twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: శ్రీసత్యకు బిగ్ బాస్ షాక్.. వాళ్లను నామినేట్ చేసేందుకు కన్నీళ్లు పెట్టుకున్న ఇనయా

    |

    అత్యధికంగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి. అమెరికాలో బిగ్ బ్రదర్ పేరుతో ముందుగా వచ్చిన ఈ షో సూపర్ డూపర్ హిట్ సాధించింది. దీంతో ఈ షోను ఇండియాలోకి తీసుకొచ్చారు. భారతదేశంలో ముందుగా హిందీ భాషలో బిగ్ బాస్ పేరుతే స్టార్ట్ చేశారు. హిందీలో ఈ షో సూపర్ హిట్ కావడంతో తెలుగులోకి సైతం తీసుకొచ్చి ఘన విజయం సాధించారు. తెలుగులో వరుసపెట్టి సీజన్లతో ముందుకు సాగుతోంది బిగ్ బాస్ రియాలిటీ షో. తాజాగా బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ 12వ వారం నామినేషన్ల ప్రక్రియను నవంబర్ 21 ఎపిసోడ్ ప్రోమోలో చూపించారు.

    77 రోజులు 78 ఎపిసోడ్ లు పూర్తి..

    77 రోజులు 78 ఎపిసోడ్ లు పూర్తి..

    బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ దాదాపు పూర్తయ్యే దశకు వచ్చింది. ఇప్పటికి 77 రోజులు 78 ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది. ఇంకొన్ని రోజుల్లో టైటిల్ విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. అయితే ఇప్పటికీ 11 వారాలకు 12 మంది ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ ను వీడి వెళ్లిపోయారు. వారిలో మొదటి వారంలో షానీ సల్మాన్, అభినయ శ్రీ ఎలిమినేట్ కాగా నేహా చౌదరి, ఆరోహి రావు, చంటి, సుదీప పింకీ, అర్జున్‌, సూర్య, చిత్తూరు చిరుత గీతూ రాయల్, బాలాదిత్య, వాసంతి కృష్ణన్ తోపాటు తాజాగా మెరీనా అబ్రహం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు.

    కన్ఫెషన్ రూమ్ లో నామినేషన్స్..

    కన్ఫెషన్ రూమ్ లో నామినేషన్స్..

    ఇక ఎలిమినేషన్ తర్వాత వచ్చేది నామినేషన్ల పరంపర. ఈ నామినేషన్లు గతవారం అయితే చాలా సాఫీగా సాగాయి. ఈసారి కూడా మరో ఇంటి సభ్యుడికి తెలీనివ్వకుండా కన్ఫెషన్ రూమ్ లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగించారు. బిగ్ బాస్ తెలుగు 6 నవంబర్ 21 సోమవారం నాటి ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోలో అన్నం సరిపోవట్లేదని కెప్టెన్ రేవంత్ కు వచ్చి ఫైమా చెబుతుంది.

    ఫుడ్ గురించి గొడవ..

    ఫుడ్ గురించి గొడవ..

    రైజ్ 4 కప్స్ సరిపోవన్న.. నేను 5 పెడితేనే సరిపోలేదని ఫైమా అంటే.. కానీ మనం ఫస్ట్ నుంచి సరిపోవడం కోసం కాదు ఇచ్చినదానిబట్టి పెడుతున్నామని రేవంత్ అన్నాడు. ఇచ్చిన రైస్ మాత్రమే యూజ్ చేసుకోవాలని లేదన్నా.. అయిపోతే మళ్లీ వాళ్లు పంపిస్తారని ఫైమా తెలిపింది. వాళ్లు ఇస్తారని చెప్పి మనకు నచ్చినట్లు పెట్టుకోవడం నాకు తెలిసి కరెక్ట్ కాదని రేవంత్ అంటాడు. మరోవైపు బాత్రూమ్ లో ఎవరితోనే ఫుడ్ దగ్గర రిస్ట్రిక్షన్స్ చేస్తే ఏమొస్తుందని కీర్తితో ఇనయా సుల్తానా అంది.

    రేవంత్ పై అరిచిన శ్రీహాన్..

