For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: కలిసి పడుకోలేదా.. నోరు జారిన ఇనయా.. బాలాదిత్య క్షమాపణలు

  |

  బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ప్రస్తుతం గొడవలు, ఎమోషనల్ మూమెంట్స్, అగ్రెషన్ తో కూడిన టాస్క్ లతో సూపర్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ప్రస్తుతం హౌజ్ లో తొమ్మిదో వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తోంది. ఇందులో ఇంటి సభ్యులకు బిగ్ బాస్ మిషన్ పాసిబుల్ టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. రెడ్ అండ్ బ్లూ టీమ్స్ స్క్వాడ్ గా విడిపోయి గేమ్ ఆడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎదుటి వాళ్ల బలహీనతపై దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తూ గీతూ రాయల్ కనిపించింది. ఇక తాజాగా జరిగిన నవంబర్ 2 బుధవారం ప్రసారమైన 59వ రోజు 60వ ఎపిసోడ్ లో ఇనయా సుల్తానా నోరు జారింది. దీంతో పెద్ద వాగ్వాదమే జరిగింది.

  ఆ ముగ్గురు తప్పా..

  ఆ ముగ్గురు తప్పా..

  సాధారణంగా బిగ్ బాస్ షోలో నామినేషన్స్ టాస్కు ఎన్నో గొడవలతో సాగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ తొమ్మిదో వారం ప్రక్రియ కూడా చాలా వాగ్వాదాలు, దూషణలతో రసవత్తరంగా సాగింది. ప్రస్తుతం ఇంట్లో ఉన్న 13 మంది ఇంటి సభ్యుల్లో ముగ్గురు శ్రీహాన్, వాసంతి, రాజ శేఖర్ తప్పా మిగిలిన 10 మంది కంటెస్టెంట్స్ గీతూ రాయల్, ఇనయా సుల్తానా, శ్రీ సత్య, రేవంత్, బాలాదిత్య, కీర్తి భట్, ఆదిరెడ్డి, మెరీనా అబ్రహం, రోహిత్ సహ్ని, ఫైమా నామినేట్ అయ్యారు.

  బ్లూ అండ్ రెడ్ టీమ్ లుగా..

  బ్లూ అండ్ రెడ్ టీమ్ లుగా..

  ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో ఆదిరెడ్డి, బాలాదిత్య, రోహిత్, రాజ శేఖర్, వాసంతి, మెరీనా, ఇనయా సుల్తానా బ్లూ టీమ్ గా.. గీతూ రాయల్, శ్రీహాన్, రేవంత్, శ్రీ సత్య, కీర్తి భట్, ఫైమా రెడ్ టీమ్ గా మిషన్ పాసిబుల్ టాస్క్ ఆడుతున్నారు. ఇందులో భాగంగా బేటన్ టాస్క్ ఆడారు. ఈ టాస్క్ లో బేటన్ టాస్క్ తో అపోనెంట్ టీమ్ వాళ్లను టేబుల్ పై నుంచి బేటన్ తో కింద పడేయాలి. ఈ గేమ్ లో బ్లూ టీమ్ నుంచి మెరీనా, ఇనయా, వాసంతి ఉండగా.. రెడ్ టీమ్ నుంచి శ్రీహాన్, రేవంత్, ఫైమా ఉన్నారు. ఈ క్రమంలో గేమ్ కొంచెం అగ్రేషన్ కి వెళ్లిపోయింది.

  నువ్ ఎక్కడెక్కడపడుకుంటున్నావో..

  నువ్ ఎక్కడెక్కడపడుకుంటున్నావో..


