Bigg Boss Telugu 6: ఈవారం నామినేషన్లలో ఆ ఇద్దరు తప్పా అందరూ.. హౌజ్ టార్గెట్ కూడా ఇద్దరే

బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ జోరుగా సాగుతోంది. మొన్నటి వారం బ్యాటరీ ఛార్జ్ పేరిట ఇంటి సభ్యులను ఎమోషనల్ గా ఆడుకున్న బిగ్ బాస్ మళ్లీ నామినేషన్ల పేరిట చిచ్చు పెట్టాడు. శని, ఆది వారాలు ఫన్ టాస్క్ లు, ఇంటి సభ్యుల తీరుపై హోస్ట్ నాగార్జున కౌంటర్లతో సందడిగా సాగుతుంది. కానీ అంతకన్నా మజా ఇచ్చేది సోమవారం జరిగే నామమినేషన్లే. ఇప్పటికీ ఆరు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ఏడో వారంలోకి ఎంటర్ అయింది. ఈసారి నామినేషన్లలో ఇద్దరు తప్పా మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ ఉన్నారు. అంటే ప్రస్తుతం మిగిలి ఉన్న 15 మందిలో 13 మంది నామినేట్ అయ్యారు.

బిగ్ బ్రదర్ పేరుతో..

బిగ్ బ్రదర్ పేరుతో..


బిగ్ బ్రదర్ పేరుతో అమెరికాలో ప్రారంభమైన రియాలిటీ షో ముందుగా మన దేశంలో హిందీలో వచ్చింది. ఆ తర్వాత ప్రతి భాషలో బిగ్ బాస్ పేరుతో ప్రారంభించారు. ఈ క్రమంలోనే తెలుగులో ఇప్పటికీ ఐదు టెలివిజన్, ఒకటి ఓటీటీ సీజన్ లను కంప్లీట్ చేసుకుది ఈ షో. తెలుగులో మొదటి సీజన్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో ప్రారంభం కాగా మూడో సీజన్ నుంచి టాలీవుడ్ మన్మథుడు నాగార్జున హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

నామినేషన్లలో బురద స్నానం..

నామినేషన్లలో బురద స్నానం..


ప్రతి సీజన్ లో శని, ఆది వారాల్లో హోస్ట్ వచ్చిన ఎంటర్టైన్ చేస్తాడు. ఆ తర్వాత రోజు అంటే సోమవారం జరిగే నామినేషన్ల పర్వం రంజుగా సాగుతుంది. అలాగే బిగ్ బాస్ తెలుగు 6 ఏడోవారం నామినేషన్లు కూడా జోరుగా సాగాయి. ఈసారి నామినేషన్లలో బురద స్నానాన్ని ప్రయోగించాడు బిగ్ బాస్. ఎవరైతే నామినేట్ అవుతారో వారికి బురద షవర్ పెట్టాడు. ఇంటి నుంచి మరొకరిని పంపించే సమయం ఆసన్నమైందని చెబుతూ ఇద్దరిని నామినేట్ చేయాల్సిందిగా కోరాడు బిగ్ బాస్.

రెండు వారాలకు సెల్ఫ్ నామినేట్..

రెండు వారాలకు సెల్ఫ్ నామినేట్..

అయితే రెండు వారాలకు సెల్ఫ్ నామినేట్ అయిన రోహిత్, కెప్టెన్ అయిన కారణంగా ఆర్జే సూర్యను ఎవరూ నామినేట్ చేయకూడదని తేల్చి చెప్పాడు బిగ్ బాస్. ముందుగా ఈ నామినేషన్ల ప్రక్రియ జబర్ధస్త్ ఫేమ్ ఫైమాతో ప్రారంభమైంది. ఆమె వాసంతి, బాలాదిత్యను నామినేట్ చేసింది. తర్వాత రేవంత్ ను, శ్రీహాన్ ను రోహిత్ నామినేట్ చేశాడు. అనంతరం బాలాదిత్య, రేవంత్ లను శ్రీసత్య నామినేట్ చేసింది.

నడుము ఊపుతూ ఆదిరెడ్డి కామెడీ..

నడుము ఊపుతూ ఆదిరెడ్డి కామెడీ..

