Bigg Boss Telugu 6: తల్లిదండ్రులను తల్చుకుంటూ హౌజ్ మేట్స్ కన్నీళ్లు.. ఆమెకు మాత్రం కుక్క బొచ్చు కావాలట!

బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో రెండు రోజులు బిగ్ బాస్ పుట్టినరోజు వేడుకలలో సందర్భంగా ఇంటి సభ్యులందరూ కూడా బిగ్ బాస్ కోరికలను తీర్చేందుకు ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ మీ కోరికల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నట్లుగా తెలియజేయడంతో ఇంటి సభ్యులందరూ కూడా వారి ఎమోషనల్ మూమెంట్స్ ను షేర్ చేసుకున్నారు. అలాగే వారికి ఉన్న కోరికలను కూడా తెలియజేశారు. ఈ క్రమంలో హౌజ్ మేట్స్ అందరూ చాలా ఎమోషనల్ అయ్యారు.

శ్రీహాన్ పేరుతో హెల్పింగ్ హ్యాండ్స్..

శ్రీహాన్ పేరుతో హెల్పింగ్ హ్యాండ్స్..

పుట్టినరోజు సందర్భంగా తనను ఎంటర్టైన్ చేసినందుకు తమ కోరికలు చెప్పాల్సిందిగా బిగ్ బాస్ తెలిపాడు. అయితే వాటి గురించి చెబుతూ కొందరు కంటతడి కూడా పెట్టుకున్నారు. ముందుగా వచ్చిన శ్రిహాన్ తన పేరుమీద హెల్పింగ్ హ్యాండ్స్ తో అనాధలకు సహాయం చేస్తున్నానని, ఈ సారి తన బర్త్ డేకు తన చేతులమీదగానే ఆ కార్యక్రమం చేద్దామనుకున్నట్లు ఆయన తెలిపాడు. ఈసారి ఆ బాధ్యతను తన గర్ల్ ఫ్రెండ్ సిరికి అప్పగించాడు.

ఆ టీషర్ట్ తన దగ్గర ఉంటే..

ఆ టీషర్ట్ తన దగ్గర ఉంటే..

ఇక సుదీప తన భర్త గురించి చెప్పుకుంది. అతని నుంచి టీ షర్ట్ కూడా వచ్చినట్లు తెలిపింది. ఆ టీషర్ట్ తన దగ్గర ఉంటే ఎప్పుడు కూడా రంగనాథ్ నా పక్కనే ఉంటాడు అని ఆలోచనతో ఉంటాను అని ఆమె ఎమోషనల్ గా తన భర్త గురించి చెప్పింది. అలాగే తన ఫోటో కూడా కావాలని అన్నట్లుగా సుదీప వివరణ ఇచ్చింది. ఇక మరోవైపు రేవంత్ నా వైఫ్ ను అలాగే మా అమ్మ గారిని ఇంట్లో వాళ్ళు అందరు కూడా బాగా చూసుకోవాలని అనుకుంటున్నాను వాళ్ళు బాగుంటే నేను ఇక్కడ బాగుంటాను. అని చెప్పుకుంటూ ఎమోషనల అయ్యాడు.

నాన్నగారితో మాట్లాడింది చాలా తక్కువ..

నాన్నగారితో మాట్లాడింది చాలా తక్కువ..

నా లైఫ్ లో మా నాన్నగారితో మాట్లాడింది చాలా తక్కువ అని ఆర్జే సూర్య ఏడుస్తూ చెప్పాడు. ఇక అతన్ని చూసి మిగతా వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. మరోవైపు ఇనయా తన తండ్రి గురించి తలుచుకుంటూ చాలా ఎమోషనల్ అయిపోయింది. మమ్మీ నిన్ను డాడీ చూసుకున్నంత బాగా చూసుకోలేదు కానీ, నేను నిన్ను డాడీ లోటు లేకుండా చూసుకోగలను మమ్మీ అంటూ ఇనయా వివరణ ఇచ్చింది.

చిట్టి తల్లి అని పిలుచుకుంటున్నా..

చిట్టి తల్లి అని పిలుచుకుంటున్నా..

ఇక అర్జున్ సైతం తన ఫాదర్ గురించి చెప్పుకునే కంటతడి పెట్టుకున్నాడు. వెనక్కి తిరిగి మరి కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఇక అతన్ని చూసి మిగతావారు కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. ఇక ఆదిత్య వచ్చేముందే తనకు ఒక పాప పుట్టిందని అని తెలియజేశాడు. ఇప్పుడు చిట్టి తల్లి అని పిలుచుకుంటున్నాని తెలిపాడు. తన ఫ్యామిలీని గుర్తు చేసుకుంటూ త్వరలో మంచి పేరు పెట్టే అవకాశం రావాలి అని కోరుకుంటున్నట్లుగా తెలియజేశాడు.

ఆమె ఎలా ఉందో తెలుసుకోవాలని..

ఆమె ఎలా ఉందో తెలుసుకోవాలని..

ఫైమా కూడా తన అమ్మ గురించి చెప్పింది. ఆమెకు బయటకు వెళ్లడం, రావడం తెలియదని, ఆమె ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందని తెలిపింది. ఇక చిత్తూరు చిరుత గీతూ రాయల్ వచ్చి తన పెంపుడు కుక్క పిల్లలు ఒరియో, ఫిడో బొచ్చును పంపాల్సిందిగా బిగ్ బాస్ ను కోరింది. అది సిల్లీగా ఉంటుందని తెలుసు కానీ నన్ను ముద్దు పెట్టి నిద్రలేపేవి అవి. ఒరియో నాకు కొడుకు లాగా, ఫిడో తమ్ముడిలాగా అనిపిస్తుంది అని గీతూ చెప్పుకొచ్చింది.

బిగ్ బాస్ మీకు ఇంకో ఆప్షన్ ఇస్తున్నా..

బిగ్ బాస్ మీకు ఇంకో ఆప్షన్ ఇస్తున్నా..

ఆ తర్వాత వచ్చిన ఆది రెడ్డి తనకంటే ఎక్కువగా ఆయన కూతురు బిగ్ బాస్ కు ఎక్కువగా కనెక్ట్ అయిందని చెప్పాడు. అక్టోబర్ 21న తన బర్త్ డే అని బిగ్ బాస్ చూస్తూ పెరిగిన పాప బర్త్ డే ని బిగ్ బాస్ హౌజ్ లో జరుపుకుంటే నెక్ట్స్ లెవెల్ ఉంటుందని అభిప్రాయపడ్డాడు ఆదిరెడ్డి. అది కుదరకపోతే బిగ్ బాస్ మీకు ఇంకో ఆప్షన్ ఇస్తున్నాను.. పాప ఫొటో అయినా పంపండి అని చెప్పాడు. దీంతో బిగ్ బాస్ కే ఆప్షన్ ఇస్తున్నావా అంటూ నవ్వారు మిగతా ఇంటి సభ్యులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X