    రేవంత్ పై అరిచిన శ్రీహాన్..

    జనాలకు ఏంటంటే.. వారమంతా సరిపోకుండా లాస్ట్ లో ఇచ్చేసిన ఆ సాటిస్ ఫ్యాక్షన్ ఉండదు.. అది గుర్తుండదు.. నీ కెప్టెన్సీ గెలుస్తుంది తప్పా ఆకలి తీరదు ఎవరికీ అని రేవంత్ తో శ్రీహాన్ అన్నాడు. నువ్ అదే పాయింట్ చెబుతూ హైలెట్ చేస్తూ అని రేవంత్ అంటే.. హైలెట్ చేయడం కాదు.. అది ఎగ్జాంపుల్ అని శ్రీహాన్ గట్టిగా అరిచాడు. నీ కెప్టెన్సీలో నువ్ సేవ్ చేయాలని, నువ్ పేరు తెచ్చుకోవాలని చూస్తున్నావ్ తప్పా కడుపు నిండాలి కదా అని శ్రీహాన్ అన్నాడు.

    ఆదిరెడ్డి పనికి హర్ట్ అయ్యా..

    ఆదిరెడ్డి పనికి హర్ట్ అయ్యా..

    ఇక నామినేషన్ల ప్రక్రియ కన్ఫెషన్ రూమ్ లో సాగింది. ఎవరినీ నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి ఫొటోను ముక్కలు చేసి కారణం చెప్పాలని అడిగారు బిగ్ బాస్. శ్రీసత్యను కీర్తి నామినేట్ చేసింది. ఒకరిని గుచ్చి గుచ్చి రెచ్చగొట్టడంలో ఒక అడుగు ముందే ఉంటుదని కీర్తి చెప్పింది. ఆదిరెడ్డిని రేవంత్ నామినేట్ చేశాడు. ఆదిరెడ్డి చేసిన పనికి చాలా హర్ట్ అయినట్లుగా రేవంత్ తెలిపాడు.

    విడివిడిగా ఆడితేనే కదా..

    విడివిడిగా ఆడితేనే కదా..

    మూడు వారాల నుంచి నామినేషన్స్ నుంచి సేవ్ అవుకుంటూ వస్తున్నాడని రాజ శేఖర్ ని నామినేట్ చేసింది శ్రీసత్య. తర్వాత శ్రీసత్య నామినేషన్ కు వాలిడ్ రీజన్ చెప్పాల్సిందిగా బిగ్ బాస్ చెప్పాడు. దీంతో శ్రీసత్య షాక్ అయితే మినిమమ్ ఉంటది మనతోని అని రాజ్ అనుకుంటూ వెళ్లడం చూపించారు. ఇద్దరు కలిసి ఆడితే రసవత్తరంగా ఏముంది.. విడివిడిగా ఆడితేనే కదా అని శ్రీహాన్ ను నామినేట్ చేశాడు ఆదిరెడ్డి.

    గెలిపించడానికా.. హింసించడానికా..

    గెలిపించడానికా.. హింసించడానికా..

    కలిసి ఆడారు.. కలిసి ఆడారు అని అన్నిసార్లు దాన్నే హైలెట్ చేయాల్సిన అవసరం ఏముంది అని చెబుతూ ఆదిరెడ్డిని నామినేట్ చేశాడు శ్రీహాన్. తర్వాత అక్కడ గెలిపించడానికా లేదా ఇక్కడ హింసించడానికా.. అది నాకు అర్థం కాలేదని అంటూ ఇనయను నామినేట్ చేశాడు శ్రీహాన్. ఇప్పుడు వాళ్లిద్దరిని కలిపి నామినేట్ చేసేంత దూరం పెరిగిపోయిందంటూ ఇనయా సుల్తానా కన్నీళ్లు పెట్టుకుంది. అలా ఎందుకు జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే. ఇక ఈ వారం నామినేషన్లలో రేవంత్, కీర్తి తప్పా మిగతా సభ్యులందరు ఉన్నారని సమాచారం.

    English summary
    Bigg Boss Telugu 6: Inaya Sultana Getting Emotional For Nominating Contestants In 12th Week Nominations Of November 21 Episode Promo.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X