Bigg Boss Telugu 6: వాసంతి రెమ్యునరేషన్.. 10 వారాలకు మొత్తం ఎంత ఇచ్చారంటే?
బిగ్ బాస్ లో ఈసారి ఎవరు ఊహించిన విధంగా ఎలిమినేషన్స్ కొనసాగుతున్నాయి. టాప్ 5 లో తప్పకుండా ఉంటారు అనుకున్నా కంటెస్టెంట్స్ ఇప్పుడు మెల్లగా హౌస్ లో నుంచి వెళ్ళిపోతూ ఉండడం వల్ల ఆశ్చర్యం కలుగుతుంది. బిగ్ బాస్ ఒక విధంగా ఈ విషయంలో ప్రతి వారం ట్విస్ట్ ఇస్తున్నాడు అని చెప్పవచ్చు. ఇక ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అవ్వగా అందులో వాసంతి కూడా ఉండడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ ట్విస్టులు
బిగ్ బాస్ కు సంబంధించిన ప్రతి విషయంలో కూడా ఆడియన్స్ ముందుగానే ఒక ఊహకు వస్తుంటారు. ముఖ్యంగా ఎలిమినేషన్స్ విషయంలో కూడా ప్రతిసారి అంచనాలు కరెక్ట్ అవుతున్నాయి. కానీ ఈ సీజన్లో మాత్రం చివరి వరకు ఎవరు ఉంటారు ఎవరు వెళ్ళిపోతారు అనే విషయంలో మాత్రం క్లారిటీ ఉండడం లేదు. టాప్ 5 లో బలమైన కంటెస్టెంట్స్ అనుకున్న వారు కూడా మొదట్లోనే వెళ్ళిపోతున్నారు. ఇటీవల గీతూ రాయక్ వెళ్లిపోవడం అనేది ఊహించని ట్విస్ట్ అనే చెప్పాలి.

వాసంతి ఎలిమినేషన్
బిగ్ బాస్ 6వ సీజన్ లో మరోసారి డబుల్ ఎలిమినేషన్ ఆశ్చర్యాన్ని కలిగించింది. బుధవారం ఇతర బలమైన కంటెస్టెంట్స్ హౌస్ లో నుంచి వెళ్ళిపోయారు. ముఖ్యంగా బాలాదిత్యా ఎలిమినేషన్ అయితే అసలు ఎవరు ఊహించినటువంటిది. ఇక ఆదివారం రోజు వాసంతి కూడా హౌస్ లో నుంచి వెళ్ళిపోయింది. ఆమె గత వారం వరకు కాస్త బలంగానే ఉన్నట్లు అనిపించినప్పటికీ ఈ వారం చేసిన కొన్ని పొరపాట్ల వలన హౌస్ లో వెళ్ళిపోక తప్పలేదు.

ఓవర్ కాన్ఫిడెన్స్ వలన
వాసంతి తన ప్రత్యర్ధులతో గట్టిగానే పోరాడింది. ఒక విధంగా ఆమె ఇతరుల నుంచి పెద్దగా సహాయం అయితే తీసుకోలేదు. ఇక శ్రీ సత్య శ్రీహాన్ ఇద్దరితో కూడా ఆమె తరచుగా పొట్లాడేందుకు ప్రయత్నించింది. ఒక విధంగా ఆమె టాస్క్ లలో చేసిన పొరపాట్లు కూడా ఆమె ఎలిమినేషన్ కు దారి తీశాయని చెప్పవచ్చు. అనవసరంగా ఓవర్ కాన్ఫిడెన్స్ తో కూడా ఆమె కొన్ని పొరపాట్లు అయితే చేసింది.

వారానికి రెమ్యునరేషన్ ఎంత?
ఏది ఏమైనా ఈసారి బిగ్ బాస్ సీజన్ మరింత ఆసక్తికరంగా మారింది. ఇక 10 వారాలపాటు కొనసాగిన వాసంతి ఏ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంది అనే వివరాలలోకి వెళితే ఆమెకు ఒక విధంగా బిగ్ బాస్ ద్వారా మంచి అమౌంట్ దక్కినట్లుగా తెలుస్తోంది. ఆమెకు వారానికి 25 వేలకు పైగా పారితోషికం ఇచ్చినట్లు సమాచారం.

10 వారాలకు ఎంత ఇచ్చారంటే?
ఇక మొత్తంగా 10 వారాలు కొనసాగిన వాసంతి 2 లక్షల 50 వేల వరకు పారితోదికం అందుకున్నట్లు సమాచారం. ఒక విధంగా ఆమె కెరీర్ లో ఇది అత్యధిక రెమ్యునరేషన్ అని కూడా చెప్పవచ్చు. యాంకర్ గా నటిగా తనను తాను సరికొత్తగా ప్రజెంట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న వాసంతికి బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ అయితే వచ్చింది. హీరోయిన్ అవ్వాలని ఆమె మొదట ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక ఇప్పుడు ఆమెకు బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ ఏ విధంగా హెల్ప్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











