Bigg Boss Telugu 6: వెక్కి వెక్కి ఏడ్చిన ఇనయా.. ఇద్దరు మగాళ్లు అలా చేయడంతో బాత్రూమ్ లో అలా..

అత్యధికంగా తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందుతోన్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి. బిగ్ బ్రదర్ పేరుతో అమెరికాలో ముందుగా వచ్చిన ఈ షో సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఈ షోను ఇండియాలోకి తీసుకొద్దామన్న ఆలోచనతో ముందుగా హిందీ భాషలో స్టార్ట్ చేశారు. హిందీలో బిగ్ బాస్ షో సూపర్ హిట్ కావడంతో తెలుగులోకి సైతం తీసుకొచ్చి ఘన విజయం సాధించారు. తెలుగులో వరుసపెట్టి సీజన్లతో ముందుకు సాగుతోంది బిగ్ బాస్ రియాలిటీ షో. తాజాగా బిగ్ బాస్ హౌజ్ నుంచి 11 మంది ఎలిమినేట్ కాగా ప్రస్తుతం 10 మంది మిగిలి ఉన్నారు. వీళ్ల మధ్య పదకొండోవారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. దీనికి సంబంధించిన నవంబర్ 17 గురువారం నాటి 74వ రోజు 75వ ఎపిసోడ్ వివరాళ్లోకి వెళితే..

ఒక్కొక్కరికి ఒక్కో స్టాండ్..

ఒక్కొక్కరికి ఒక్కో స్టాండ్..

బిగ్ బాస్ తెలుగు 11వ వారం కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ ను ప్రారంభించాడు బిగ్ బాస్. ఇందులో లో భాగంగా "కెప్టెన్సీ ఈజ్ యువర్ గోల్" అనే ఫిజికల్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో కెప్టెన్సీ కంటెండర్లుగా ఆదిరెడ్డి, రేవంత్, రోహిత్, శ్రీహాన్, ఇనయా సుల్తానా పోటి పడ్డారు. ఈ ఐదుగురు గుండ్రంగా నిల్చోని ఉండాలి. వారు నిల్చున్న చోట ఒక్కొక్కరికి ఒక్కో స్టాండ్ పెట్టారు. మధ్యలో పెద్ద బాల్ ఉంచారు. ఆ బాల్ ఎవరికి చెందిన స్టాండ్ లో నుంచి బయటకు వెళ్తుందో వారు అవుట్ అయినట్లు.

రేవంత్ సినిమా డైలాగ్..

రేవంత్ సినిమా డైలాగ్..

కెప్టేన్సీ ఈజ్ యువర్ గోల్ అనే టాస్క్ సేమ్ ఫుట్ బాల్ మ్యాచ్ లో గోల్ కొట్టినట్లు ఉంటుంది. ఈ బాల్ ను అడ్డుకోవడానికి అందరూ ఫిజికల్ గా గట్టిగానే పోటి పడ్డారు. ఆట స్టార్టింగ్ లో మెస్ చేయొద్ది నేను ఇంకా మెస్సీ చేస్తా అని చెబుతూ రేవంత్ ఓ సినిమా డైలాగ్ వదిలాడు. గేమ్ స్టార్ట్ అయ్యాక ఆ బిగ్ బాల్ ఎవరి స్టాండ్స్ నుంచి వెళ్లకుండా బాగానే ఆడారు. ఇనయ, రోహిత్ ఆడే క్రమంలో రోహిత్ స్టాండ్ నుంచి ఆదిరెడ్డి బాల్ ను బయటకు పంపడంతో రోహిత్ అవుట్ అయ్యాడు.

ఆదిరెడ్డికి రేవంత్ అండ్ శ్రీహాన్ ఓట్లు..

ఆదిరెడ్డికి రేవంత్ అండ్ శ్రీహాన్ ఓట్లు..

ఆదిరెడ్డి స్టాండ్ నుంచి బాల్ బయటకు పంపించేందుకు రేవంత్, శ్రీహాన్ కలిసి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆదిరెడ్డికి దెబ్బ తగిలి అరిచాడు. తర్వాత స్ట్రాటజీస్ ఉపయోగించారా అంటూ చాలా సీరియస్ అయ్యాడు ఆదిరెడ్డి. అప్పుడు బాల్ ఎలా వెళ్లింది అనేదానిపై డిస్కషన్ జరిగింది. తర్వాత రౌండ్ లో ఎవరు ఔట్ కాకపోవడంతో ఏకాభిప్రాయంతో ఒకరిని పంపించేయాలని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ఆదిరెడ్డి.. రేవంత్ పేరు చెప్పగా.. రేవంత్ ఆదిరెడ్డి పేరు చెప్పాడు. శ్రీహాన్ కూడా ఆదిరెడ్డి పేరు చెప్పడంతో ఇద్దరి ఓట్లు ఆదిరెడ్డికి పడ్డాయి.

