Bigg Boss Telugu 6: శ్రీహాన్ కు షాక్ ఇచ్చిన ఇనయా సుల్తానా.. అతన్నే టైటిల్ కొట్టి రమ్మంటూ ట్విస్ట్!

బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ అనూహ్య పరిణామాలు, షాకింగ్ ఎలిమినేషన్స్ తో ముగింపు దశకు చేరుకుంది. ఇంకొక వారం గడిస్తే చాలు టైటిల్ విన్నర్ ని ప్రకటించనున్నారు. వచ్చే ఆదివారం గ్రాండ్ ఫినాలే జరపనున్నట్లు ఇదివరకే వార్తలు వినిపించాయి. ప్రస్తుతం హౌజ్ లో ఆరుగురు ఇంటి సభ్యులు ఉన్నారు.

తాజాగా 14వ వారం లేడీ టైగర్ ఇనయా సుల్తానా ఎలిమినేట్ అయి హౌజ్ ను వీడింది. చివరిగా వెళ్లేటప్పుడు ఆమె చాలా ఎమోషనల్ అయింది. స్టేజీపై తన జర్నీ చూపించడంతో అది చాలా బాగుందని, ఎంతో హ్యాపీగా ఉందని తెలిపింది. ఆ తర్వాత శ్రీహాన్ గురించి పలు షాకింగ్ కామెంట్స్ చేసింది ఇనయా సుల్తానా.

ఆర్జీవీతో పరిచయంతో..

ఆర్జీవీతో పరిచయంతో..

బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి 21 మంది సెలెబ్రిటీలు అడుగు పెట్టారు. అందులో డైరెక్టర్ రామ్ గోపాల్ ద్వారా పాపులర్ అయిన ఇనయా సుల్తానా ఒకరు. ఇనయా బర్త్ డేకు గెస్ట్ గా వెళ్లిన దర్శకుడు ఆర్జీవీ ఆమెతో కలిసి పార్టీలో చిందులేశారు. దీంతో ఆమె ఒక్కసారిగా పాపులర్ అయిపోయంది. అలాగే పలు విమర్శలు కూడా ఎదుర్కొంది. అదే ఆమెకు బిగ్ బాస్ ఎంట్రీకి అవకాశంగా మారిందని పలువురు భావించారు.

విన్నర్ మెటీరియల్ గా ఇనయా..

విన్నర్ మెటీరియల్ గా ఇనయా..

అయితే తాజాగా 14వ వారం నామినేషన్లలో ఉన్నవాళ్లలో అనూహ్యంగా, మోస్ట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న లేడీ టైగర్ ఇనయా సుల్తానా ఎలిమినేట్ అయింది. ఆమె ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే వార్తలు రావడం తెలిసిందే. దీంతో ఇనయా ఎలిమినేషన్ పెను సంచలనంగా మారింది. ఎందుకంటే తనదైన శైలీలో గేమ్ ఆడుతూ విపరీతమైన ఫ్యాన్ బేస్ సంపాందించుకుంది ఇనయా. దీంతో ఆమె కచ్చితంగా టాప్ 2 లేదా టాప్ 3లో ఉంటుందని అంతా భావించారు. అంతేకాకుండా ఆమె విన్నర్ మెటిరీయల్ అని కూడా ఒక వర్గం ప్రేక్షకులు అనుకున్నారు.

తీసుకోలేకపోతున్న ఇనయా ఫ్యాన్స్..

తీసుకోలేకపోతున్న ఇనయా ఫ్యాన్స్..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో ఏ లేడి కంటెస్టెంట్ సంపాదించుకోలేని ఫ్యాన్ బేస్ ను ఇనయా సాధించుకుంది. అయితే అనూహ్యంగా ఇనయా ఎలిమినేట్ కావడం ఆమె ఫ్యాన్స్ తీసుకోలేకపోతున్నారు. అలాగే ఇనయాకు ఓటింగ్ బాగానే పడిందని, కానీ బీబీ టీమ్ తమకు నచ్చిన, మెనేజ్ మెంట్ కోటా కంటెస్టెంట్స్ ను కాపాడుకోవడం కోసమే అన్ ఫెయిర్ ఎలిమినేషన్ చేశారని టాక్ వినిపిస్తుంది. కానీ ప్రేక్షకులకు మాత్రం ఇనయా ఓటింగ్ తక్కువ ఉన్నట్లు ఫేక్ గా చూపించారని విమర్శలు చేస్తున్నారు.

