twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: ఓవరాక్షన్ చేసి దొరికిపోయిన గీతూ.. షో చేస్తోంది అంటూ ఆదిరెడ్డి కౌంటర్

    |

    బిగ్ బాస్ ఈసారి తెలివిగా మొదలుపెట్టిన బ్యాటరీ రీఛార్జ్ టాస్క్ అయితే ఒకరు తప్పు చేసిన ఇతర సభ్యులపై మొత్తం ప్రభావం చూపుతోంది. అందుకే అందరూ కూడా చాలా తెలివిగా గేమ్ ఆడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ విధమైన టాస్క్ తో భవిష్యత్తులో మరింత గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది. ఇక కంటెస్టెంట్స్ అందరూ కూడా వారి టాలెంట్ చూపించేందుకు బిగ్ బాస్ ముందు ఎత్తులో వేస్తున్నారు. ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేయగా అది వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

    మరో అవకాశం ఇస్తున్న బిగ్ బాస్

    మరో అవకాశం ఇస్తున్న బిగ్ బాస్

    ఇంటి బ్యాటరీస్ ని రీచార్జ్ చేసుకునే అవకాశం బిగ్ బాస్ మరోసారి ఇచ్చారు. ఇక బిగ్ బాస్ ఇంటి సభ్యులైతే ఏమీ తినకూడదు అని రూల్ వచ్చినట్లు గీతూ చెప్పింది. ఇంకా బాలదిత్యా అయితే సిగరెట్లు మొత్తం త్యాగం చేయాలని కూడా అని చెప్పింది. ఇక దీని ఒక్కదానితోనే ఆగదు అని ఇంకా చాలామంది త్యాగాలు చేయాల్సి ఉంటుందేమో అని కూడా ఆదిరెడ్డి ఆలోచన విధానాన్ని చెప్పాడు.

    అతను స్మోక్ చేయకుండా

    అతను స్మోక్ చేయకుండా

    ఇక గీతూ చెప్పిన విషయాన్ని మరోసారి బాలాజీ డిస్కస్ చేశాడు. అదే విషయాన్ని నాతో సైలెంట్ గా చెప్పి ఉంటే బాగుండేది అని అన్నాడు. ఇక ఇప్పటినుంచి బాలాదిత్య స్మోక్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత క్యాప్టెన్ ది అని అన్నారు. పిల్లి పిల్లి కొట్టుకుంటే మధ్యలో కోతి వచ్చి తినేసినట్లు ఉంది అని తన పరిస్థితిపై రేవంత్ పంచ్ వేశాడు.

    తగ్గిన బ్యాటరీ లైన్స్

    తగ్గిన బ్యాటరీ లైన్స్

    తర్వాత సీక్రెట్ రూమ్ లోకి అర్జున్ వెళ్ళాడు. ఇక అతను సత్యకి ఇవాళ వారి మదర్ తో కాంటాక్ట్ అవ్వాలని ఉంది అనే విషయాన్ని చెప్పాడు. ఇక తనకు బొచ్చు ప్లస్ ఆడియో కాల్స్ రెండు కావాలి అని గీతూ తనదైన శైలిలో ఆప్షన్స్ అయితే తీసుకుంది. ఇక మనం అన్నిటిలోనూ కూడా ఆ విధంగా కోరుకోవాలి అని ఆమె వివరణ ఇవ్వడంతో ఒక్కసారిగా మళ్లీ బ్యాటరీ ఛార్జ్ తగ్గిపోయింది.

    గాలి తీసేసిన ఆదిరెడ్డి

    గాలి తీసేసిన ఆదిరెడ్డి

    ఇక తర్వాత గీతూ రాయల్ కి ఫోన్ కాల్ వచ్చింది. నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళిపోతే బేజర్ గా ఉంది గీతూ అంటూ వాళ్ళ ఫాదర్ కాల్ చేసి చెప్పాడు. ఇక గీతూ తనదైన శైలిలో అక్కడ కామెడీ చేసింది. ఫోన్ కట్ అయినా కూడా అదే తరహాలో మాట్లాడింది. బిగ్ బాస్ ను కూడా బుద్ధి పడేస్తాను అంటూ తన మాటలతో హైలైట్ అయ్యేలా చేసింది. కట్ అయినా కూడా షో చేసింది అంటూ ఆది రెడ్డి వెంటనే ఆమె గాలి తీసేశాడు.

    అర్జున్ ఎమోషనల్

    ఇక అర్జున్ వాళ్ళ ఫాదర్ టీవీలో కనిపించి అతనితో మాట్లాడాడు. నిన్ను కొన్నిసార్లు మిస్ అవుతున్నాను రా అంటూ ముఖ్యంగా సాంబార్ ఇడ్లీ తినేటప్పుడు నువ్వు సినిమాలు చూస్తున్నప్పుడు క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నప్పుడు మిస్ అవుతున్నాము అంటూ ఆయన ఎమోషనల్ గా చెప్పడంతో అర్జున్ కూడా కంటతడి పెట్టుకున్నాడు. మరి ఈ తరహా వాతావరణం లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేది ఈరోజు ఎపిసోడ్ లో చూడాలి.

    English summary
    Bigg boss telugu 6 latest promo battery recharge new twist and geetu overacting
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X