twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: వాడివేడీగా నామినేషన్లు.. అందరి టార్గెట్ ఇనయా, కుండదాచిపెట్టిన ఆదిరెడ్డి

    |

    బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ నామినేషన్లతో చలిలో వేడి పుట్టిస్తోంది. హోస్ట్ నాగార్జున సండే అంటే ఫండే అని అంటారు గానీ, నిజానికి ప్రేక్షకులకు అసలైన ఫండే సోమవారమే. నామినేషన్లలో భాగంగా ఇంటి సభ్యుల మధ్య జరిగే విమర్శలు, ప్రతి విమర్శలు, టాకింగ్ వార్, సెటైర్లు, బిహేవియర్స్ వాళ్లకేమో కానీ ఆడియెన్స్ కు మాత్రం ఫన్ క్రియేట్ చేస్థాయి. ఇప్పుడు బిగ్ బాస్త తెలుగు 6 తొమ్మిదో వారం నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. తగిన కారణాలతో ఇంటి సభ్యుల దిష్టి బొమ్మపై కుండను పెట్టి పగలగొట్టి నామినేట్ చేయాలి. ఈ ప్రక్రియ సోమవారం జరుగుతుందని తెలిసిందే. బిగ్ బాస్ తెలుగు 6 అక్టోబర్ 31 సోమవారం నాటి ఎపిసోడ్ కు సంబంధించిన రెండో ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

     అప్పుడు హ్యుమానిటీ గుర్తుకు రాలేదమ్మా..

    అప్పుడు హ్యుమానిటీ గుర్తుకు రాలేదమ్మా..

    ఈ ప్రోమోలో.. కీర్తిని శ్రీహాన్ నామినేట్ చేస్తూ ఫస్ట్ మనం చెప్పుకోబోయే చాప్టర్ పేరు హ్యుమానిటీ.. చేపల టాస్క్ ఆడుతున్నప్పుడు నువ్ వచ్చి మా దగ్గర చేపలు లాక్కుంటున్నప్పుడు శ్రీ సత్య డ్రెస్ పైకి వెళ్లిపోతుంది.. అప్పుడు హ్యుమానిటీ గుర్తుకు రాలేదమ్మా అంటూ చెప్పాడు. దీనికి నీట్ గా నిల్చుని మాట్లాడుతున్నప్పుడు నీ వెటకారం ఏంట్రా అని కోపంగా అంది కీర్తి. దీంతో రా.. గీ.. అనకు అరిచాడు శ్రీహాన్.

     ఒక్కటి నువ్ చేయలేవు..

    ఒక్కటి నువ్ చేయలేవు..

    కీర్తి తర్వాత ఇనయా సుల్తానాను నామినేట్ చేశాడు శ్రీహాన్. వారానికో రంగు మార్చే ఊసరవెల్లి.. నాకు ఊసరవెల్లి ట్యాగ్ వేసింది. ఫ్రెండ్ షిప్ లో నువ్ పొడిచిన వెన్నుపోట్లు ఇంకెవరు పొడిచి ఉండరు. ఫైనల్ గా ఒక్కటి చెబుతున్నా.. ఒక్కటి నువ్ చేయలేవు.. నువ్ నన్ను ఈరోజు నామినేట్ చేయలేవు.. అంటూ కుండ బద్దలు కొట్టాడు శ్రీహాన్. ఆ తర్వాత వచ్చిన ఫైమా.. బాలాదిత్యను నామినేట్ చేసింది. నా వెటకారం మోతాదు నచ్చక నామినేట్ చేశారు కదా.. మీ మంచితనం మోతాదు ఎక్కువైపోయిందంటూ చెప్పింది.

    కుండను దాచిన ఆదిరెడ్డి..

    కుండను దాచిన ఆదిరెడ్డి..

    ఇనయాను నామినేట్ చేసింది ఫైమా. సూర్య వెళ్లిపోవడానికి రీజన్ తనేనని కారణంగా చెబుతూ కుండబద్దలు కొట్టింది. తర్వాత గొప్ప ఫ్రెండ్ వి అనుకుంటూ వెళ్లిపోయింది ఫైమా. దానికి అది నువ్ చెప్పాల్సిన అవసరం లేదు అని ఇనయా చెప్పింది. అనంతరం ఇనయా-ఆదిరెడ్డి వాదించుకున్నారు. నువ్ ఫేక్ అనిపిస్తున్నావ్ అంతే అని ఇనయా కుండ బద్దలు కొట్టేందుకు వెళ్తుంటే దాన్ని దాచాడు ఆదిరెడ్డి.

    గోధుమపిండికి నామినేట్ చేయు..

    గోధుమపిండికి నామినేట్ చేయు..

    ఆదిరెడ్డి కుండను దాచేయడంతో ఇనయా కొట్టలేకపోయింది. ఇక నుంచి మరమరాలకు, గోధుమపిండికి అన్నింటికి నామినేట్ చేయు అని ఆదిరెడ్డి అంటే.. వాటి పేర్లు చెప్పి నేనెప్పుడు చేశా అని ఇనయా అంది. దీనికి ఫ్యూచర్ లో చేస్తావ్ అని బదులిచ్చాడు ఆదిరెడ్డి. అలాగే సూర్యను నామినేట్ చేశావ్.. దెబ్బకు అలా వెళ్లిపోయాడు అని చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి. తర్వాత కొద్దిసేపు శ్రీసత్య, ఇనయా వాదించుకున్నారు.

    నామినేషన్లలో 10 మంది?

    నామినేషన్లలో 10 మంది?

    ఇంటి సభ్యులు అరుపులుతో నామినేషన్లు వాడివేడీగా జరిగాయి. ఆ కుండలను చాలా గట్టిగా కొట్టి.. వాళ్లపై కోపాన్ని తీర్చుకున్నారు. ఇక బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ తొమ్మిదో వారం నామినేషన్లలో రాజ శేఖర్, శ్రీహాన్, వాసంతి తప్పా మిగతా 10 మంది ఇంటి సభ్యులు ఉన్నట్లు బిగ్ బాస్ వర్గాల నుంచి వచిన సమాచారం. మరి ఈ వారం ఎవరు సేవ్ అయి ఇంట్లో ఉంటారో.. ఎలిమినేట్ అయి బయటకు వెళ్తారో వేచి చూడాలి.

    English summary
    Bigg Boss Telugu 6 Season 9th Week Nominations Process October 31 Episode Second Promo Released And House Targeted Inaya Sultana
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X