twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: స్నేహితులు బద్ద శత్రువులుగా.. రణరంగంగా మూడోవారం నామినేషన్స్!

    |

    బిగ్ బాస్ హౌస్ లో అసలైన హడావిడి ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. కంటెస్టెంట్స్ మొన్నటి వరకు నామినేషన్స్ లో పెద్దగా బలమైన కారణాలు చెప్పకుండానే నామినేట్ చేయడం కొంత నిరాశకు గురి చేసింది. అయితే మూడో వారం మాత్రం నాగర్జున ఇచ్చిన కోటింగ్ తో కంటెస్టెంట్స్ అందరూ కూడా నామినేషన్స్ ప్రక్రియలో చాలా ఉద్వేగాన్ని చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు మొత్తంగా పదిమంది నామినేషన్స్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో కూడా చాలా గొడవలు జరగబోతున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ గా ఒక ప్రోమో కూడా విడుదల చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

    నామినేషన్ గొడవలు

    నామినేషన్ గొడవలు

    ఇక అది రెడ్డి అయితే మరోసారి హౌస్ లో చాలా కోపానికి గురైనట్లుగా తెలుస్తోంది. మొదట అతను స్రవంతిని నామినేట్ చేస్తూ.. నేను నా మినిట్ చేశాను అంటే మీరు వెళ్ళిపోతారు అని కాదు అనడంతో అందుకు స్రవంతి నామినేషన్ అంటేనే బయటకు వెళ్లిపోవడం అని సమాధానం ఇచ్చింది. ఇక మరోసారి నేహా వాసంతి మధ్యలో కూడా నామినేషన్ గొడవలు చాలా హీటేక్కాయి. ముందు నన్ను మాట్లాడనివ్వ అంటూ నేహా దూకుడుగా మాట్లాడింది.

    అంత అరుస్తానంటూ

    అంత అరుస్తానంటూ

    స్రవంతి నేహా ఇద్దరూ ఎవరికీ ఎవరు తగ్గకుండా మాటలతో గట్టిగానే తిట్టుకున్నారు. ఇక నువ్వు ఇంత అరుస్తే నేను అంత అరుస్తానంటూ ఆదిరెడ్డి మరోసారి గట్టిగా అరిచాడు. గీతూ నువ్వు డిజాస్టర్ ఫెయిల్యూర్ అనడం నాకు నచ్చలేదు అనే కారణం చెప్పింది నేహా. ఇక నువ్వు సంచాలకురాలిగా నిజంగా డిజాస్టర్ అయ్యావు అని గీతు కౌంటర్ ఇచ్చింది. అయితే నిరూపించు అని కూడా ఆమె సవాల్ విసిరింది. ఇక అర్జున్ అయితే ఊహించని విధంగా శ్రీహన్ ని నామినేట్ చేశాడు.

     ఆరోహి - బాలాదిత్యా

    ఆరోహి - బాలాదిత్యా

    ఇక ఫైమా రోహిత్ మేరినాలను నామినెట్ చేస్తూ ఇక్కడికి మనం వచ్చింది మనం గెలవడానికి కానీ పక్కన వారికి గెలిపించడానికి కాదు అని క్లాస్ ఇచ్చింది. ఇక మేము నామినేట్ చేసాము కాబట్టి నామినిట్ చేస్తున్నావ్ అంతే కదా అని రోహిత్ అడగడంతో అందుకు ఫైమా అందుకు కాదని మరొక కారణం చెప్పింది. ఇక ఆరోహి బాలాదిత్యా మధ్యలో కూడా నామినేషన్ వార్ గట్టిగానే కొనసాగింది. ఎంతకాలం నటిస్తావు అని కూడా బాలాదిత్య ఆమెను అనడంతో షా

    రేవంత్ vs ఆర్జే సూర్య

    రేవంత్ vs ఆర్జే సూర్య

    ఇక నిన్న మొన్నటి వరకు ఫ్రెండ్స్ తరహాలో ఉన్న ఆర్జే సూర్య రేవంత్ ఇద్దరు కూడా నామినేషన్స్ లో మళ్ళీ శత్రువులుగా మారిపోతున్నారు. ఓడిపోయిన ఫ్రస్టేషన్లో దానం చేశాను అనుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గెలవడానికి ఆడతారు దానం ఇచ్చామని ఈ ప్లేస్ లో లేవు. ఆ ఒక్క పాయింట్ నాకు నచ్చలేదు అని సూర్య చెబుతూ రేవంత్ నామినేట్ చేశాడు. ఇక నా ఆన్సర్ అక్కడికి వచ్చినప్పుడు చెప్తాను అంటూ రేవంత్ సూటిగా సమాధానం ఇచ్చాడు. మరి ఈరోజు జరగబోయే గొడవలు ఎలాంటి వాతావరణం క్రియేట్ చేస్తాయో చూడాలి.

    English summary
    Bigg boss telugu 6 latest promo and new twist in third week nominations
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X