For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: బిగ్ బాస్ ప్లాన్ లీక్.. వాళ్ళు రావడం వెనుక పాలిటిక్స్..?

  |

  బిగ్గెస్ట్ కాంట్రవర్సీ షో బిగ్ బాస్ తెలుగులో సక్సెస్ అవుతుందా లేదా అని అనుమానాల మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ తో చాలా గ్రాండ్ గానే మొదలుపెట్టారు. ఇక తర్వాత సెకండ్ సీజన్ లో నాని తరువాత మూడవ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే 5వ సీజన్ వరకు రేటింగ్స్ బాగానే వచ్చాయి. కానీ 6వ సీజన్ లో మాత్రం ఫస్ట్ ఎపిసోడ్ కె చాలా తక్కువ రేటింగ్స్ వచ్చాయి. ఇక ఈసారి రాజకీయాలు బాగానే వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది. ఒక విషయం కూడా లీక్ అయినట్లు సోషల్ మీడియాలో ఒక టాక్ వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

  ఆ రూట్లోనే రేటింగ్స్

  ఆ రూట్లోనే రేటింగ్స్

  నాగార్జున హోస్ట్ గా ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ నిర్వాహకులు మరొకరిని తీసుకురావాలని అనుకోలేదు. బిగ్ బాస్ షో అనేది నిత్యం గొడవలతో అనవసరమైన రొమాంటిక్ సన్నివేశాలతో ఓ వర్గం వరకే చిరాకు తెప్పించినప్పటికీ ఎక్కువ శాతం మాత్రం ఆ రూట్లోనే రేటింగ్స్ అయితే బాగానే వస్తున్నాయి. ఇక విమర్శలు ఎన్ని వచ్చినా కూడా పెద్దగా చర్యలు తీసుకునేంత ఇబ్బందులు ఏమీ రాలేదు.

  అత్యంత దారుణంగా

  అత్యంత దారుణంగా

  అయితే బిగ్ బాస్ తెలుగులో గత ఐదు సీజన్స్ వరకు కూడా మంచి రేటింగ్స్ అందుకుంది. కానీ 6వ సీజన్ కు వచ్చేసరికి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ప్రారంభ ఎపిసోడ్ కు అత్యంత దారుణంగా చాలా తక్కువ రేటింగ్ రావడం నిర్వాహకులు జీర్ణించుకోలేకపోయారు. శనివారం రోజు నాగార్జున కోపంతోనే రేటింగ్ ప్రభావం కనిపించింది. హౌస్ లో రెండు వారాలపాటు కంటెస్టెంట్స్ కూడా పెద్దగా ఆకట్టుకున్నది లేదు.

  అలా అనుకున్నారు..

  అలా అనుకున్నారు..

  అసలు ఈసారి బిగ్ బాస్ చేసిన అతి పెద్ద మిస్టేక్.. కంటెస్టెంట్స్ ను సెలెక్ట్ చేసే విషయంలో సరిగా ఆలోచించకపోవడమే. ఒక విధంగా గత రెండు మూడు సీజన్స్ లో కూడా జనాలకు పెద్దగా తెలియని కంటెస్టెంట్స్ ను తీసుకువచ్చి బాగానే రుద్దేశారు. ఒకరిద్దరి ముగ్గురితో ప్లాన్ చేసే టాస్క్ లతో నడిపించవచ్చు అని కూడా అనుకున్నారు. అయితే అప్పుడు ప్లాన్ వర్కౌట్ అయినప్పటికీ ఈసారి మాత్రం ఎదురుదెబ్బ కొట్టింది.

  ఎందుకు చూడాలి?

  ఎందుకు చూడాలి?

  బిగ్ బాస్ 6వ సీజన్ ను అసలు ఎందుకు చూడాలి అనే ప్రశ్న చాలా మందిలో కదులుతోంది. తక్కువ స్థాయిలో పారితోషికాలు ఇచ్చి కంటెస్టెంట్స్ ను తీసుకువచ్చినట్లు చాలా ఈజీగా అర్థమవుతుందని కామెంట్స్ వస్తున్నాయి. ఏ ఒక్కరికి కూడా ఇందులో ఒక్క రోజుకు కనీసం 25 వేలు కూడా ఇవ్వడం లేదట. గతంలో అయితే రోజుకు 60 నుంచి 1 లక్ష రూపాయలకు పైగా అందుకున్న వారు వచ్చారు.

  పాలిటిక్స్?

  పాలిటిక్స్?

  అయితే 6 సీజన్లో బిగ్ బాస్ ఎక్కువగా ఆశావహులను తీసుకువచ్చారని టాక్. ఇక పాలిటిక్స్ తో రికమండేషన్స్ ద్వారా మరికొందరు వచ్చినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో నిలదొ క్కుకోవాలి అని వారికంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకని ఏదో ఒక విధంగా ఫేమస్ అవ్వాలి అనే వారికి ఎక్కువ అవకాశాలు ఇచ్చారట. అంతేకాకుండా కొందరికి అయితే అసలు పారితోషకాలు కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఈ విధంగా బిగ్ బాస్ ఈసారి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందుకోవాలి అని వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది అనే టాక్ వినిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో బిగ్ బాస్ సరైన టాస్క్ లతో ట్రాక్ లోకి వస్తుందో లేదో చూడాలి.

  English summary
  Bigg boss telugu 6 latest gossip politics on contestants selection
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X