Bigg Boss Telugu 6: ఇనయ ఓవరాక్షన్.. గాలి తీసేసిన రేవంత్.. ఇలా అయితే ఎలిమినేట్ పక్కా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 మొదలై మూడు రోజులైనా కూడా ఇంకా అసలైన హడావిడి మొదలు కాలేదు అనే చెప్పాలి. కంటెస్టెంట్ సంఖ్య తగ్గే కొద్దీ ఆట మీద ఆసక్తి అయితే కలుగుతుంది. ఇక ఎక్కువ మంది ఉండడంతో ఎవరెవరు ఏం చేస్తున్నారు అనే విషయంలో పెద్ద కన్ఫ్యూజన్ నెలకొంది. అలాగే ఈసారి కంటెస్టెంట్లలో ముందుగా ఎవరు వెళ్ళిపోతారో కూడా సోషల్ మీడియాలో ఒక టాక్ అయితే గట్టిగానే వినిపిస్తోంది. ముఖ్యంగా ఇనయ సుల్తానా ఓవరాక్షన్ అయితే మామూలుగా లేదు అని ట్రోలింగ్స్ వస్తున్నాయి. సింగర్ రేవంత్ ఆమెకి ఊహించని కౌంటర్ కూడా ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Photo Courtesy: Star మా and Disney+Hotstar

క్లారిటీ లేకుండా..

క్లారిటీ లేకుండా..

ఇక మొదటి రోజు నుంచి చూసుకుంటే ఇనయ సుల్తానా కూడా కాస్త విసుగు తెప్పిస్తోంది అని కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆమెకు తోడు గలాటా గీతూ సైతం మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇక ఇనయ వరుసగా ఓడిపోతూ ఉండడంతో కూడా ఆమెకు చిరాకు వస్తుంది. దీంతో ఎలా ప్రవర్తిస్తున్నాను అనే విషయంలో కొంచెం కూడా క్లారిటీ లేకుండా హద్దులు అయితే దాటేస్తుంది.

అదే పెద్ద మైనస్

అదే పెద్ద మైనస్


సాధారణంగా ఎవరైనా టాస్క్ లో ఓడిపోతే వారి మిస్టేక్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను అంటే సరిపోతుంది. లేదంటే ఎవరైనా తనను కావాలని ఓడించారు అని అనిపిస్తే ఆ పాయింట్ను చాలా బలంగా చెప్పాలి. చివరి వరకు ఒకే తరహా పాయింట్ చెబుతూ ఉంటే ఆడియెన్స్ కు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. కానీ ఇనయ మాత్రం ముందు ఆటలలో ఓడిపోయిన తర్వాత ఒకటి అంటూ ఆ తర్వాత చర్చల్లోకి వచ్చేసరికి మరో పాయింట్ మాట్లాడుతుండడం ఆమెకు పెద్ద మైనస్ గా మారింది.

 టాస్క్ లో పట్టుబట్టి

టాస్క్ లో పట్టుబట్టి

రోలింగ్ టాస్క్ లో నేను ఈసారి గట్టిగా పోరాడుతాను అంటూ ట్రాష్ లో ఉన్న ఇనయ అందరిని ఒప్పించింది. అసలే మొదటి టాస్క్ లో ఆమె ఆది రెడ్డితో ఓడిపోయింది. ఇక మరోసారి అవకాశం ఎలా ఇవ్వాలి అని అందరూ అనుకున్నారు. అయినప్పటికీ కూడా అందరూ అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. ఇక పట్టుబట్టి ఆమె రోలింగ్ అనే ఒక టాస్క్ లో బాగానే పోరాడింది.

మరోసారి ఓటమి

మరోసారి ఓటమి

ఎంతగా పోరాడినప్పటికీ కూడా చివరికి నేహ చౌదరి చేతిలో ఓడిపోయింది. అయితే మొదట తనకు సంచాలకులుగా ఉన్న వాళ్ళు అడ్డుగా ఉన్నారు అని అలాగే మరి కొంతమంది తనకు ఏమాత్రం సపోర్ట్ చేయలేదు అని అనవసరమైన వితండవాదం చేసింది. అయినప్పటికీ నేహ చౌదరి కూల్ గానే మరోసారి ఆడదామని కూడా సపోర్ట్ చేసింది.

మొండి ప్రవర్తన

మొండి ప్రవర్తన

రెండవసారి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఇనయ సుల్తానా గెలవలేకపోయింది. ఇక ఈసారి అందరూ కూడా తనకు ఏమాత్రం సపోర్ట్ చేయడం లేదు అనేది చాలా క్లారిటీగా అర్థమయింది అని మరో అనవసరమైన కామెంట్ చేసింది. ఇక తర్వాత బాత్రూంలోకి వెళ్లి కాసేపు ఏడ్చింది. నేహా చౌదరి పర్వాలేదు అని నువ్వు చాలా బాగా పోరాడవు అని సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఆమె కాస్త మొండిగానే ప్రవర్తించింది.

రేవంత్ కౌంటర్

రేవంత్ కౌంటర్


ఇక ఇనయ సుల్తానా మళ్ళీ నామినేషన్స్ లో అందరూ తనను టార్గెట్ చేస్తారేమో అని అనుకొని తన తప్పును ఒప్పుకునే ప్రయత్నం చేసింది. నేను ఆ మాట అనవలసింది కాదు అని అందరూ సపోర్ట్ చేయడం లేదు అనే కామెంట్ ను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పింది. దీంతో రేవంత్ ఇక్కడ ఎవరు ఎవరికి సపోర్ట్ చేయరు అక్కడ ఉండే పరిస్థితుల్లో బట్టి ఎవరైనా సజెషన్స్ ఇవ్వవచ్చు కానీ బిగ్ బాస్ లో అలా ఎప్పుడూ కూడా అనుకోకూడదు అని ఆమె గాలి తీసే విధంగా కామెంట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X