Jabardasth: బిగ్ బాస్ కోసం జబర్దస్త్ కమెడియన్ ప్లాన్ .. చివరి నిమిషంలో రిజెక్ట్!

బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొనడం కోసం ఈసారి చాలామంది పోటీ పడ్డారు. ముఖ్యంగా అవకాశాలు లేకుండా ఖాళీగా ఉన్న సినీ ఆర్టిస్టులు టెలివిజన్ నటులు కూడా హౌస్ లోకి వెళ్ళాలని బ్యాక్ గ్రౌండ్ లో బాగానే ప్రయత్నం చేశారు. కానీ బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం అన్ని రకాలుగా ఎంటర్టైన్మెంట్ హైలెట్ అవ్వాలని ఏరికోరి కంటెస్టెంట్స్ ను సెలెక్ట్ చేశారు. అయితే బిగ్ బాస్ ఫైనల్ లిస్ట్ రెడీ అయ్యే రెండు రోజుల ముందు వరకు కూడా ఒక జబర్దస్త్ కమెడియన్ బిగ్ బాద్ లోకి వెళ్లాలని బాగానే ప్రయత్నాలు చేశాడట. ఇక మొదట అవకాశం ఇద్దామని అనుకున్న కంటెస్టెంట్స్ మళ్ళీ చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఫైనల్ లిస్ట్ అప్పుడే రెడీ

ఫైనల్ లిస్ట్ అప్పుడే రెడీ


బిగ్ బాస్ 6వ సీజన్ లోకి ఈసారి మొత్తం 19 మంది రాబోతున్నారు. ముందుగా ఒక 15 లేదా 16 మందిని హౌస్ లోకి రప్పించి ఆ తరువాత వైల్డ్ కార్డ్ ద్వారా మరికొందరిని రప్పించాలని అనుకుంటున్నారు. ఇక దాదాపు ఫైనల్ లిస్ట్ నాలుగు వారాల క్రితమే ఫిక్స్ అయ్యింది. అయితే ఒక వారంలోనే కొంతమంది ఆర్టిస్టులు మళ్ళీ అనుకోని కారణాల వలన వెనుకడుగు వేసినట్లు టాక్ అయితే వచ్చింది.

బిగ్ బాస్ జాగ్రత్తలు

బిగ్ బాస్ జాగ్రత్తలు

కొందరు బిగ్ బాస్ ఇచ్చిన రెమ్యునరేషన్ ఆఫర్ నచ్చక రిజెక్ట్ చేస్తే.. మరికొందరిని బిగ్ బాస్ అనుకోని కారణాల వలన రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ ఎంట్రీ కోసం ఇంటర్వ్యూ తీసుకున్న అనంతరం ఆర్టిస్టులకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ కూడా మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. వారి కుటుంబ పరిస్థితులు అలాగే షో మధ్యలో నుంచి వెళ్లిపోయే ఛాన్స్ ఉంటే మళ్ళీ ఇబ్బందిగా మారుతుందని ముందే నిర్వాహకులు వేరిఫై చేసుకుంటారు.

అలాంటి వారికి ఛాన్స్

అలాంటి వారికి ఛాన్స్


ఇక ఈసారి అనుకున్నంత రేంజ్ లో అయితే పెద్దగా పేరున్న కంటెస్టెంట్స్ ఎవరు రావడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా క్రేజ్ అందుకున్న వారికి అవకాశం ఇస్తున్నారు. అలాగే జబర్దస్త్ లో ఒకరిద్దరికి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. చాలకి చంటి, శ్రీహన్, బాలాదిత్య, ఆది రెడ్డి లాంటి వాళ్ళు షోలో కాస్త హైలెట్ కాబోతున్నారు.

జబర్దస్త్ కమెడియన్ ప్రయత్నం

జబర్దస్త్ కమెడియన్ ప్రయత్నం

అయితే బిగ్ బాస్ లో మరో జబర్దస్త్ కమెడియన్ అవకాశం కోసం చాలానే శ్రమించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అతను హైలెట్ అవ్వాలని విమర్శలు కూడా చేయడానికి కారణం ఉన్నట్లు టాక్ వస్తోంది. అతను మరెవరో కాదు. కిర్రాక్ ఆర్పీ అని సోషల్ మీడియాలో టాక్ వస్తోంది. కిర్రాక్ ఆర్పీ ఇటీవల కాలంలో జబర్దస్త్ పై ఊహించని విధంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

చివరలో రిజెక్ట్..

చివరలో రిజెక్ట్..


ఒక విధంగా కిర్రాక్ ఆర్పీ గత ఏడాది నుంచి బగ్ బాస్ లోకి అడుగు పెట్టాలని ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్లు టాక్. ఇక ఈసారి 6వ సీజన్ కోసం కూడా అతను స్టార్ మా యాజమాన్యంను సంప్రదించగా వారు మొదట పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యారట. ఇక ఫైనల్ గా కొన్ని వారాలకు ముందు వరకు ఫైనల్ లిస్ట్ రెడీ అయ్యే క్రమంలో అతనికి ఛాన్స్ వస్తుందేమో అని అనుకున్నాడు. కానీ అప్పటికే రికమండేషన్ లిస్ట్ ఫుల్ గా అనిపించడంతో కిర్రాక్ ఆర్పీకి ఛాన్స్ రాలేదని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X