Bigg Boss Telugu 6 హౌజ్ లో కోడి బుర్రపై చర్చ.. హిట్ 2 మూవీ సందడి.. అడవి శేష్ కు ఆదిరెడ్డి పంచ్

బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ఆసక్తికరంగా ఎమోషనల్ గా సాగిపోతోంది. బిగ్ బాస్ చరిత్రలో ఏ సీజన్ లో జరగని ఎమోషనల్ ఈవెంట్స్ ఈ ఆరో సీజన్ లో జరిగాయని చెప్పొచ్చు. అలాగే అనుకోని సంఘటనలు, ట్విస్ట్ లు, బీబీ టీమ్ నయా ప్లాన్స్ తో ఆద్యంతం ఎంటర్టైన్ మెంట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ సీజన్ కూడా చివరి దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో టైటిల్ విన్నర్ ను ప్రకటించనున్నారు. ప్రస్తుతం హౌజ్ లో 8 మంది ఉన్నారు. వారిలో ఈ 13వ వారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు. అయితే డిసెంబర్ 4 ఆదివారం నాటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

 ఆరుగురు నామినేట్..

ఆరుగురు నామినేట్..

బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో ప్రస్తుతం మిగిలిన 8 మందికి 13వవారం నామినేషన్స్ ప్రక్రియ నిర్వహించారు. ఈ వారం కెప్టెన్ అయినా కారణంగా ఇనయా సుల్తానా, ఎవరు నామినేట్ చేయనందున శ్రీహాన్ సేఫ్ అయ్యాడు. దీంతో మిగతా ఇంటి సభ్యులు అయినా రోహిత్, రేవంత్, ఫైమా, ఆదిరెడ్డి, శ్రీ సత్య, కీర్తి భట్ ఆరుగురు నామినేట్ అయ్యారు. వీరంత ప్రస్తుతం నామినేషన్ లో ఉన్నారు.

ఆ ఇద్దరు సేఫ్..

ఆ ఇద్దరు సేఫ్..

అయితే శని, ఆది వారాల్లో హోస్ట్ వచ్చి ఎంటర్టైన్ చేయడం, ఇంటి సభ్యుల ఆట తీరుపై రివ్యూ చేయడం తెలిసిందే. అలాగే ఎవరు సేఫ్ కానున్నారు, ఎవరు ఎలిమినేట్ కానున్నారనేది కూడా హోస్ట్ నాగార్జున చెబుతారు. శనివారం నాటి ఎపిసోడ్ లో నామినేషన్ నుంచి కీర్తి భట్, రోహిత్ ఇద్దరు సేవ్ అయ్యారు. దీంతో మిగిలిన నలుగురు అయినా రేవంత్, ఆదిరెడ్డి, శ్రీసత్య, ఫైమా నామినేషన్లలో ఉన్నారు.

హిట్ 2 మూవీ సందడి..

హిట్ 2 మూవీ సందడి..

ఆదివారం ఎపిసోడ్ లో వాళ్లలో ఎవరు సేవ్ అయ్యారో చెప్పి.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ను ప్రకటిస్తారు. బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ 13వ వారం జబర్దస్త్ కమెడియన్ ఫైమా ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే డిసెంబర్ 4 ఆదివారం ఎపిసోడ్ నాటి ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇవాళ్టి ఎపిసోడ్ లో హిట్ 2 మూవీ టీమ్ సందడి చేయనుంది. ఇందులో భాగంగా అడవి శేష్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ శైలేష్ కొలను స్టేజిపైకి వచ్చి అలరించారు.

కోడి బుర్రపై చర్చ..

కోడి బుర్రపై చర్చ..

ప్రోమోలో కోడి బుర్ర అని రాసి.. దానిపై ఒక హారర్ డిజైన్ వేయమని ఇంటి సభ్యులకు నాగార్జున చెప్పాడు. అలానే రేవంత్ చేశాడు. ఇప్పుడు ఒక కూల్ కాప్ వస్తున్నాడు. అతను ఆ బొమ్మ ఎవరు వేశారనేది కనిపెడతాడు నాగార్జున చెబుతాడు. దీంతో అడవి శేష్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చాడు. వాళ్లలో ఒకరు నేరం చేశారని నాగార్జున అంటే.. ఆ కోడి బుర్ర అని రాసి ఉన్నది చూసి నన్ను కోడి బుర్ర అంటున్నారా అని అడవి శేష్ అన్నాడు. దీంతో ఫైమా రియాక్షన్ ఇవ్వడంతో.. ఫైమా నువ్ నన్ను కామెంట్ చేశావా అనిగాడు అడవి శేష్. దానికి ఆమె లేదు అని సైగ చేసింది.

 మీరు కదా సార్ కనుక్కోవాల్సింది..

మీరు కదా సార్ కనుక్కోవాల్సింది..

అందరిని ఒకసారి లేచి నిల్చోమన్నాడు శేష్.. హైట్ ను బట్టి అది రాసింది ఎవరో కనిపెడతా అని చెప్పాడు. మీడియం హైట్ ఉన్నవాళ్లే రాసి ఉంటారనుకుంటున్నా అని శేష్ అంటే.. వంగి కూడా రాయొచ్చు కదా అని రోహిత్ అన్నాడు. ఆది రెడ్డి నువ్వా రాసింది అని శేష్ అంటే.. సార్ కనుక్కోవాల్సింది మీరు కదా సార్ అని పంచ్ వేశాడు ఆదిరెడ్డి. తర్వాత అందరి చేతులను చూపించమన్నాడు అడవి శేష్. రఫ్ నెస్ ను బట్టి చెబుతా అన్నాడు హీరో.

అతని యాక్టింగే కాదని...

ఫైమా అంటే కొంచెం నమ్ముతా గానీ ఇనయా చేతులైతే ఎప్పుడు హార్డ్ వర్క్ చేయనట్టు ఉన్నాయని అడవి శేష్ అన్నాడు. శ్రీహాన్ ఒకసారి నీ చేతులు చూపించు అంటే పెన్నుతో ఏదో రాసినట్లు చేసి దాన్ని కిందపడేసి చేతులు చూపించాడు. దీంతో శ్రీహాన్ కాదు.. ఎందుకంటే అతను చేసిన యాక్టింగే అతను కాదని చెబుతుందని అడవి శేష్ అన్నాడు. శ్రీసత్య గురించి అడిగితే.. ఆమె బుర్రలో ఎప్పుడూ కోడే అని నాగార్జున సెటైర్ వేశాడు. తర్వాత ఇంటి సభ్యులతో గేమ్ ఆడించాడు అడవి శేష్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X