  ఈ క్రమంలో సూర్య టాపిక్ తీసుకువచ్చి ఇనయాను మాటలతో రెచ్చగొట్టాడు శ్రీహాన్. దీంతో కంట్రోల్ తప్పిన ఇనయా.. నువ్ ఎక్కడెక్కడపడుకుంటున్నావో (శ్రీహాన్-శ్రీ సత్య కలిసి పడుకుంటున్నారనే అర్థంలో) తెలుసులే అని నోరు జారింది. అప్పుడు టాస్క్ నడుస్తోందని ఊరుకున్నాడు. టాస్క్ అయిపోయాక పిలిచి ఇందాక ఏంటీ అన్నావ్.. అది నోరా పెంటా.. అంటూ ఫైర్ అయ్యాడు. అతనితోపాటు శ్రీ సత్య కూడా వచ్చి ఇనయాపై సీరియస్ అయింది.

  సోఫా కింద పడుకోలేదా..

  సోఫా కింద పడుకోలేదా..

  ఎక్కడ పడుకున్నాను.. అని శ్రీహాన్ గట్టిగా అడగడంతో గతంలో చాలాసార్లు ఇక్కడికి వచ్చి సోఫా కింద పడుకోలేదా అని ఇనయా కవర్ డ్రైవ్ చేసుకునేందుకు ప్రయత్నించింది. దీంతో వాటే కవర్ డ్రైవ్.. ఆడియెన్స్ డ్రామా క్వీన్ ఇక్కడ ఉంది.. మా రిలేషన్ కి ఒక పేరు ఉంది.. ఒక క్లారిటీ ఉంది అంటూ చాలా గట్టిగా చెప్పాడు శ్రీహాన్. అయితే అప్పటివరకు గేమ్ సూపర్బ్ గా ఆడిన ఇనయా ఆ ఒక్క మాటతో చాలా నెగెటివిటీ మూటగట్టుకుంది.

  చెల్లి అనుకున్న గీతూ బాధపెట్టడంపై..

  చెల్లి అనుకున్న గీతూ బాధపెట్టడంపై..

  ఈ టాస్క్ తర్వాత బాలాదిత్య సిగరేట్ల కోసం చెల్లి అనుకున్న గీతూ తనను అలా బాధపెట్టడంపై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఫైమా, కీర్తితో బాధ చెప్పుకున్నాడు. తర్వాత కొద్దిసేపటికి సిగరెట్స్, లైటర్ ఇవ్వడంతో తన స్ట్రెస్ తగ్గించుకున్నాడు బాలాదిత్య. అనంతరం గీతూ దగ్గరికి వెళ్లిన బాలాదిత్య.. ఆవేశంలో సిగ్గు ఉందా అని నోరుజారాను. బాధలో నా చెల్లిగా ఓ మాట అన్నాను. ఒక ఆడపిల్లతో అలా మాట్లాడకూడదు. క్షమించు. దయచేసి క్షమించు అని చెతులెత్తి మొక్కాడు.

  చెంపమీద కొట్టి క్షమించు అంటే..

  చెంపమీద కొట్టి క్షమించు అంటే..


  బాలాదిత్య చేతులెత్తి మొక్కి దండం పెట్టిన గీతూ రాయల్ పట్టించుకోలేదు. ఇంట్లో వాళ్లైన సరే కొన్ని అంటే నేను పడను, తీసుకోలేను అనింది. ఇందుకు ఆదిరెడ్డి ఆయన దండం పెట్టి చెప్పాడు. ఇంకా ఏంటీ గీతూ అని అంటే.. చెంపమీద కొట్టి క్షమించు అంటే సరిపోతుందా.. నేను క్షమించను అని చెప్పింది. నేను నిజానికి చాలా బాధ పడుతుంటాను. కానీ ఎవరికీ చెప్పుకోను. నా ఫ్రెండ్స్ కి కూడా చెప్పుకోను అంటూ ఏడ్చేసింది గీతూ. తర్వాత ఉదయం మళ్లీ లైటర్ దాచిపెట్టింది గీతూ రాయల్.

  English summary
  Inaya Sultana Vs Shrihan Sri Satya and Baladitya Apologies To Geetu Royal In Bigg Boss Telugu 6 Season November 2 Day 59 Episode 60 Highlights.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X