Bigg Boss Telugu 6: బిగ్ బాస్ నిన్ను వదిలేదాన్ని కాదు.. హౌజ్ టార్గెట్ అయిన RGV బ్యూటి, కలిసొచ్చేనా?

బిగ్ బాస్ తెలుగు 6 రియాలిటీ షో భలే రంజుగా సాగుతోంది. ఎప్పుడూ ఎంటర్ టైన్ చేసే నామినేషన్ల పర్వం మరోసారి రసవత్తరంగా మారింది. సోమవారం వచ్చిందంటే చాలు నామినేషన్ ఎపిసోడ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తారు ఆడియెన్స్. వారికి ఎదురుచూపులు ఫలించాయి అన్నట్లుగా కంటెస్టెంట్ల మధ్య మంచిగానే ఫైట్ జరిగింది. ఇక సెప్టెంబర్ 26 సోమవారం ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ 22వ రోజు 23వ ఎపిసోడ్ లో నాలుగో వారం నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఈ నామినేషన్లను చూస్తుంటే బిగ్ బాస్ హౌజ్ లో అందరూ ఇనయా సుల్తానానే టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.

నేహా ఎలిమినేషన్ తో..

నేహా ఎలిమినేషన్ తో..


బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఆదివారం నేహా చౌదరి ఎలిమినేషన్ కావడంతో వాసంతి ఊపిరిపీల్చుకుంది. దీంతో కొద్దిగా ఎమోషనల్ కూడా అయింది. తనతోపాటు ఇనయ సుల్తానా కూడా ఎమోషనల్ అయింది. ఇక సోమవారం ప్రారంభమైన 23వ ఎపిసోడ్ లో వాసంతిని హగ్ చేసుకుంటూ బిగ్ బాస్ కు ఐ లవ్యూ చెప్పింది ఇనయా సుల్తానా.''థ్యాంక్యూ సో మచ్. నేను ఇంతలా ఇప్పటికీ ఎవరికీ చెప్పలేదు. ఐ లవ్యూ బిగ్ బాస్.. దీనికోసమే (వాసంతి) ఐ లవ్యూ చెబుతున్న మీకు. ఇది వెళ్లిపోయింటే నిజంగా చెబుతున్న.. మిమ్మల్ని, ఆది రెడ్డి గారిని అస్సలు వదిలేదాన్ని కాదు'' అంటూ చెప్పింది ఇనయా సుల్తానా.

మళ్లీ తీసుకొచ్చిన పిట్ట లొల్లి..

మళ్లీ తీసుకొచ్చిన పిట్ట లొల్లి..


ఇక ఆ తర్వాత నాలుగో వారం నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. నామినేట్ చేసే ఇంటి సభ్యుల తలపై టమటాను పూర్తిగా స్మాష్ చేసి కారణాలు చెప్పాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించాడు. ముందుగా నామినేషన్స్ ప్రక్రియను శ్రీహాన్ తో ప్రారంభించమని బిగ్ బాస్ చెప్పగా.. ముందుగా ఇనయాను నామినేట్ చేశాడు. మళ్లీ పిట్ట్ అన్న గొడవను తీసుకొచ్చాడు. అల్రెడీ నాగార్జున దీనిపై క్లారిటీ ఇచ్చిన కూడా మళ్లీ అదే విషయంపై ఇనయాను నామినేట్ చేయడం సిల్లీగానే అనిపించింది. పిట్ట అన్నాను కానీ, ఇనయాను వేలెత్తి చూపించలేదు అంటూ కొత్త రీజన్ చెప్పేందుకు ప్రయత్నించాడు. కానీ తనని మాత్రం వేలెత్తి చూపుతూ వాడు అనడం తప్పు అని చెప్పుకొచ్చాడు.

సుదీప-ఇనయా మధ్య గొడవ..

సుదీప-ఇనయా మధ్య గొడవ..

ఆ తర్వాత రాజశేఖర్ ను నామినేట్ చేశాడు శ్రీహాన్. సుదీప కూడా ఇనయా సుల్తానానే నామినేట్ చేసింది. గేమ్ లో ఇనయా సుల్తానా అడిన తీరును కారణంగా చెబుతుంది నామినేట్ చేసింది. స్టోర్ రూమ్ లోకి వెళ్లి వస్తువులు వెతకడం, ఆ తర్వాత గొడవ అంటూ పలు కారణాలు చెప్పింది. వీరిద్దరూ మధ్య గొడవ బాగానే జరిగింది.

