For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: లోపల లావా పొంగుతోందన్న రేవంత్.. గట్టిగా హగ్ చేసుకుని ఏడ్చేసిన ఇనయా

  |

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యధికంగా ప్రేక్షకాదరణను పొందుతూ దూసుకుపోతోంది బిగ్ బాస్ రియాలిటీ షో. బాలీవుడ్ లో ప్రారంభమై సూపర్ సక్సెస్ అయిన ఈ షో తెలుగులోకి వచ్చి ప్రస్తుతం ఆరో సీజన్ విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఇటీవల ఎపిసోడ్స్ లలో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జోరుగా సాగింది. సంచాలక్ గా వ్యవహరించాల్సిన గీతూ రాయల్ సైతం గేమ్ ఆడి షాక్ కు గురి చేసింది. ఇక తాజాగా కెప్టెన్సీ టాస్క్ నిర్వహించాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఆరుగురు ఇంటి సభ్యులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. వీరిలో గేమ్ మంచి రసవత్తరంగా సాగినట్లే ఉంది. తాజాగా దీనికి సంబంధించిన అక్టోబర్ 27వ ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేసింది స్టార్ మా.

  రేటింగ్ తగ్గడంతో..

  రేటింగ్ తగ్గడంతో..

  అమెరికాలో బిగ్ బ్రదర్ పేరుతో వచ్చిన రియాలిటీ షో ప్రస్తుతం భారతదేశంలోని అనేక భాషల్లో బిగ్ బాస్ టైటిల్ తో జోరుగా ప్రసారం అవుతోంది. కానీ, ఈ షోకి రేటింగ్ తగ్గడంతో ఇటీవల దాన్ని పెంచే పనిలో పడ్డాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే ఇంటి సభ్యులకు పనిష్ మెంట్ ఇచ్చి దారిలోకి తీసుకొచ్చాడు. ప్రస్తుతం ప్రతి ఒక్క హౌజ్ మేట్ గేమ్ ఆడుతూ ఎంటర్టైన్ చేస్తున్నారు.

  వెటకారంగా మెచ్చుకున్న రేవంత్..

  వెటకారంగా మెచ్చుకున్న రేవంత్..

  ఇక తాజాగా బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ఎనిమిదో వారం కెప్టెన్సీ టాస్క్ మంచి హీట్ మీద సాగుతున్నట్లుగా ఉంది. చేపల చెరువు టాస్క్ లో సంచాలక్ గా వ్యవహరించిన గీతూ రాయల్ పై ఇంటి సభ్యులు చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో.. గీతూ, ఆదిరెడ్డిలను వెటకారంగా మెచ్చుకున్నాడు రేవంత్. మరోవైపు డ్యామేజ్ సంచాలక్ అంటూ కీర్తి భట్ అసహనం వ్యక్తం చేసింది.

  లావా పొంగుతోంది, కానీ..

  లావా పొంగుతోంది, కానీ..

  ఇక శ్రీసత్య, శ్రీహాన్ తో రేవంత్ మాట్లాడుతూ.. నాకు లోపల లావా పొంగుతోంది.. కానీ పైకి మాత్రం తపస్సు చేస్తున్న రుషిలా ఉన్నాను అని చెప్పాడు. తర్వాత బంగారు తల్లి దా అని పిలిచాడు. ప్రతిసారి ఏదైనా చేసేముందు నీట్ గా వెన్నే రాసి చేస్తే నీ రియల్ క్యారెక్టర్ ఏంటీ అంటూ బాలాదిత్య గురించి గీతూతో శ్రీ సత్య అడిగినట్లు తెలుస్తోంది. చేపల టాస్క్ లో ముందు అందరినీ రెచ్చగొట్టి గేమ్ అయిపోయాక చివర్లో ఏడ్చేసిదని రాజ్, రోహిత్ మాట్లాడుకున్నారు.

  నడుముకి తాడు కట్టుకుని..

  నడుముకి తాడు కట్టుకుని..

  కెప్టెన్సీ కోసం పోటీ పడే ఇంటి సభ్యులకు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. నడుముకి తాడు కట్టుకుని చిక్కులు ఉన్న తాళ్ల నుంచి బయటకు రావాల్సిందిగా ఉంది ఆ టాస్క్. ఈ క్రమంలో దెబ్బతాకినట్లుగా అరిచేశాడు రేవంత్. ఈ గేమ్ లో రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య, ఫైమా, కీర్తి, సూర్య పాల్గొనట్లు కనపడింది. ఇందులో ఎవరికీ వారు గేమ్ బాగా ఆడినట్లు తెలుస్తోంది.

  గట్టిగా హగ్ చేసుకుని..

  గట్టిగా హగ్ చేసుకుని..

  ఇక వాష్ రూమ్ ఏరియాలో ఆర్జే సూర్యను ఇనయా సుల్తానా చాలా గట్టిగా హగ్ చేసుకుని ఏడ్చేసింది. ఆమెను ఓదారుస్తూ సూర్య కనిపించాడు. అయితే ఇనయా అలా ఎందుకు ఏడవాల్సి వచ్చిందో పూర్తి ఎపిసోడ్ ప్రసారమైతే కానీ చెప్పలేం. కానీ గత ఎపిసోడ్ లలో మెరీనాతో తనకు ఆర్జే సూర్య అంటే చాలా ఇష్టం పెరిగిపోతుందని చెప్పుకొచ్చింది.

  బుజ్జమ్మ ఉందని తెలిసినా..

  బుజ్జమ్మ ఉందని తెలిసినా..

  సూర్యకు బుజ్జమ్మ ఉందని తెలిసినా ఫ్రెండ్ కన్నా ఎక్కువ అయిపోతున్నాడని, అది తప్పు కదా అయిన కంట్రోల అవ్వట్లేదన్నట్లుగా మెరీనాతో బాధపడింది ఇనయా సుల్తానా. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ఎనిమిదో వారంలో మొత్తం ఇంటి సభ్యులు 14కు 14 మంది నామినేషన్లలో ఉన్నారు. ఈవారం కెప్టెన్ అయినవాళ్లు ఆ నామినేషన్ నుంచి తప్పించుకునే అవకాశం ఉండొచ్చు.

  English summary
  Revanth Fires On Geetu Royal And Inaya Sultana Hugs RJ Surya And Crying In Bigg Boss Telugu 6 Season October 27 Episode Promo
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X