Bigg Boss Telugu 6: కీర్తికి ప్రమాదం.. భయంతో వణికిపోయిన హౌస్ మెంట్స్.. ఏం జరిగిందంటే?
బిగ్ బాస్ 6వ సీజన్ మొదటివారం హౌస్ మెన్స్ మధ్యలో పెద్దగా గొడవలు ఏమి జరగలేదు. కానీ రెండవ వారం మాత్రం అందుకు భిన్నంగా గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ కావడం కోసమైతే ఏ మాత్రం తగ్గకుండా హౌస్ మెంట్స్ అందరూ కూడా చాలా బలంగా పోరాడుతున్నారు. అయితే ఈ టాస్కుల సమయంలో బిగ్ బాస్ కొన్ని ఛాలెంజ్ లు ఇచ్చినప్పుడు కంటెస్టెంట్స్ శక్తికి మించి పోరాడుతూ ఉండడంతో కొందరు గాయాలపాలవుతున్నారు. ఇక రీసెంట్ గా కీర్తి కూడా ప్రమాదానికి గురైంది. ఒక క్షణం ఆమె అందర్నీ భయపెట్టేసింది అనే చెప్పాలి. పూర్తి వివరాల్లోకి వెళితే..

మొదటి కెప్టెన్ కంటెండర్
మొదటివారం బాలాదిత్యా కెప్టెన్ గా చాలా ఈజీ గానే సెలెక్ట్ అయ్యాడు అని చెప్పవచ్చు. కానీ బిగ్ బాస్ రెండవ వారం మాత్రం కంటెస్టెంట్స్ అందరికీ కూడా చాలా బలమైన టాస్కులను అయితే ఇస్తున్నాడు. ఇక మొత్తంగా కెప్టెన్ పోటీదారులుగా నిలవడానికి అందరూ కూడా వారి శక్తికి మించి పోరాడుతున్నారు. ఇప్పటికే చలాకి చంటి టాస్క్ లో గెలిచి మొదటి కెప్టెన్ కంటెండర్ గా నిలిచాడు.

తదుపరి రౌండ్ లో
ఇక రెండో కంటెండర్ గా గెలిచేందుకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చాలా బలంగా పోరాడుతున్నారు. మంగళవారం రాత్రి మరోసారి ట్రామ్ లో బేబీ బొమ్మను పెట్టాలి అని ఆదేశాలు జారీ చేయగా అప్పుడు అర్జున్ కళ్యాణ్ ఫైమా కీర్తి బట్ ఇనయా సుల్తానా ఆరోహి వేగంగా వెళ్లి అందులో వారి బేబీ లను పెట్టారు. దీంతో వాళ్ళు తదుపరి రౌండ్ కు సెలెక్ట్ అయ్యారు.

చివరికి ఇద్దరు
అయితే రెండో కంటెండర్ గా నిలిచేందుకు ఈసారి బిగ్ బాస్ ఫిజికల్ టాస్క్ గెలవాలని చాలెంజ్ ఇచ్చారు. ఇక ముందుగానే అర్జున్ కళ్యాణ్ విజయం సాధిస్తాడు అని అనుకున్నప్పటికీ అతను ముందే తప్పుకున్నాడు. ఆరోహి ఫైమా డిస్ క్వాలిఫై కావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇనయా సుల్తానా కీర్తి మాత్రమే పోటా పోటీగా గెలిచేందుకు సిద్ధమయ్యారు.

హౌస్ లో ప్రమాదం
మొదటి వారమే వెళ్ళిపోతుంది అనుకున్నా ఇనయా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఛాన్స్ కూడా వదిలిపెట్టకూడదు అని కీర్తి భట్ తో గట్టిగానే పోరాడింది. ఒకరినొకరు తోసుకునే క్రమంలో అయితే పోరాటం మరింత సీరియస్ గా మారుతున్న సమయంలోనే కీర్తికి ఒక్కసారిగా పొట్ట మజిల్ పట్టేసుకోవడంతో నొప్పితో చాలా ఇబ్బంది పడింది. అక్కడే కింద కూర్చుని శ్వాస తీసుకునేందుకు కూడా ఇబ్బంది పడింది. ఇక ఏమైందో ఏమో అని అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

అందరిలో కంగారు
కీర్తి ఉన్నట్టుండి అలా హఠాత్తుగా కింద పడిపోవడంతో హౌస్ మెంట్స్ అందరూ కూడా కొంతసేపటి వరకు కంగారుపడ్డారు. ఇక మెల్లగా ఆమె ఊపిరి పీల్చుకొని కాస్త విశ్రాంతి తీసుకోగానే సెట్ అయింది. ఇక ఇనయా సుల్తానా ఆ రౌండ్ లో గెలిచినట్టు ప్రకటించారు. ఆమె రెండో కాంటెండర్ ఎంపిక అయింది. ఇక మరో ముగ్గురు కెప్టెన్ కంటెండర్స్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. అందులో ఆర్ జె సూర్య, గీతు రాయల్, రాజశేఖర్ ఉన్నారట. మరి వీరిలో హౌస్ లో రెండవ కెప్టెన్ గా ఎవరు సెలెక్ట్ అవుతారో చూడాలి.


Click it and Unblock the Notifications