 ఫౌల్ గేమ్ ఆడిందని..

ఫౌల్ గేమ్ ఆడిందని..

తన డ్రెస్ లాగారని, తన మానం పోతుందన్నట్లుగా చెబుతూ డిఫెన్స్ చేసుకుంది ఇనయా సుల్తానా. అనంతరం రేవంత్ ను నామినేట్ చేసింది సుదీప. అడవిలో ఆట గేమ్ టాస్క్ లో రేవంత్ ప్రవర్తన నచ్చలేదని కారణం చెప్పింది. ఇక గీతూ రాయల్ ఎప్పటిలానే ఇనయా సుల్తానాను నామినేట్ చేసింది. ఆమె ఫౌల్ గేమ్ ఆడిందనే నామినేట్ చేస్తున్న అని కారణం చెప్పింది.

కన్నీళ్లు పెట్టుకున్న ఇనయా..

కన్నీళ్లు పెట్టుకున్న ఇనయా..

స్ట్రాటజీలు అంటూ ఇష్టమొచ్చినట్లు రూల్స్ పెట్టుకుని ఆడే నువ్ నన్ను అంటున్నావా అని ఇనయా సుల్తానా అంది. నేను ఏం ఆడినా గానీ, ఫౌల్ గేమ్ ఆడలేదని గీతూ సమాధానం చెప్పింది. ఆ తర్వాత గేమ్ సరిగా ఆడలేదని చలాకీ చంటిని నామినేట్ చేసింది గీతూ రాయల్. అనంతరం వచ్చన కీర్తి భట్ కూడా ఇనయా సుల్తానానే నామినేట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన ఆరోహి రావు, శ్రీ సత్య, ఆర్జే సూర్య, చంటి, రోహిత్ అండ్ మెరీనా కూడా ఇనయానే నామినేట్ చేశారు. రోహిత్ అండ్ మెరినా చెప్పినా కారణానికి ఎమోషనల్ అయింది ఇనయా. స్టోర్ రూమ్ కు వెళ్లమని చెప్పిన మెరీనానే ఇప్పుడు నామినేట్ చేస్తుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

సగానికి పైగా సభ్యులు..

సగానికి పైగా సభ్యులు..

ఇలా సగానికి పైగా ఇనయా సుల్తానాను నామినేట్ చేసి ఆమెను స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలబెట్టినట్టయింది. మరి ఇంతమంది నామినేట్ చేయడంతో ఇనయా సుల్తానాపై సింపథి పెరుగుతుందో చూడాలి. అయితే బిగ్ బాస్ లెక్కల ప్రకారం ఏ కంటెస్టెంట్ ను అయితే ఇంటి సభ్యులు టార్గెట్ చేస్తారో వారికే ఆడియెన్స్ నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది. మరి ఈసారి ఆ సపోర్ట్ ఆడియెన్స్ నుంచి ఇనయా సుల్తానాకు లభిస్తుందో చూడాలి. కాగా ఈ వారం నామినేషన్లలో బిగ్ బాస్ నేరుగా నామినేట్ చేసిన అర్జున్ కల్యాణ్, కీర్తి భట్ తో పాటు సుదీప, ఆరోహి, శ్రీహాన్, ఇనయా సుల్తానా, రాజశేఖర్, సూర్య, రేవంత్, గీతూ రాయల్ 10 మంది ఉన్నారు.

ఇనయా కోసం ఆర్జీవీ పోస్ట్..

ఇనయా కోసం ఆర్జీవీ పోస్ట్..


కాగా మూడో వారం ఎలిమినేషన్లలో ఉన్న ఇనయా సుల్తానాకు ఓట్లు వేయండంటూ సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా తెలిపిన విషయం తెలిసిందే. ఆమెతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ స్పెషల్ రిలేషన్‌షిప్‌ ఎప్పటికీ ప్రేమ కాదు. అంతకంటే అమూల్యమైనది. మీతో మాట్లాడుతుంటే గొప్ప అనుభూతి కలుగుతుంది. అయితే మీరే నా జీవితంలో కీలకమైన వ్యక్తి అని చెప్పను. కానీ మీరు ఎప్పటికీ అలానే ఉంటారు అని రాసుకొచ్చాడు ఆర్జీవీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X