Bigg Boss Telugu 6: నీ కంటే నేను బాడీలో అన్నిట్లో పెద్దగా అనిపిస్తే.. అలా ఎలా అంటావ్.. ఇనయా లొల్లి!

బిగ్ బాస్ సీజన్ 6 నాలుగో వారం నామినేషన్స్ కూడా మొదలైపోయింది. మూడవ వారం ఊహించని విధంగా నేహా చౌదరి బయటకు వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈసారి కూడా బిగ్ బాస్ మరోసారి పదిమందిని నామినేట్ అయ్యే విధంగా గేమ్ ప్లాన్ చేశాడు. ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో వివరాల్లోకి వెళితే ఇనయా సుల్తానా శ్రీహన్ తో గొడవకు దిగింది. నామినేషన్స్ లో వీరి మధ్య జరిగిన వివాదం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

ఇనయా vs శ్రీహన్

ఇనయా vs శ్రీహన్

ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇద్దరు ఇంటి సభ్యులపై టమాటోలను స్మాష్ చేయాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ చెప్పాడు. నేను వాడు అంటే తీసుకోలేకపోయావు నన్ను పిట్టా ఎలా అంటాడు అని ఇనయా మాట్లాడిన విధానంపై శ్రీహాన్ అసహనం వ్యక్తం చేశాడు. అందుకే ఆమెను నామినేట్ చేస్తున్నట్లుగా తెలిపాడు. అయితే ఇనయా మాట్లాడుతున్న విధానంపై కూడా శ్రీహాన్ ఎలక పేరుతో కూడా మరో ఉదాహరణ చెప్పాడు.

నాకు నచ్చినట్లుగా..

నాకు నచ్చినట్లుగా..

ఇక రేవంత్ ను నామినిట్ చేసిన సుదీప ఇక్కడ ఎవరే గేమ్ వాళ్లు ఇండివ్యూజువల్ గా ఆడుతున్నారు అని చెప్పింది. కానీ రేవంత్ మాత్రం మొదట గ్రూప్ గా ఆడి ఆ తర్వాత ఇంటికి ఆటను మొదలు పెట్టినట్లుగా చెప్పాడు. అలాగే సుదీప ఇనయా సుల్తానాలను కూడా నామినేట్ చేస్తూ ఆమె మాటలపై విరుచుకుపడింది. ఇక్కడ నాకు నచ్చినట్లుగా ఉండడానికి వచ్చాను అంటూ ఇనయా సమాధానం ఇచ్చింది. కానీ అబద్ధం పదిసార్లు చెప్తే నిజమైపోదు అంటూ సుదీప ఇచ్చింది. ఇక ఇద్దరి మధ్యలో మాట మాట పెరగడంతో చివరికి సుదీప నేను కూడా వాయిస్ రేజ్ చేయగలను అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది.

ఫాల్ గేమ్

ఫాల్ గేమ్

ఇక ఫైర్ బ్రాండ్ కొనసాగుతున్న గీతూ రాయల్ తక్కువ గేమ్ ఆడిన చంటిని ఫాల్ గేమ్ ఆడిన ఇనయా సుల్తానాను నామినేట్ చేస్తున్నట్లుగా చెప్పింది. ఇక ఆరోహి వచ్చి నీ కోపంలో నువ్వు కొన్ని కోల్పోతావ్ అంటూ సుల్తానా పొరపాటులు చెబుతూ నామినేట్ చేసింది. అలాగే మీరందరూ కూడా అన్ఫేర్ గేమ్ ఆడుతున్నారు అంటూ ఇనయా తెలియజేసింది.

అలా ఎలా అంటావు?

అలా ఎలా అంటావు?

ఇక చివరలో ఇనయా నామినేట్ చేసే పరిస్థితి వచ్చేసరికి వెటకారంగా ఒక్క నిమిషం అంటూ శ్రీహన్ నిద్ర వస్తున్నట్లుగా ఆవలించాడు. కొన్ని ప్రశ్నలు అడుగుతాను దానికి సమాధానం చెప్పు అని అనగానే.. నాకు నచ్చితే చెప్తాను అంటూ శ్రీహన్ చెప్పాడు. అలాగే నా వయసు తక్కువ అని అన్నావు అలా ఎలా ఉంటావో అని ఇనయా ప్రశ్నించింది.

బాడీలో అన్నిట్లోనూ పెద్దగా అనిపించినప్పుడు..

మీ కంటే నేను బాడీలో అన్నిట్లోనూ పెద్దగా అనిపించినప్పుడు ఏజ్ పెద్దగా అనిపిస్తుందా అని సుల్తానా ప్రశ్నించింది. దీంతో నేను అన్ని అన్నానా అంటూ శ్రీహాన్ ఆశ్చర్యపోతూ.. నేను నువ్వు పెద్దదానివి అనలేదు అన్నాడు. ఫ్రెండ్షిప్ చేస్తే మాత్రం ప్రాణం ఇస్తాను అంటూ ఇనయా చెప్పగా దీంతో శ్రీరామ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని కౌంటర్ ఇచ్చాడు. మరి వీరి గొడవ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X