Bigg Boss Telugu 6: అతనంటే ఇష్టం, క్రష్.. బిగ్ బాస్ కే చెప్పేసిన RGV బ్యూటీ
సాధారణంగా బిగ్ బాస్ హౌజ్ అంటే గొడవలు, అరుపులు, కేకలతో రసవత్తరంగా సాగుతుంది. కానీ గత రెండు ఎపిసోడ్ లలో అలాంటివేమి లేకుండా కేవలం సరదా సన్నివేశాలతో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశాడు బిగ్ బాస్. అక్టోబర 5 బుధవారం ప్రసారమైన 31వ రోజు 32వ ఎపిసోడ్ లో కూడా బిగ్ బాస్ బర్త్ డే వేడుకలు కొనసాగాయి. అంతకుముందు ఎపిసోడ్ లానే ఎంటర్ టైన్ చేసేందుకు ప్రయత్నించారు ఇంటిసభ్యులు. ఇందులో భాగంగానే హౌజ్ లో రాత్రి పూట మెరీనా, వాసంతి దెయ్యాల్లా వేషం వేసుకుని పడుకున్న ఇంటి సభ్యులకు భయపెట్టేందుకు ప్రయత్నించారు. అలాగే హౌజ్ లోకి ఒక జోకర్ ను పంపించి ఫన్ క్రియేట్ చేశారు.

గొడవలు, అరుపులు కాకుండా..
గొడవలు, అరుపులు కాకుండా గత రెండు రోజులుగా బిగ్ బాస్ హౌజ్ సరదాగా సాగుతోంది. బిగ్ బాస్ తో సహా ఇంటి సభ్యులందరూ ఫన్ జెనరేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లో బిగ్ బాస్ బర్త్ డే వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే బిగ్ బాస్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వాసంతి, మెరీనా రాత్రిపూట దెయ్యాల్లా వేషం వేసి పడుకున్న హౌజ్ మేట్స్ ను భయపెట్టే ప్రయత్నం చేశారు.

ఫైమా ఒక్కరే కొంచెం..
వాష్ రూమ్ కు అని వెళ్లిన ఫైమా ఒక్కరే కొంచెం భయపడింది. ఆ తర్వాత పడుకున్న వాళ్లని లేపి భయపెట్టేందుకు ప్రయత్నించారు వాసంతి అండ్ మెరీనా. కానీ అదంతగా వర్కౌట్ కాలేదు. దెయ్యాలుగా వాళ్లు చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేదు. ఇక అంతకుముందు ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఫైమాకు ముగ్గురు ఇంటి సభ్యుల నిద్రకు భంగం కలిగించాలనే సీక్రెట్ టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రాత్రి పూట స్పూన్లతో సౌండ్ చేయడం, పిల్లోస్ ని ఇంటి సభ్యులపై వేయడం వంటి ప్రయత్నాలు చేసింది.

కలర్ గురించి రాజశేఖర్ అనడంతో..
వాసంతి లేచి చూసింది. అలాగే ఉదయం తన నిద్ర డిస్టర్బ్ అయినట్లు ఫైమాతో శ్రీసత్య చెప్పింది. ఇక తర్వాత తన కలర్ గురించి రాజశేఖర్ ఏదో అనడంతో తను చాలా బాధపడినట్లు ఫైమా తెలిపింది. కలర్ పేరుతో బాడీ షేమింగ్ చేయకూడదని చెప్పింది ఫైమా. అనంతరం అందుకు రాజశేఖర్ సారి చెప్పాడు. సూర్య అపరిచితుడిలా మారి కాసేపు నవ్వించేందుకు ట్రై చేశాడు. రాము, అపరిచితుడు, రెమోగా బాగానే ట్రై చేశాడు. నువ్ నన్ను ఏం చేయలేవురా అని సూర్యతో ఫైమా అనడం వంటివి చేసి బాగానే నవ్వు తెప్పించారు.

ఆర్జే సూర్య అంటే ఇష్టం..
అనంతరం ఇనయా సుల్తానా కన్ఫెషన్ రూమ్ కి పిలిపించాడు బిగ్ బాస్. ఆమె ముందు ఓ కేకును పెట్టి.. మీరు ఎదురుగా ఉన్న కేక్ తినాలంటే ఇంట్లో జరుగుతున్న ఆసక్తికరమైన విషయాలు చెప్పాల్సిందిగా కోరాడు బిగ్ బాస్. అందుకు ఇనయా.. ''ఇంతకుముందు డమ్ షెరాడ్స్ ఆడినప్పుడు నాకు రాజ్ అంటే ఇష్టం అని చెప్పాను. కానీ నిజానికి నాకు ఆర్జే సూర్య అంటే ఇష్టం, అతనే నా క్రష్. రోజురోజుకు ఇంకా నచ్చేస్తున్నాడు. ఆరోహితో మాట్లాడినప్పుడు కాస్త కోపం వచ్చేది'' అని చెప్పింది.

