వరదలు ముంచెత్తడంతో ఆయన కుటుంబం భీమవరంలో స్థిరపడంది.

రెడ్ ఎఫ్ఎంలో రేడియో జాకీగా కెరీర్ ఆరంభించాడు. సినీ నటులను అనుకరించడంలో ఆర్జే సూర్యకు పెట్టింది పేరు. 2016లో గుంటూరు టాకిస్ చిత్రంలో నటించాడు. ఆ తర్వాత గరుడవేగ చిత్రంలో నటించింది. సాక్షి టెలివిజన్‌లో మిమిక్రీ ఆర్టిస్టుగా పనిచేశారు.
ప్రస్తుతం నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వ్యవహరించే బిగ్‌బాస్ తెలుగు 6లోకి సూర్య అడుగుపెట్టాడు. నాగార్జున కోరిక మేరకు అల్లు అర్జున్, చిరంజీవి, మహేష్ బాబు, చిరంజీవి వాయిస్‌ను అనుకరించి మెప్పించాడు.


Click it and Unblock the Notifications











