twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: హౌస్ లోకి వచ్చే ముందు భారీగా ఖర్చు.. చలాకి చంటి షాకింగ్ కామెంట్స్

    |

    బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 6వ సీజన్ గ్రాండ్ గా మొదలైన విషయం తెలిసిందే. నాగార్జున హోస్టింగ్ తో మొదటిరోజు కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా ఉల్లాసంగా హౌస్ లోకి అడుగు పెట్టారు. ఎవరికి వారు కన్ఫిడెంట్ గా మేమే గెలుస్తాము అని ధీమాగా చెబుతున్నారు. అయితే కొందరు బిగ్ బాస్ లోపలికి వెళ్లే ముందు బయట సోషల్ మీడియాlo అలాగే ఓట్ల విషయంలో కొంత ప్లాన్ చేసుకొని వస్తారు అనే టాక్ ఉంది. ఇక హౌస్ లోకి వెళ్లే ముందు చలాకీ చంటి ఒక ఇంటర్వ్యూలో ఆ కామెంట్స్ పై వివరణ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

    విబేధాలు రావడంతో

    విబేధాలు రావడంతో

    మొదట సినిమా ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కమెడియన్ చంటి ఆ తరువాత జబర్దస్త్ లోకి వచ్చి చలాకి చంటి గా మారిపోయాడు. అందులో కొన్నాళ్ల పాటు మంచి గుర్తింపును అందుకుంటూ వచ్చిన చంటి అనంతరం కొన్ని విబేధాలు రావడంతో షో లో నుంచి బయటకు వచ్చేశారు. ఎక్కువగా రెమ్యునరేషన్ విషయంలో విబేధాలు వచ్చినట్లు టాక్ అయితే వస్తోంది.

     బిగ్ బాస్ లో..

    బిగ్ బాస్ లో..

    ఇక జబర్దస్త్ నుంచి ఇప్పుడు బిగ్ బాస్ లోకి వచ్చిన చలాకి చంటి ఎలాగైనా బిగ్ బాస్ ద్వారా మంచి ఆదాయాన్ని అందుకోవాలి అని అలాగే తన కెరీర్ ను మరో రేంజ్ కి తీసుకు వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాడు. బింబిసార డైలాగ్ తో సీజన్ 6 లోకి ఎంట్రీ ఇచ్చిన చంటి ఈసారి బిగ్ బాస్ టైటిల్ నాదే అని ధీమాగా చెప్పాడు. ఇక నాగార్జునను చూసి చంటి చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు.

     గెలిచి తీరాలి..

    గెలిచి తీరాలి..

    అయితే బిగ్ బాస్ లోకి వచ్చే ముందు చంటి ప్రత్యేకంగా ఒక యూ ట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ లో ఎలాగైనా గెలిచి తీరాలి అనే కసితోనే వెళ్లబోతున్నట్లు చెప్పాడు. అలాగే ఇప్పటివరకు తాను బిగ్ బాస్ లో ఒక్క సింగిల్ ఎపిసోడ్ కూడా చూసింది లేదు అని అయినా కూడా నా టాలెంట్ తో జనాల సపోర్ట్ తో అక్కడ నిలదొక్కుకుంటాను అని అన్నాడు.

     అప్పుడు బాధగా అనిపించింది

    అప్పుడు బాధగా అనిపించింది

    ఇక బిగ్ బాస్ కు వెళ్ళడానికి ఎన్ని కారణాలు ఉన్నా కూడా డబ్బు సంపాదించే మంచి అవకాశం వచ్చినప్పుడు ఏమాత్రం వదుకోవద్దనేది తన పాలసీ అని జబర్దస్త్ లో ఉన్నప్పుడు రెమ్యునరేషన్ కొంత పెంచాలి అన్నప్పుడు వారు ఇచ్చిన సమాధానం చాలా బాధగా అనిపించిందని అన్నాడు. మీ రేంజ్ కు మీ టాలెంట్ కు ఇంతే ఇస్తారు అనగానే ఒక్కసారిగా బాధగా అనిపించింది అని చంటి ఎమోషనల్ అయ్యాడు.

     చంటి సెటైర్

    చంటి సెటైర్

    ఇక ఎలాగైనా బిగ్ బాస్ లో నన్ను నేను నిరూపించుకొని జనాలను నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తాను అని ధీమాగా ఉన్నాను. ఇక జబర్దస్త్ లోకి వెళ్లే ముందు చాలా వరకు ప్లాన్ చేసుకుంటారని మీరు ఏం ప్లాన్ చేసుకున్నారు అనే ప్రశ్నకు చంటి ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. మొత్తం ప్లాన్ సెట్ అయ్యిందని అంటూ.. మినిమమ్ 400కోట్లు ఖర్చు పెట్టాను. తెలుగు తెలిసిన ప్రతీ ఒక్కరు కూడా నాకే ఓటు వేయాలని.. ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు. ఇక అందులో నిజం లేదని సెటైర్ వేసిన చంటి కేవలం తన సోలోగా ఫైట్ చేయబోతున్నట్లు చెప్పాడు. మరి బిగ్ బాస్ లో చలాకి చంటి ఎన్ని రోజుల వరకు నిలదొక్కుకుంటాడో చూడాలి.

    English summary
    Bigg boss telugu 6 Jabardasth comedian chalaki chanti shocking comments
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X