Bigg Boss Telugu 6: ఫైమా ఆటపై ఆమె లవర్ షాకింగ్ కామెంట్స్.. అరియానా కౌంటర్

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ జోరుగా, రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికీ తొమ్మిది వారాలకు గాను తొమ్మిది మంది ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వెళ్లారు. పదోవారం కూడా నామినేషన్ల ప్రక్రియ జోరుగానే సాగింది. తొమ్మిది మంది నామినేషన్లలో ఉన్నారు. తాజాగా పదోవారం కెప్టెన్ గా జబర్దస్త్ ఫైమా గెలిచింది. రోహిత్, ఆదిరెడ్డి, శ్రీసత్యతో పోటీ పడిన ఫైమా చివరిగా కెప్టెన్ గా సింహాసనాన్ని అధిష్టించింది. ఇక బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్లపై మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్, విన్నర్స్, సినీ సెలబ్రిటీస్, రివ్యూవర్ల అభిప్రాయాలను బీబీ కేఫ్ ద్వారా బయటపెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఫైమాను సపోర్ట్ చేస్తూ జబర్దస్త్ కమెడియన్, ఆమె లవర్ ప్రవీణ్ బీబీ కేఫ్ కు హాజరయ్యాడు.

 ఇంటి కెప్టెన్ గా ఫైమా..

ఇంటి కెప్టెన్ గా ఫైమా..

అత్యధిక ప్రజాదరణ పొందిన షోగా బిగ్ బాస్ నిలిచింది. తాజాగా ప్రసారమవుతోన్న బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లోకి 21 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో తొమ్మిది వారాలకు గాను షానీ సాల్మన్, అభినయ శ్రీ, నేహా చౌదరి, ఆరోహి రావు, చలాకీ చంటి, సుదీప పింకీ, అర్జున్ కల్యాణ్, ఆర్జే సూర్య, గీతూ రాయల్ మొత్తం తొమ్మిది మంది ఎలిమినేట్ అయి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఇక తాజాగా బిగ్ బాస్ తెలుగు 6 పదోవారం ఇంటి కెప్టెన్ గా జబర్దస్త్ ఫైమా గెలిచిం

 ఫైమా బాయ్ ఫ్రెండ్ ప్రవీణ్ హాజరు..

ఫైమా బాయ్ ఫ్రెండ్ ప్రవీణ్ హాజరు..

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్లు ఆట తీరుపై బీబీ కేఫ్ ద్వారా అభిప్రాయాలను తెలియజేస్తున్నారు మాజీ కంటెస్టెంట్లు, విన్నర్లు, సెలబ్రిటీలు, రివ్యూవర్లు. ఈ కేఫ్ కు అరియానా గ్లోరితో పాటు అప్పుడప్పుడు ఆర్జే కాజల్ కూడా హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ కేఫ్ కు జబర్దస్త్ కమెడియన్, ఫైమా బాయ్ ఫ్రెండ్ ప్రవీణ్ తన అభిప్రాయాలను పంచుకునేందుకు బీబీ కేఫ్ కు హాజరయ్యాడు.

ప్రేమగా ఎలా మారింది..

ప్రేమగా ఎలా మారింది..

బిగ్ బాస్ కేఫ్ కు హాజరైన ప్రవీణ్ తో సరదాగా ముచ్చటించింది బ్యూటిఫుల్ యాంకర్ అరియానా గ్లోరి. ఫైమా లోపల ఉందని చెప్పెసి బాగా రిలాక్స్ అవుతున్నావా అని అరియానా అంటే.. తన బిజీలో తనుంది కాబట్టి నా బిజీలో నేనున్నా అని ప్రవీణ్ తెలిపాడు. మీకు ఫైమాకు ఎలా పరిచయం అయింది.. అది ఎలా ప్రేమగా మారింది.. ఎవరు ఎవరికి ముందు ప్రపోజ్ చేశారని అరియానా గ్లోరి క్వశ్చన్ చేసింది.

మూడు సార్లు ప్రపోజ్ చేశాను..

మూడు సార్లు ప్రపోజ్ చేశాను..

అరియానా ప్రశ్నకు నేనే ముందు ప్రపోజ్ చేశాను. మూడు సార్లు ప్రపోజ్ చేశాను అని ప్రవీణ్ ఆన్సర్ ఇస్తే ఎన్నిసార్లు ఛీ కొట్టినా ఆహా.. అని అరియానా గ్లోరి అంది. ప్రేమ అలాంటిది అండి అని ప్రవీణ్ రిప్లై ఇవ్వడంతో మా బంగారమే అన్నట్లు చేతులతో రియాక్షన్ ఇచ్చింది యాంకర్ అరియానా గ్లోరి. ఫైమా ఎక్కడైనా తొండి గేమ్ ఆడినట్లు అనిపించిందా అన్న ప్రశ్నకు.. చాలామంది తొండి గేమ్ ఆడుతున్నారని ప్రవీణ్ అన్నాడు.

ఫైమాతో గొడవ అయినందుకా..

ఫైమాతో గొడవ అయినందుకా..

ఎవరెవరూ హౌజ్ లో తొండి గేమ్ ఆడుతున్నారన్న అరియానా ప్రశ్నకు.. ఇనయా గేమ్ అయితే నాకు నచ్చలేదని ప్రవీణ్ సమాధానం చెప్పాడు. దీనికి ఎందుకు ఫైమాతో గొడవ అయినందుకా అని అరియానా మళ్లీ అడిగింది. తనను ఏమనలేక.. తర్వాత గేమ్ లో చూపించిందని నాకు అనిపించిందని ప్రవీణ్ ఆన్సర్ చేశాడు. ఫైమా స్ట్రాటజీ గురించి అడగ్గా.. ఏదైనా వీక్ అయ్యే పాయింట్ దొరికితే.. నిన్ను వీక్ చేసి మేము ఆడొచ్చు కదా అని ఆన్సర్ చేశాడు ప్రవీణ్.

తన మాట తీరే అంతా..

తర్వాత ఫైమా వెటకారం ఆటకు ముప్పు అయ్యేలా ఉందా అన్న ప్రశ్నకు.. అది వెటకారం అని మనకు అనిపిస్తుంది.. లోపల గేమ్ ఏమో అని ప్రవీణ్ అంటే.. బిహేవియర్ పైనా గేమ్ ఉంటే ఆడియెన్స్ చాలా తప్పుగా తీసుకుంటారు కదా అని అరియానా అంది. అలా అంటే రేవంత్ అన్న చేసేది కూడా అదేగా అని ప్రవీణ్ అన్నాడు. ఆయన బిహేవియరే అంతా అని మీరే అన్నారు.. ఇప్పుడు ఇది గేమ్ అని మీరే అంటున్నారు కౌంటర్ ఇచ్చింది అరియానా. ఫైమా ఓవర్ కాన్ఫిడెన్స్, వెటకారం గురించి అడగ్గా తన మాట తీరే అంతా అని ఆన్సర్ ఇచ్చాడు ప్రవీణ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X