Bigg Boss Telugu 6: ఈసారి కొత్త రూల్ తో మరింత పెరగనున్న ప్రైజ్ మనీ.. కంటెస్టెంట్స్ కు జాక్ పాట్!
టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ షో కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక త్వరలోనే ఆరో సీజన్ కూడా మొదలు పెట్టాలి అని నిర్వాహకులు ప్రస్తుతం పూర్తిస్థాయిలో ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇదివరకే కొంతమంది కంటెస్టెంట్స్ కూడా ఫైనల్ అయినట్లు సమాచారం. మరికొంత మందితో అగ్రిమెంట్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి ప్రైజ్ మనీ విషయం లో కూడా ఒక ఆఫర్ తీసుకురాబోతున్నట్లు సమాచారం. గతంలో కంటే ఎక్కువ స్థాయిలో ప్రైజ్ మనీ ఉంటుందని సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే...

నాన్ స్టాప్ షో..
బిగ్ బాస్ గత ఐదు సీజన్ లో తెలుగులో మంచి రేటింగ్స్ అందుకున్న విషయం తెలిసిందే. కానీ మధ్యలో వచ్చిన 24 గంటల బిగ్ బాస్ నాన్ స్టాప్ షో మాత్రం షో మాత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. అయితే బిగ్ బాస్ తెలుగులో మొదటిసారి ఒక లేడీ కంటెస్టెంట్ బిగ్ బాస్ విన్నర్ గా నిలవడం విశేషం. బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో బిందు మాధవి టైటిల్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

ఈసారి మొత్తం ఎంతమంది?
ఇక బిగ్ బాస్ టెలివిజన్ ఆరో సీజన్ మొదలు పెట్టాలి అని నిర్వాహకులు గత కొన్ని రోజులుగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక సెప్టెంబర్ లోనే బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ గా మొదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 16 మంది సెలబ్రిటీల పేర్లను కూడా ఫైనల్ చేసినట్లు సమాచారం. అలాగే మరో కామన్ మ్యాన్ కేటగిరిలో కొత్తవారిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సారి 22 మంది వరకు బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్ లో అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం.

వాళ్ళు కూడా..
ఇప్పటికే కొంతమంది సినీ సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ యాంకర్ తో పాటు కొంతమంది యూట్యూబ్ స్టార్స్ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులు సినిమాలలో వర్క్ చేస్తున్నా టెక్నీషియన్స్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి రావాలని డిసైడ్ అయినట్లు సమాచారం.

మంచి ఆదాయం
ఈసారి కొంతమంది ఊహించని స్థాయిలో పారితోషికం కూడా అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా బగ్ బాస్ ద్వారా టైటిల్ విన్నర్ గా నిలిచిన వారు దాదాపు 25 లక్షల నుంచి ప్రైజ్ గెలుచుకున్నారు. పారితోషికం తో కలిసి ఫైనల్ ఎపిసోడ్ వరకు మరికొందరు 60 నుంచి 70 లక్షల మందిలో కూడా ఆదాయం అందుకున్నట్లు తెలుస్తోంది.

ఎంతవరకు నిజం
ఆరో సీజన్లో ఈసారి అంతకుమించి అనేలా కొంతమంది స్టార్ సెలబ్రిటీ లు ప్రైజ్ మనీ అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి మూడు వారాలు ఒకసారి ప్రత్యేకంగా బిగ్ బాస్ అలాగే హోస్ట్ నాగార్జున నిర్వహించే ఒక ప్రత్యేకమైన టాస్క్ లో లక్షల్లో గెలుచుకునే అవకాశం ఉందట. ఇక ఆ మొత్తం ఎంత వచ్చింది అనే విషయాన్ని ఫైనల్ ఎపిసోడ్లో హైలెట్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఒక అవకాశం ఇవ్వబోతున్న బిగ్ బాస్ ఎవరైతే ఆ లక్కీ జాప్ పాట్ గెలుస్తారో వాళ్ళకి లక్షల్లో ఆదాయం పొందే అవకాశం అయితే ఉందట. మరి ఆ టాస్క్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే బిగ్ బాస్ మొదలు అయ్యే వరకు ఆగాల్సిందే


Click it and Unblock the Notifications