గెలిచిన సింగర్ రేవంత్..

గెలిచిన సింగర్ రేవంత్..

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ 98వ రోజు 99వ ఎపిసోడ్ లో డ్యాన్స్ వేస్తూ ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. ఆ తర్వాత ఇంటి సభ్యులకు ఒక టాస్క్ ఇచ్చారు. దాని పేరు 'మీకు ఎంత తెలుసు' అని చెప్పారు నాగార్జున. బిగ్ బాస్ హౌజ్ కు సంబంధించిన పలు ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానాలు తెలిసిన వాళ్లు గంట కొట్టి ఆన్సర్స్ చేయాలి. ఈ టాస్క్ లో సింగర్ రేవంత్ గెలిచి గిఫ్ట్ హ్యాంపర్ అందుకున్నాడు.

ఇనయా ఎలిమినేట్ అయినట్లు..

ఇనయా ఎలిమినేట్ అయినట్లు..

అనంతరం ఇంటి సభ్యుల చేత స్పెప్పు వెయి.. గెస్ చేయి టాస్క్ ఆడించారు నాగార్జున. ఇక చివరిగా ఆదిరెడ్డి, ఇనయా నామినేషన్ లో మిగిలారు. ఎలిమినేషన్ టైమ్ వచ్చిందని నాగార్జున తెలిపారు. స్టేజీపై వైట్ బోర్డ్ ఉంచారు. ఒక రోలర్ తీసుకుని వైట్ బోర్డ్ పై పెయింట్ లా వేస్తే ఎలిమినేట్ అయిన వారు ఎవరనేది తెలుస్తుందని నాగార్జున తెలిపారు. అలా రోలర్ వైప్ చేయడంతో ఇనయా సుల్తానా పేరు వచ్చింది. దీంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.

ఏవీలో వచ్చేటంతగా..

ఏవీలో వచ్చేటంతగా..

ఎలిమినేట్ అయ్యాక వచ్చేముందు గేట్ వద్ద ఎమోషనల్ అయింది ఇనయా సుల్తానా. అందరినీ ఈ వీక్ బాగా ఎంజాయ్ చేయమని చెప్పింది. ఇనయా జర్నీ చూపించిన తర్వాత హౌజ్ మేట్స్ గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీ చెప్పమని నాగార్జన అడిగారు. దీంతో శ్రీహాన్ తో మొదలు పెట్టిన ఇనయా.. అతను బ్యాక్ బిట్చింగ్ (ఒకరి గురించి వెనుకాల మాట్లాడటం) చేస్తాడని చెప్పింది. దీనికి నేను అలా అయితే చేయలేదు కానీ, ఓకే అన్నాడు. ఇదివరకు బాలాదిత్య అన్నారు, ఇంకొకరు కూడా చెప్పారు. అలాగే ఏవీలో కనపడేంతా వస్తుందంటే చూసుకో శ్రీహాన్ అని ఒక సలహా లాగా చెప్పింది ఇనయా.

మంచి వాడని తర్వాతే తెలిసింది..

మంచి వాడని తర్వాతే తెలిసింది..

అలాగే ఎదుటి వాళ్ల పరిస్థితి అర్థం చేసుకోవాలి, బాగా అగ్రెషన్ అవుతాడు అని ఇనయా చెబితే.. అది నాకు చాలా లేట్ గా తెలిసిందే కచ్చితంగా మార్చుకుంటానని చెప్పాడు శ్రీహాన్. అయితే దీనికంటే ముందే శ్రీహాన్ చాలా మంచి వ్యక్తి. అసలు మాకు ఎందుకు పడలేదో తెలియదు కానీ చాలా మంచి వాడని తర్వాతే తెలిసింది. నాకు ఇప్పుడు నిజంగా అనిపిస్తుంది కచ్చితంగా నువ్వే టైటిల్ కొట్టి రావాలి శ్రీహాన్ అహ్మద్ అని ఇనయా సుల్తానా చెప్పుకొచ్చింది. దీనికి కొంత షాక్ అయిన శ్రీహాన్ థ్యాంక్యూ ఇనయా.. నీ నోటి నుంచి ఈ మాట వినడం అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X