రేవంత్ బలం ముందు తలవంచిన ఇనయా..

రేవంత్ బలం ముందు తలవంచిన ఇనయా..

ఇద్దరి ఓట్లతో ఆదిరెడ్డి ఔట్ అయ్యాడు. తర్వాత ఇనయా, శ్రీహాన్, రేవంత్ గేమ్ ఆడారు. ఇనయాపై రేవంత్ ఎటాక్ చేస్తూ బాల్ ను ఆమె స్టాండ్ నుంచి పంపించేందుకు చాలా బలం ఉపయోగించాడు. అయినా దాన్ని అడ్డుకునేందుకు ఇనయా చాలా గట్టిగా పోరాడింది. విశ్వ ప్రయత్నం చేసింది. కానీ ఈ ఫిజికల్ టాస్క్ లో రేవంత్ బలం ముందు ఇనయా తల వంచాల్సి వచ్చింది. అయితే శ్రీహాన్ ఉండగా రేవంత్ ఇనయానే టార్గెట్ చేశాడు.

ఇనయకు ఆదిరెడ్డి ఓదార్పు..

ఇనయకు ఆదిరెడ్డి ఓదార్పు..

ఫైనల్ రౌండ్ లో అమ్మాయిపై గెలవడం ఇష్టం లేకే అలా చేశానని చెప్పుకొచ్చాడు. ఇనయాను రేవంత్ టార్గెట్ చేసేటప్పుడు శ్రీహాన్ రాలేదు. దీంతో రేవంత్, శ్రీహాన్ ఇద్దరు కలిసి ఆడినట్లు అయింది. ఇంతకుముందు కూడా ఆదిరెడ్డిని ఇలాగే కలిసి పంపించారు. ఇనయా ఓడిపోవడంతో ఈసారి కూడా కెప్టెన్ అవ్వలేకపోయానన్న బాధతో వెళ్లి తన బెడ్ పై పడుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఇనయా నువ్ అంతసేపు రేవంత్ ను ఆపడం చాలా గ్రేట్.. రిగ్రీట్ ఫీలవ్వకండని ఓదార్చాడు ఆదిరెడ్డి.

రెండోసారి కెప్టెన్ అయినందుకు..

రెండోసారి కెప్టెన్ అయినందుకు..

ఇనయా మాత్రం అలా ఏడుస్తూనే ఉంది. మరోవైపు ఆటలో శ్రీహాన్ పై సునాయసంగా రేవంత్ గెలిచి కెప్టెన్ అయ్యాడు. రేవంత్ కెప్టెన్ అవ్వడంతో శ్రీహాన్, రేవంత్ ఇద్దరు తెగ సంతోషపడ్డారు. రేవంత్ కూడా రెండోసారి కెప్టెన్ అయినందుకు గట్టిగా అరుస్తూ ఎమోషనల్ అయ్యాడు. ఇనయా కూడా ఆ బాధ నుంచి బయటపడలేక ఏడుస్తూనే ఉంది. తను చేసిన పనికి ఇనయకు సంజాయిషీ ఇచ్చుకునేందుకు ట్రై చేశాడు రేవంత్. తనను ఒంటరిగా వదిలేయమని చెప్పి బాత్రూమ్ లోకి వెళ్లి కూర్చుని ఏడ్చేసింది ఇనయా.

 నామినేషన్లలో 9 మంది..

నామినేషన్లలో 9 మంది..


ఇక బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ 11వ వారం నామినేషన్లు ఎప్పటిలా అరుపులు, కేకలు, గొడవలతో కాకుండా చాలా సాఫీగా, కూల్ గా సాగియి. ఈ ప్రక్రియలో ప్రస్తుతం ఉన్న 10 మంది ఇంటి సభ్యుల్లో 9 మంది నామినేట్ అయ్యారు. ఫైమా కెప్టెన్ అయిన కారణంగా ఆమెను ఎవరు నామినేట్ చేయలేదు. ఫైమా తప్పా రొహిత్, ఇనయా, ఆదిరెడ్డి, కీర్తి, మెరీనా, శ్రీసత్య, శ్రీహాన్, రాజ శేఖర్, రేవంత్ నామినేషన్లలో ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X