Bigg Boss Telugu 6: మొదలయ్యేది ఆ తేదీ నుంచే.. గంగవ్వ తరువాత మై విలేజ్ షో నుంచి మరొకరు?

బిగ్ బాస్ ద్వారా క్రేజ్ అందుకొని ఆ తరువాత సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. ఇక బిగ్ బాస్ 6వ సీజన్ లో కంటెస్టెంట్ గా రావడానికి కొంతమంది చిన్న తరహా సెలబ్రెటీలు బాగానే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఇక సీజన్ 6 ఎప్పుడు స్టార్ట్ కానుంది అనే విషయంలో ఒక టాక్ వైరల్ గా మారింది. అలాగే కొంతమంది కంటెస్టెంట్స్ పేర్లు కూడా వైరల్ అవుతున్నాయి. మై విలేజ్ షో నుంచి కూడా ఒకరు వచ్చే ఛాన్స్ ఉందట. పూర్తి వివరాల్లోకి వెళితే..

విజయవంతంగా..

విజయవంతంగా..

బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ ను జూనియర్ ఎన్టీఆర్ గ్రాండ్ గా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అసలు తెలుగులో వర్కౌట్ కాదని కామెంట్స్ చేసిన వారు సైతం ఈ రియాలిటీ షో అందుకుంటున్న టీఆర్పీని చూసి షాక్ అయ్యారు. ఎన్టీఆర్ అనంతరం నాని.. ఆ తరువాత నాగార్జున విజయవంతంగా షోను ముందుకు తీసుకు వెళుతున్నారు.

బిగ్ బాస్ 6వ సీజన్

బిగ్ బాస్ 6వ సీజన్

అయితే బిగ్ బాస్ సీజన్ 5 తరువాత సరికొత్తగా బిగ్ బాస్ నాన్ స్టాప్ ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఓటీటీ లో కూడా బిగ్ బాస్ కు మంచి స్పందన లభించింది. ప్రస్తుతం అందరి ఫోకస్ 6వ సీజన్ పైనే ఉంది. ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అనే విషయంలో ఇదివరకే నాగార్జున ఒక క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. తప్పకుండా తన హోస్టింగ్ తోనే 6వ సీజన్ కూడా స్టార్ట్ అవుతుందని అన్నారు.

సెప్టెంబర్ లో స్టార్ట్

సెప్టెంబర్ లో స్టార్ట్

ఇక 6వ సీజన్ ఆగస్టులో స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు గతంలో అనేలా రకాల రూమర్స్ వినిపించాయి. ఇక ఆ తరువాత సెప్టెంబర్ కు షిఫ్ట్ చేసినట్లు మరో క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం నిర్వాహకులు ఆరవ సీజన్ కు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. గత 5 సీజన్స్ కంటే కూడా ఈసారి మరింత ఎక్కువ స్థాయిలో ఎంటర్టైన్మెంట్ అందించాలని అనుకుంటున్నారట.

డేట్ ఫిక్స్

డేట్ ఫిక్స్

ఇక బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ సెప్టెంబర్ మొదటి వారంలోనే టెలికాస్ట్ చేయడం స్టార్ట్ చేయాలని కూడా ఒక ప్లాన్ రెడీ అయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 4వ తేదీన మొదటి ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందట. మొదటి ఎపిసోడ్ ను చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

కొన్ని పేర్లు వైరల్

కొన్ని పేర్లు వైరల్

ఇక హౌస్ లోకి రాబోయే కంటెస్టెంట్స్ ఎవరెవరు అనే విషయంలో ఇదివరకే కొన్ని పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎక్కువగా బుల్లితెర నటీనటులను బిగ్ బాస్ లోకి తీసుకు రావాలని అనుకుంటున్నారట. అందులో అమర్ డీప్, ఆది, చైత్ర రాయ్, దీప్తి పిళ్ళై, నవ్య స్వామి, వర్శిని, యాంకర్ ధనుష్ అంటూ ఇలా చాలామంది పేర్లు వినిపించాయి.

మై విలేజ్ షో నుంచి అతను?

మై విలేజ్ షో నుంచి అతను?

అయితే 4వ సీజన్ లో మై విలేజ్ షో యూ ట్యూబ్ స్టార్ గంగవ్వ ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈసారి అదే యూ ట్యూబ్ షో నుంచి మరో వ్యక్తి రానున్నట్లు తెలుస్తోంది. అతను అనీల్ జీలా అని సమాచారం. అనిల్ కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కూడా మంచి పాత్రలో నటించారు. ప్రస్తుతం వెబ్ సీరీస్ లు కూడా చేస్తున్నాడు. ఇక బిగ్ బాస్ లో అతనికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు ఒక టాక్ అయితే వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X