Don't Miss!
- News
student: న్యూడ్ వీడియోతో షాక్ అయిన కాలేజ్ విద్యార్థి, బ్లాక్ మెయిల్ చేసిన శాడిస్టు లేడీ, క్లైమాక్స్ లో?
- Sports
IND vs AUS: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. బీసీసీఐ కీలక నిర్ణయం!
- Lifestyle
తలనొప్పి మరియు డయాబెటిస్ కి మధ్య సంబంధం ఉందా? కారణాలేంటో ఇక్కడ తెలుసుకోండి
- Finance
fiscal deficit fy23: ఇదీ ఈ ఏడాది ఖర్చు, ఆదాయం.. మరి లోటు మాటేమిటి ?
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
Inaya Sultana Marriage: ఇనయా సుల్తానాకు పెళ్లయిందా?.. భర్తతో ఫొటో వైరల్!
ఇనయా సుల్తానా.. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ద్వారా పాపులర్ అయిన మరో బ్యూటి. ఓ పార్టీలో ఇనయా సుల్తానాతో ఎలా పడితే అలా రామ్ గోపాల్ వర్మ చిందులు వేయడంతో ఆమె ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. అయితే ఇనయాకు గుర్తింపు వచ్చింది కానీ పలు విమర్శలను కూడా ఎదుర్కొంది. ముఖ్యంగా తన ఇంట్లో నుంచి ఆమెకు సపోర్ట్ దొరకడం కరువైంది. కొన్ని సినిమాలు చేస్తూ కెరీర్ ను ఎలాగోలా నెట్టికొస్తుంది. ఈ క్రమంలోనే ఇనయా సుల్తానాకు బిగ్ బాస్ తెలుగు 6లో పాల్గొనే అవకాశం లభించింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఎంటరైన ఇనయా అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే ఇప్పుడు తాజాగా ఆమెకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

వరుస సీజన్లతో..
బిగ్
బ్రదర్
అనే
పేరుతో
అమెరికాలో
ప్రారంభమైన
రియాలిటీ
షో
ఎల్లలు
దాటి
ఇండియాలోకి
బిగ్
బాస్
గా
వచ్చింది.
రావడమే
కాకుండా
అశేషమైన
ప్రేక్షకాదరణ
పొందింది.
దీంతో
ముందుగా
హిందీలో
ప్రారంభమైన
ఈ
రియాలిటీ
షోను
క్రమేణా
మిగతా
భాషల్లోకి
సైతం
తీసుకొచ్చారు.
ఇక
తెలుగులో
2017లో
అనేక
అనుమానాల
నడుమ
ప్రారంభమైన
ఈ
రియాలిటీ
షో
వరుస
సీజన్లతో
దూసుకుపోతూ
ప్రస్తుతం
ఆరో
సీజన్
నడుస్తోంది.
ఇది
కూడా
మరో
రెండు
రోజుల్లో
పూర్తి
కానుంది.

21 మంది సెలబ్రిటీల్లో ఒకరిగా..
ఇదిలా ఉంటే సెప్టెంబర్ 4న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లోకి మొత్తంగా 21 మంది సెలబ్రిటీలు ఎంట్రీ ఇచ్చారు. కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావు, రేవంత్‌లతోపాటు ఆర్జీవీ బ్యూటీ ఇనయా సుల్తానా కూడా అడుగుపెట్టింది.

అతనికి గట్టిపోటీగా..
బర్త్ డే పార్టీలో ఆర్జీవీతో కలిసి డ్యాన్స్ చేయడానికి ముందే పలు చిత్రాల్లో కూడా నటించింది ఇనయా సుల్తానా. ఇక బిగ్ బాస్ హౌజ్ లోకి ఎలాంటి అంచనాలు లేకుండా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ రెండు వారాళ్లో వెళ్లిపోతుందని అంతా అనుకున్నారు. కానీ తనదైన ఆట తీరుతో ఇప్పటివరకు ఆకట్టుకోవడమే కాకుండా టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన రేవంత్ కు గట్టి పోటీ అని ప్రేక్షకులు అనుకుంటూ వచ్చారు.

పాపులారిటీని ఎంజాయ్ చేస్తూ..
ఇక 14వ వారం జరిగిన ఎలిమినేషన్ లో భాగంగా ఇనయా సుల్తానా ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయి హౌజ్ ను వీడింది. హౌజ్ నుంచి బయటకు వెళ్లిన ఇనయా సుల్తానా తనకు వచ్చిన పాపులారిటీని ఎంజాయ్ చేస్తోంది. ఎవరిపై ఎలాంటి విమర్శలు చేయకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. అలాగే బిగ్ బాస్ లో ఆర్జే సూర్యతో ఏర్పడిన బాండింగ్ తో అతనితో కలిసి చక్కర్లు కొడుతోందని ఒక టాక్ అయితే వినిపిస్తోంది.

త్రో బ్యాక్ పిక్ వైరల్..
ఇదిలా ఉంటే లేడీ టైగర్ ఇనయా సుల్తానాకు సంబంధించిన ఒక ఆసక్తికర న్యూస్ గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో గింగిరాలు తిరుగుతోంది. నెటిజన్లను అయోమయానికి గురి చేస్తోంది. బిగ్ బాస్ తెలుగు 6 కంటెస్టెంట్ గా పాల్గొన్న ఇనయా సుల్తానాకు పెళ్లైందా అని టాపిక్ నడుస్తోంది. ఇందుకు కారణం ఆమెకు సంబంధించిన ఒక పాత ఫొటోనే. ఇనయా త్రో బ్యాక్ పిక్ ఒకటి తెగ వైరల్ అవుతోంది.

అవకాశాలు రావన్న భయం..
ఇనయా సుల్తానా పాత ఫొటోలో ఆమెకు పెళ్లయినట్లుగా కనిపిస్తోంది. గ్రీన్ కలర్ చీరలో మల్లెపూలు పెట్టుకుని, ఒక వ్యక్తి పక్కన స్మైలింగ్ ఫేస్ తో ఆ ఫొటోలో దర్శనమిచ్చింది లేడీ టైగర్. ఈ ఫొటో చూసే నెటిజన్స్ అంతా ఇనయాకు పెళ్లయిందని భావిస్తున్నారు. అయితే ఇందులో ఎంతనిజముందో తెలియాలంటే ఇనయా స్పందించాల్సిందే. ఇక సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటీమణులు వివాహం అయిన కూడా అవకాశాలు రావన్న భయంతో పెళ్లి వంటి తమ వ్యక్తిగత విషయాలను దాచి పెడతారన్న విషయం తెలిసిందే. అలానే ఇనయా కూడా చేసు ఉండొచ్చని చర్చించుకుంటున్నారు.