Don't Miss!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- News ఈ అభిమానమే రఘురామ రాజుకు సీటు దూరం చేసింది..!!
- Technology X ప్లాట్‌ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్‌కు భయపడి ఆ బౌలర్‌పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Bigg Boss Telugu 6: బాలాదిత్యకు వచ్చిన మొత్తం రెమ్యునరేషన్ ఎంతంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఆరంభంలో కాస్త నీరసంగా అనిపించినప్పటికీ ఆ తర్వాత మళ్ళీ ట్రాక్ లోకి వచ్చినట్లు అనిపించింది. అయితే మళ్ళీ గత రెండు వారాల నుంచి రేటింగ్స్ తగ్గుతున్నాయి అనుకున్నారేమో కానీ ఊహించిన విధంగా ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. అసలైన బలమైన కంటెస్టెంట్స్ ఇప్పుడు ఎలిమినేట్ అవుతూ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక ఈవారం బాలదిత్యా హౌస్ లో నుంచి వెళ్లిపోయినట్లు ముందుగానే ఒక క్లారిటీ వచ్చింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన బాలాదిత్యా మొత్తం ఈ సీజన్ కు అతను ఎంత పారితోషికం అందుకున్నాడు.. అనే వివరాల్లోకి వెళితే..
ఫైనల్స్ వరకు
బాల నటుడిగా కథానాయకుడిగా సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును అందుకున్న బాలదిత్యా కెరీర్‌ను మళ్ళీ సరైన ట్రాక్‌లోకి తీసుకురావడానికి బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాడు. ఇక అతను మొదటి రెండు మూడు వారాల్లోనే టాప్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా కనిపించాడు. తప్పకుండా అతను ఈసారి బిగ్ బాస్ ఫైనల్స్ వరకు ఉంటాడు అని అందరూ అనుకున్నారు. ఒక విధంగా గత మూడు వారాల క్రితం వరకు కూడా అతను మంచి క్రేజ్ అందుకుంటూ జనాల ఓట్లు ఎక్కువగానే అందుకున్నాడు.
అదే మైనస్
అయితే బిగ్ బాస్ ఎలిమినేషన్ విషయంలో ఏమాత్రం పక్షపాతం లేకుండా వ్యవహరిస్తున్నట్లుగా అనిపిస్తుంది. హౌస్ లో బలంగా పోరాడలేని వారిని వెంటనే తీసివేయడానికి ఏమాత్రం ఆలోచించడం లేదని కూడా అనిపిస్తోంది. ఇక పెద్దన్న పాత్రలో మొదట కనిపించిన బాలాదిత్యా ఆ తర్వాత ఎమోషనల్ గా ఫీల్ అవుతూ హైలెట్ అయ్యాడు. కానీ అసలైన ఫిజికల్ టాస్క్ లలో అతను పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అదే అతనికి అతిపెద్ద మైనస్ అని చెప్పవచ్చు.
ఎమోషనల్ గా..
అయితే ఇప్పుడున్న బిగ్ బాస్ కంటెస్టెంట్లలో తప్పకుండా అతను ఫైనల్ వరకు వెళ్తాడు అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే అతనికి ఓట్లు కూడా గట్టిగానే వచ్చాయి. కానీ గత రెండు మూడు వారాలలో చూసుకుంటే మాత్రం అతను ఎమోషనల్ గా హైలైట్ అయ్యేందుకు ప్రయత్నించిన విధానం అంతగా వర్కౌట్ కాలేదు. దీంతో బాలాదిత్యకు జనాల నుంచి ఓట్లు కూడా చాలా వరకు తగ్గుతూ వచ్చాయి.
బిగ్ బాస్ ట్విస్ట్
గత రెండు మూడు వారాలుగా బిగ్ బాస్ లో అయితే అసలు ఊహలకందని విధంగా కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేస్తున్నాడు. గతవారం గీతూ రాయల్ వెళ్లిపోతుంది అని ఎవరు కూడా అనుకోలేదు. ఇప్పుడు బాలదిత్యా వెళ్లిపోవడంతో మిగతా కంటెస్టెంట్స్ కు ఒక భయాన్ని కలిగిస్తోంది. ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతారు అనేది ఆడియన్స్ మనసుకు కూడా బిగ్ బాస్ తెలియనివ్వడం లేదు.
రెమ్యునరేషన్ ఎంతంటే?
ఇక మొత్తానికి బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన బాలాదిత్యా ఏ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకున్నాడు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. బాలాదిత్యా ఒక వారానికి గాను 25 వేల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఉన్నన్ని రోజులు మొత్తానికి కూడా అతను 6.5 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఒక విధంగా అతనికి ఇది మంచి ఆదాయం అని చెప్పవచ్చు. దాదాపు బిగ్ బాస్ అందరికీ కూడా మంచి రెమ్యునేషన్స్ ఇస్తున్నట్లు అర్థమవుతుంది.