తర్వాత వచ్చిన బాలాదిత్య కూడా ముందుగా రేవంత్ ను, రెండో నామినేటర్ గా ఫైమాను నామినేట్ చేశాడు. తర్వాత వచ్చిన ఆదిరెడ్డి.. అర్జున్ కల్యాణ్ ను నామినేట్ చేశాడు. అర్జున్ ఎంటర్టైన్ చేయలేదని, నేను నడుము ఊపుతు ఇలా అయిన చేశాను, మీరు చేశారా అంటూ కామెడీ పండించాడు ఆదిరెడ్డి. తర్వాత వాసంతిని నామినేట్ చేయగా ఆదిరెడ్డి, వాసంతి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. మీరు రెండు సార్లు సోఫా వెనుక నిలుచున్నారు, నేను కెప్టెన్ అయ్యాను అని ఆదిరెడ్డి అంటే.. మీరు కెప్టెన్ అయి కూడా జీరో అయ్యారుగా అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది వాసంతి.

అప్పుడు క్లారిటీ రాలేదు..

అప్పుడు క్లారిటీ రాలేదు..

తర్వాత శ్రీహాన్ వర్సెస్ ఇనయా నామినేషన్ జోరుగా సాగింది. ఆర్జే సూర్య వచ్చి బాలాదిత్యను నామినేట్ చేశాడు. ఆ తర్వాత బురద షవర్ స్వీకరించిన బాలాదిత్య కొంచెం బాధపడ్డాడు. ''నాకు ఒక విషయం చాలా క్లారిటీగా అర్థమైంది అంటూ ఏ హౌస్ గురించి నేను మంచి కోసం ఆలోచిస్తున్నానో.. అదే హౌస్ నా గురించి ఇలా ఆలోచిస్తున్నారని ఆరోజు నాగర్జున గారు నాకు లోపల వీడియో చూపించారు. అప్పుడు క్లారిటీ రాలేదు.. కానీ ఇప్పుడు మాత్రం చాలా క్లారిటీ వచ్చింది'' అని చెప్పాడు.

 సిక్స్ ప్యాక్ తో రాజ శేఖర్..

సిక్స్ ప్యాక్ తో రాజ శేఖర్..

ఈ నామినేషన్లలో షర్ట్ విప్పి తన సిక్స్ ప్యాక్ తో రాజ శేఖర్ అలరించగా.. చివర్లో తగ్గేదే లే అని పుష్ప డైలాగ్ చెప్పి.. అలా పుష్పరాజ్ స్టైల్ లో రేవంత్ నడుచుకుంటూ వచ్చే సీన్ హైలెట్ గా ఉంది. ఈ బిగ్ బాస్ నీకు సూట్ కాదని బాలాదిత్యతో గీతూ రాయల్ చెప్పడం, అందుకు బాలాదిత్య ఏం సమాధానం ఇవ్వకపోవడం ఒకరకంగా ఎమోషనల్ గా ఉంది. మొత్తంగా ఏడో వారం జరిగిన నామినేషన్లలో గీతూ రాయల్, ఆర్జే సూర్య తప్పా మిగిలిన 13 మంది కంటెస్టెంట్లు బాలాదిత్య, రేవంత్, వాసంతి, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఇనయా సుల్తానా, అర్జున్ కల్యాణ్, కీర్తి భట్, శ్రీ సత్య, మెరీనా, రాజ శేఖర్, ఫైమా, రోహిత్ నామినేట్ అయ్యారు.

 అధికంగా వారిద్దరికే..

అధికంగా వారిద్దరికే..


వీరందరిలో అధికంగా బాలాదిత్యకు 8, రేవంత్ కు 6 ఓట్లు పడ్డాయి. బ్యాటరీ ఛార్జ్ లో 50 శాతం ఎక్కువగా ఉపయోగించుకున్నాడని, బాల్ గేమ్ లో తన బాల్ ను రోహిత్ కు ఇవ్వడంతో మిగిలి వాళ్ల గేమ్ ఆగిపోయిందన్న కారణాలతో బాలాదిత్య ఎక్కువ మంది నామినేట్ చేశారు. అలాగే కెప్టెన్ అయి ఉండి, అందులోని బ్యాటరీ ఛార్జింగ్ టాస్క్ జరుగుతున్న సమయంలో రెండు సార్లు పడుకున్నాడన్న కారణంతో రేవంత్ ను ఎక్కు మంది నామినేట్ చేశారు. దీంతో ఈ ఏడో వారం మొత్తం హౌజ్ మేట్స్ అందరూ బాలాదిత్య, రేవంత్ లను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X