Bigg Boss Telugu 6: అతడు నామినేషన్ లో ఉన్నా దండగే.. బిగ్ బాస్ ప్లాన్ మామూలుగా లేదు!

బిగ్ బాస్ 6వ సీజన్ మొదలైన రోజే మళ్లీ ఎప్పటిలానే ఒక విషయంలో మొదటి నుంచి తీవ్రస్థాయిలో నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. ముఖ్యంగా హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ లో ఎవరు కూడా పెద్దగా పేరున్న సెలబ్రిటీలు కాదని అంటున్నారు. అసలు బిగ్ బాస్ ఈసారి పూర్తిస్థాయిలో నిరాశపరిచాడు అని గతంలో కొద్దో గొప్ప పేరున్న సెలబ్రిటీలను తీసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం బిగ్ బాస్ లోకి అసలు స్టార్స్ ఎవరూ రాలేదు అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక కంటెస్టెంట్ మాత్రం చివరి వరకు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక అతను ఎవరు అనే వివరాల్లోకి వెళితే..

అలాంటి వారిని

అలాంటి వారిని

బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి కూడా విభిన్న రకాలుగా సెలబ్రిటీలను తీసుకువస్తున్న నిర్వాహకులు రెండవ సీజన్ నుంచి టెలివిజన్ అలాగే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వారిని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈసారి అయితే మరింత తక్కువ స్థాయిలో ఉన్న సెలెబ్రిటీలను టెలివిజన్ ఆర్టిస్టులను తీసుకురావడం పెద్దగా కలిసి రాలేదు.

 అతను తప్పితే

అతను తప్పితే

ఈసారి సీజన్లో ఎక్కువగా పాపులర్ అయిన వారి సంఖ్య సగం కంటే తక్కువే అని చెప్పాలి. ముఖ్యంగా అందులో రేవంత్ సింగర్ తప్పితే ప్రస్తుతం ఎక్కువగా గుర్తున్నానా ముఖాలు ఏమీ కనిపించడం లేదు అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. బలాదిత్య అంటే ఎప్పుడో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు కానీ ఆ తర్వాత అతను హీరోగా క్లిక్ అయ్యింది లేదు.

 వాళ్ళ విషయానికి వస్తే

వాళ్ళ విషయానికి వస్తే

ఇక శ్రీహన్ అయితే సోషల్ మీడియాను ఫాలో అయ్యేవరకు తెలుసు. అలాగే సిరి కారణంగా అతనికి కొంత ఇమేజ్ అయితే వచ్చింది. ఇక జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న చంటి వచ్చినప్పటికీ మధ్యలో అతను కూడా డౌన్ కావడంతో దాదాపు జనాలు మర్చిపోయారు అనుకున్న సమయంలో బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాడు. ఇక మిగతా వారిలో చూసుకుంటే దాదాపు అందరూ కూడా ఇటీవల కాలంలో కాస్త క్రేజ్ అందుకున్న వారే.

రేవంత్ కు బంపరాఫర్

రేవంత్ కు బంపరాఫర్

అయితే బిగ్ బాస్ 6వ సీజన్లో ఎక్కువగా రెమ్యునరేషన్ అందుకుంటున్న వారిలో రేవంత్ కూడా టాప్ లిస్టులో ఉన్నాడు. అతను ఒక రోజుకు దాదాపు 50 వేలకు పైగానే అగ్రిమెంట్ సెట్ చేసుకున్నట్లు టాక్ వస్తోంది. ఒక్క వారం ఉన్న కూడా రేవంత్ కు భారీగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ అతన్ని దాదాపు చివరి వరకు కొనసాగించే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

నామినేషన్ లో ఉన్నా దండగే..

నామినేషన్ లో ఉన్నా దండగే..

ప్రస్తుతం బిగ్ బాస్ లో హడావిడి చూస్తూ ఉంటే అందరి ఫోకస్ కూడా ఎక్కువగా రేవంత్ పైన ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే అతనే చాలా బలమైన పోటీ దారుడిగా నిలుస్తాడని కూడా చెప్పవచ్చు. ఇక మిగతా కంటెస్టెంట్స్ అందరూ కూడా అతన్ని నామినేట్ చేయడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే అతను నామినేషన్ లో ఉన్నా కూడా బిగ్ బాస్ ప్రణాళిక ప్రకారం చివరి వరకు కొనసాగుతాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X