Bigg Boss Telugu 6: హౌస్ లో చివరి కెప్టెన్సీ టాస్క్.. గెలిచినోళ్ళకు బంపరాఫర్.. లక్కీ ఛాన్స్ ఎవరికంటే?

బిగ్ బాస్ ఒకవైపు ఎమోషన్స్ తో కొనసాగుతూనే మరొకవైపు సరి కొత్త టాస్క్ లతో మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఈ వారం కుటుంబ సభ్యులందరినీ ఇంట్లోకి పిలుస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను మరింత ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నాడు. ఇక ఆట తీరును కూడా ఎప్పటికప్పుడు మార్చుకునే విధంగా బిగ్ బాస్క్ సరికొత్త టాస్క్ లను మొదలు పెడుతున్నాడు. ఇక ఈవారం కెప్టెన్సీ టాస్క్ కూడా ఎంతో ఆసక్తికరంగా మారబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈసారి కెప్టెన్సీ టాస్క్ లో బిగ్ బాస్ అద్భుతమైన అవకాశాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. ఎవరైతే గెలుస్తారో ఏకంగా సెమీఫైనల్ వీక్ కు వెళ్లే విధంగా ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

చివరి కెప్టెన్సీ టాస్క్

చివరి కెప్టెన్సీ టాస్క్

ఇక ఇంటి సభ్యులకు ఈ వారం ఇస్తున్న చివరి కెప్టెన్సీ టాస్క్ గ్రాబ్ అండ్ రన్ అంటూ ఇనయా సుల్తానా బిగ్ బాస్ ఇచ్చిన వివరణలు చదివి వినిపించింది. ఇక ఒక సర్కిల్ లో అందరూ నిలబడాలి. మధ్యలో ఉండే బాల్ పట్టుకుని పరిగెత్తుతూ ఉండాలి. ఇక ఆట మొదలవగానే కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక్కసారిగా బాల్ ను పట్టుకోడానికి ముందుకు వెళ్లారు. కానీ ఆదిరెడ్డి మాత్రం చాలా కూల్ గా ఒక అడుగు ముందుకు వేశాడు.

రేవంత్ దూకుడు

రేవంత్ దూకుడు

అయితే ఈ ఆటలో ఎప్పటిలానే రేవంత్ మళ్లీ చాలా సీరియస్ గా ఆడినట్లు అనిపించింది. ఇక అబ్బాయిలందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్లారు. ఆదిరెడ్డి మళ్లీ ఊహించిన విధంగా రాజశేఖర్ బాల్ పట్టుకున్నప్పుడు అతని చేయి నుంచి లాక్కునే ప్రయత్నం చేశాడు. ఇక మరికొందరు వారి నుంచి మరొకరికి పాస్ చేసే విధంగా గేమ్ ఆడారు. ఇక ఈ ఆటలో అమ్మాయిలు కూడా చాలా గట్టిగానే పోరాడారు.

శ్రీహన్ vs రేవంత్

శ్రీహన్ vs రేవంత్

అసలు క్యాచ్ లు ఎందుకు వేసుకుంటున్నారు అని ఫైమా అబ్బాయిలను ప్రశ్నించింది. రేవంత్ శ్రీహన్ మధ్యలో కూడా గొడవ గట్టిగానే జరిగింది. ఇక మధ్యలో రేవంత్ కాస్త దూకుడుగా ప్రవర్తించడంతో నీ చేయి ప్రెజర్ కాస్త ఎక్కువగా పడుతుంది రా అంటు శ్రీహన్ అతనితో వాదించాడు. కొన్నిసార్లు వినాలి చూడాలి అంటూ రేవంత్ అతనికి సమాధానం ఇచ్చాడు. ఏదైనా సరే చూడకుండా మాట్లాడకురా అంటూ రేవంత్ మరొక కౌంటర్ ఇచ్చాడు.

కెప్టెన్ అయితే మాత్రం

కెప్టెన్ అయితే మాత్రం

అయితే ఈ టాస్క్ కోసం కంటెస్టెంట్స్ అందరూ ఎందుకు ఇంత బలంగా పోరాడుతున్నారు అంటే ఎవరైనా సరే గెలిచి కెప్టెన్ అయితే మాత్రం నేరుగా సెమి ఫైనల్ వీక్ కు వెళతారు. అంటే ఫైనల్ కు ఒక్క అడుగు దూరంలో మాత్రమే. అందుకే ఈ ఆటలో గెలిచినందుకు అందరూ కూడా పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఆదిరెడ్డి అయితే చివరలో గట్టిగా అరుస్తూ కనిపించాడు. మొత్తానికి ఈరోజు ప్రసారం కాబోయే ఈ ప్రోమో అయితే చాలా హైలెట్గా నిలిచింది.

సెమీఫైనల్ లో ఇనయా

సెమీఫైనల్ లో ఇనయా

అయితే ఈ ఆటలో ఇనయా సుల్తానా గెలిచినట్లుగా తెలుస్తోంది. అబ్బాయిలు బలంగా ఉన్నప్పటికీ కూడా ఆమె సోలోగా గెలిచి డైరెక్ట్ గా ఫైనల్ వీక్ లోకి ప్రవేశించినట్లు సమాచారం. ఇక సెమి ఫైనల్ అంటే దాదాపు ఫైనల్ కు కొద్ది దురనికి చేరుకున్నట్లే. మరి ఈ అవకాశాన్ని ఆమె ఎంతవరకు ఉపయోగించుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X