Bigg Boss Telugu 6: తన టీమ్ సభ్యులకు రేవంత్ వెన్నుపోటు.. షాకిచ్చిన గీతూ.. అబద్ధం చెప్పిన శ్రీహాన్..

అరుపులు, కేకలతో మరోసారి రంజుగా మారింది బిగ్ బాస్ ఆరో సీజన్ హౌజ్. మూడో వారం నామినేషన్స్ అనంతరం కుటుంబ సభ్యుల చర్యలను కొద్దిసేపు చూపించారు. ఆ తర్వాత మూడో వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా అడవిలో ఆట అనే కొత్త టాస్క్ ను ప్రారంభించాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించాడు. ఈ ఆటలో భాగంగా శ్రీహాన్, రేవంత్, నేహా చౌదరి, ఆరోహి, ఆర్జే సూర్య, సుదీప, వాసంతి, అర్జున్ కల్యాణ్ దొంగలుగా.. బాలాదిత్య, ఫైమా, ఇనయ సుల్తానా, ఆది రెడ్డి, రోహిత్ అండ్ మెరీనా, రాజ్, శ్రీ సత్య పోలీసులుగా వ్యవహరించారు. ఇక అత్యాశ పడే వ్యాపారవేత్తగా గీతూ రాయల్ ను ఎంపిక చేశారు. ఆట ఎలా ఆడారనే విషయానికి వెళితే..

ఎవరికీ వారి స్ట్రాటజీలు..

ఎవరికీ వారి స్ట్రాటజీలు..

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ మూడో వారంలో కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా అడవిలో ఆట గేమ్ ప్రారంభం కాగానే అందరూ కూడా చాలా బలంగా పోటీ పడ్డారు. రెండు టీమ్ లు తమ స్ట్రాటజీలను ప్లే చేసేందుకు ప్రయత్నించారు. ఆట ప్రారంభం కావడంతోనే శ్రీహాన్, ఆర్జే సూర్య తమ దూకుడును ప్రదర్శించారు. ఈ ఆటలో దొంగలుగా ఉన్న వాళ్లు.. హౌజ్ లో రెడ్ ట్యాగ్ కట్టిన వస్తువులను దొంగతనం చేయాలి.

నియమనిబంధనలతో అడవిలో ఆట..

నియమనిబంధనలతో అడవిలో ఆట..

అలాగే వారిని పట్టుకుని జైళ్లో వేసే అధికారం పోలీసు సభ్యులకు ఇచ్చాడు బిగ్ బాస్. అయితే వారు దొంగతనం చేసేందుకు, దొంగలను పట్టుకోవడం ఒక సైరెన్ మోగినప్పుడు మాత్రమే చేయాలి. దీంతోపాటు దొంగతనం చేసిన వస్తువులను అత్యాశ గల వ్యాపారి అయిన గీతూ రాయల్ కు అమ్ముకోవాలి. అది కూడా మార్కెట్ బెల్ సౌండ్ వచ్చినప్పుడే. ఇలాంటి నియమనిబంధనలతో స్టార్ట్ అయిన గేమ్ ను కొంతమంది ఫాలో అయితే, మరికొంతమంది తమకు నచ్చినట్లుగా ఆడేశారు.

రెండు బృందాలు, ఓ అత్యాశ వ్యాపారి..

రెండు బృందాలు, ఓ అత్యాశ వ్యాపారి..

ఈ ఆటలో దొంగలు, పోలీసులు అని రెండు బృందాలు ఉన్న ఎవరీ స్ట్రాటజీని వారు ఉపయోగించారు. ముఖ్యంగా గీతూ రాయల్ తనకు నచ్చినట్లుగా రూల్స్ పెట్టుకుని ఆడినట్లుగా తెలుస్తోంది. తను దొంగల నుంచి వస్తువులను కొనడం మాత్రమే కాకుండా తను కూడా కొన్ని వస్తువులను దొంగలించి.. అవి దొంగల వద్ద కొనుకున్నట్లుగా చూపించే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే శ్రీహాన్ వద్ద ముందుగా రూ. 200లకు ఒక వస్తువు కొనింది.

 షాక్ ఇచ్చిన చిత్తూరు చిరుత..

షాక్ ఇచ్చిన చిత్తూరు చిరుత..

అయితే వస్తువు కొన్ని తర్వాత తన వద్ద ఉన్న మరో రెండు వస్తువులను శ్రీహానే తనకు అమ్మినట్లుగా చూపించింది. దీంతో శ్రీహాన్ తో పాటు దొంగలుగా ఉన్న సభ్యులంతా షాక్ అయ్యారు. తర్వాత ఈ విషయం తనకు తెలియదని చెప్పమని గీతూను శ్రీహాన్ కోరతాడు. గీతూ అదే విషయం చెబుతుంది. అయితే దొంగలుగా ఉన్న సభ్యులు మాత్రం ఎవరినీ వస్తువులు అమ్మకుండా ఆపేందుకు ప్రయత్నిస్తే శ్రీహాన్ ఇలా చేస్తాడాని ఊహించలేదని అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

 టీమ్ మేట్స్ కు శ్రీహాన్ అబద్ధం..

టీమ్ మేట్స్ కు శ్రీహాన్ అబద్ధం..

అలాగే రెడ్ ట్యాగ్ ఉన్న వస్తువులను దొంగతనం చేసిన శ్రీహాన్.. అతని టీమ్ మేట్స్ కు మాత్రం దానికి ట్యాగ్ లేదని చెబుతాడు. ఈ విషయం కూడా దొంగలుగా ఉన్న హౌజ్ మేట్స్ కు చెబుతాడు. దీంతో కూడా ఒకింత ఆశ్చర్యానికి లోనవుతారు దొంగలు. శ్రీహాన్ తర్వాత నాలుగు వస్తువులను గీతూ రాయల్ కు అమ్ముతాడు సింగర్ రేవంత్. ఆ తర్వాత రెడ్ ట్యాగ్ లేని వస్తువులకు రేవంత్ రెడ్ ట్యాగ్ చుడతాడు.

గీతూతో కలిసి ఆట..

గీతూతో కలిసి ఆట..

ఆ వస్తువులను గీతూ రాయల్ కు అమ్ముతాడని అర్థమైపోతుంది. అయితే హౌజ్ లో గీతూ రాయల్ కు, రేవంత్ కు కొద్దిగా పడదన్న విషయం తెలిసిందే. కానీ శ్రీహాన్ తర్వాత తన వస్తువులను గీతూకు అమ్మేయడం, రెడ్ ట్యాగ్ లేనివాటికి రెడ్ ట్యాగ్ చుట్టడంతో తన టీమ్ మేట్స్ కు వెన్నుపోటు పొడిచి.. గీతూతో కలిసి అడినట్లుగా తెలుస్తోంది. వస్తువులకు రెడ్ ట్యాగ్ రేవంత్ చుట్టడం, కొన్ని వస్తువులను జైళ్లో పోలీసులు దాచడంతో ఆటతోపాటు, ఎపిసోడ్ కూడా ముగిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X