Bigg Boss Telugu 6: హౌస్ లోకి స్టార్స్.. సూర్య చొక్కా పట్టుకున్న చంటి.. సిగ్గు శరం లేదా అంటూ..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 రెండవ వారం చివరకు వచ్చేసరికి మరో కీలక మలుపు తిరగబోతోంది. ఈసారి హౌస్ లో నుంచి వెళ్లిపోయేది ఎవరో ఊహించడం కూడా కష్టంగానే ఉంది. ఎలిమినేషన్స్ లో ఉన్న అందరూ కూడా ధీమాగా సేఫ్ అవుతామని అంటున్నారు. కానీ బిగ్ బాస్ ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో ఎవరు బలి అవుతారో ఊహించని విధంగా ఉంది. ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు ఇద్దరు స్టార్స్ రాబోతున్నారు. అయితే వారి ముందే చంటి, సూర్య మధ్యలో జరిగినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
శుక్రవారం రోజు స్పెషల్ సెలబ్రెటీ జంట హౌస్ లోకి అడుగు పెట్టింది. వారు మరెవరో కాదు. 'ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా హీరో హీరోయిన్ సుధీర్ బాబు, కృతి శెట్టి. ఈ ఇద్దరు కూడా కంటెస్టెంట్స్ చేత గేమ్స్ ఆడించారు. అలాగే స్కిట్స్ కూడా చేయించారు. ఒక్కొక్కరు ఒక్కో విధమైన డైలాగ్స్ కూడా మెప్పించారు. ముందుగా సింగర్ రేవంత్ పోకిరి డైలాగ్ చెప్పగా ఆ తరువాత గీతు రాయల్ ప్రభాస్ డైలాగ్ తో కొట్టేసుకుందా రా అని చెప్పింది. ఇక ఫైమా శ్రిహాన్ కూడా స్కిట్స్ స్కిట్స్ చేశారు. ఇక వారి కామెడీ పంచులకు సుధీర్ బాబు కృతి శెట్టి నవ్వేశారు.

మరోవైపు RJ సూర్య విజయ్ దేవరకొండ స్టైల్ లో ఈ వారం కెప్టెన్ అవ్వాలని ఉంది అని చాలా డిఫరెంట్ గా చెప్పాడు. ఇక తర్వాత ఆర్ జె సూర్య కాలర్ పట్టుకొని సిగ్గు శరం లేదురా అంటూ చంటి సీరియస్ అయిన విధానం స్కిట్ లో హైలెట్ గా నిలిచింది. అర్ధరాత్రి పూట గుడ్లు వేసుకుని తింటావు.. ఎప్పుడైనా ఒకటైన గుడ్డు పెట్టేవారా అంటూ చంటి తిట్టడంతో సూర్య చెంపపై కొట్టే ప్రయత్నం చేశాడు. ఇక పక్కనే ఉన్న శాని అయితే కొట్టురా కొట్టు అని అరిచేసాడు. ఇక శ్రీ సత్య రాజశేఖర్ మధ్యలో కూడా సదా రొమాంటిక్ డైలాగ్స్ నడిచాయి. ఇక వారి మధ్యలో వచ్చిన శ్రిహాన్ సప్తగిరి మాడ్యులేషన్ తో నవ్వించాడు. మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ అందరూ కూడా డిఫరెంట్ టాలెంట్ తో గెస్ట్ లను ఆకట్టుకోబోతున్నారు. మరి చివరి ఎలిమినేషన్ రౌండ్స్ లో ఎవరు సేఫ్ అవుతారో చూడాలి.


Click it and Unblock the Notifications