రగులుతోంది మొగలిపొద..
ఇంతకుముందు ఎపిసోడ్ లో సూర్య అంటే ఇనయాకు ఇష్టమని, వాళ్లిద్దరి మధ్య ఏదో రగులుతోంది మొగలిపొద అని బిగ్ బాస్ తో రాయల్ బేబీ గీతూ చెప్పిన విషయం తెలిసిందే. ఇక వాసంతికి అర్జున్ దగ్గరవుతున్నాడేమో అని అనిపిస్తుందని బిగ్ బాస్ కు చెప్పింది ఇనయా. ''అర్జున్ ఫోకస్ శ్రీ సత్య నుంచి వాసంతివైపు మళ్లినట్లు అనిపిస్తుంది బిగ్ బాస్. భవిష్యత్తులో వాళ్లిద్దరు జంటగా మారే అవకాశం ఉంది '' అని తెలిపింది ఇనయా. తర్వాత తనకు కేక్ ఇచ్చేందుకు ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదని ఏడ్చేసింది ఇనయా. ఆసక్తికర విషయాలు చెప్పినందుకు గాను తనకు నచ్చిన వారితో ఈ కేక్ ను షేర్ చేసుకోవచ్చని ఇనయాకు తెలిపాడు బిగ్ బాస్.

రేవంత్ ముద్దు పెట్టడం..
ఇంతకుముందు ఇనయా సుల్తానా నామినేట్ అయినప్పుడు ఆమెకు సపోర్ట్ చేయాల్సిందిగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తర్వాత ఆది రెడ్డి, గీతూ రాయల్ కలిసి ముచ్చట్లు పెట్టుకున్నారు. రేవంత్ ముద్దు పెట్టడం గురించి మాట్లాడుకున్నారు. అలాగే సుదీప చెప్పే పనులు బాసీగా ఉన్నాయన్నారు. ఇక తర్వాత శ్రీహాన్, చంటిలకు వ్యాక్సింగ్ చేయాలని అంతసేపు తాను నిద్రపోతానని, తన నిద్రకు భంగం కలిగించకూడదని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. వ్యాక్సింగ్ చేసేటప్పుడు శ్రీహాన్ అరుస్తాడు. దీంతో శ్రీహాన్ ను మౌనవ్రతం చేయాల్సిందిగా చెబుతాడు బిగ్ బాస్. అతనికి గొంతుగా ఇనయా సుల్తానా ఉంటుందని చెప్పాడు.

శ్రీ సత్య ఫేస్ కు కేక్ కొట్టి..
అనంతరం బిగ్ బాస్ హౌజ్ లోకి ఒక జోకర్ వస్తాడు. అతను వచ్చాక ఇంటి సభ్యులను ఫ్రీజ్ లో ఉండాల్సిందిగా బిగ్ బాస్ చెబుతాడు. అతను ఇంటి సభ్యులతో కాసేపు ఆడుకుంటాడు. చివరికి శ్రీ సత్య ఫేస్ కు కేక్ కొట్టి వెళ్లిపోతాడు. ఆ కేక్ ను అలాగే తింటుంది గీతూ రాయల్. ఇక రాత్రిపూట సభ్యులందరు స్కూల్ స్కిట్ చేశారు. టీచర్ గా బాలాదిత్య చేయగా మిగిలిన వారంతా స్కూలు పిల్లల్లా చేశారు. నవరసాలు పలికిస్తూ ఫైమా ఆకట్టుకుంది. చిన్న పిల్లలా మాట్లాడుతూ గీతూ రాయల్ బాగానే చేసింది. శ్రీహాన్ తోపాటు మిగతా వారంతా బాగానే నటించారు.
కాగా బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ఐదో వారం నామినేషన్లలో మొత్తం 8 మంది ఉన్నారు. వారిలో ఇనాయా సుల్తానా, మెరీనా, బాలాదిత్య, చలాకీ చంటి, జబర్ధస్త్ ఫైమా, వాసంతి కృష్ణన్, ఆది రెడ్డి, అర్జున్ కల్యాణ్‌లు ఉన్నారు.


Click it and Unblock the Notifications











