twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: నా కళ్ల ముందే మా అమ్మ కాలిపోయింది.. ఏడిపించేసిన హౌస్ మెంట్స్!

    |

    బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ కెప్టెన్సీ టాస్ లో భాగంగా బేబీ బొమ్మలను ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వాటితో అందరూ ఏర్పరచుకున్న ఎమోషనల్ బాండింగ్ బిగ్ బాస్ గమనించాడు. అంతేకాకుండా మీ జీవితంలో ఒక బేబీ ఉంటే అలాగే మీలో ఒక బేబీ కారణంగా ఎదురైనా అనుభవాలు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ వివరణ ఇచ్చాడు. ఇక ఆ వివరణ ఇవ్వగానే కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో విధమైన విషాదం ఉన్నట్లు తెలియజేశారు.

    ప్రాణం పోయినట్లు

    ప్రాణం పోయినట్లు

    మొదట సుదీప తన గురించి తెలియజేస్తూ 2015లో నాకు ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పుడు థైరాయిడ్ చాలా హైలో ఉండడం వలన బేబీని లాస్ అయ్యాను. నా చెల్లి కూతురు వచ్చేవరకు కూడా నాది అనుకోలేకపోయాను. మా ఆయన అంటూ ఉంటాడు. అది వాళ్ళ పిల్ల.. మళ్లీ ఇవ్వాలి అని. బొమ్మను ఇస్తేనే మనది అనుకున్నాము. ఇక తనను ఇచ్చేస్తే నాకు ప్రాణం పోయినట్లు అనిపించింది.. అంటూ సుదీపా తనలోని ఎమోషనల్ విషాదాన్ని తెలియజేస్తుంది.

    రేవంత్, కీర్తి ఎమోషనల్

    రేవంత్, కీర్తి ఎమోషనల్

    సింగర్ రేవంత్ మాట్లాడుతూ.. నా భార్యకు ఇప్పుడు 7వ నెలతో ఉంది. మొదటిసారి నాన్న అనే పిలుపును పిలిపించుకుందామని ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఇక కీర్తి మాట్లాడుతూ ఇక్కడికి వచ్చేముందు ఒకటి అనిపించింది. నాకు పాప లేదు అని.. తనకు కష్టమైన కష్టమైన పరిస్థితులలో కూడా.. లాస్ట్ మూమెంట్లో నా పాప దగ్గర నేను లేకపోవడం నాకు బాధగా అనిపించింది.

    పగవాడికి కూడా రాకూడదు..

    పగవాడికి కూడా రాకూడదు..

    ఇక మెరీనా రోహిత్ వారి గురించి చెబుతూ మేము ఒక బేబీని కనాలని అనుకున్నాము. కానీ 6వ వారం బేబీ హార్ట్ బీట్ రావట్లేదు. మూడు నెలలు దాటిన తర్వాత నాలుగవ నెల మనకు అవకాశం లేదు అని బేబీని బయటకు తీసేయాలి అని డాక్టర్ అన్నారు. ఇక సింగర్ రేవంత్ వాష్ రూమ్ లో బాధపడుతూ అలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు అని అన్నాడు.

    చెప్పకపోతే చిరాకు వస్తుంది

    శ్రీ సత్య మాట్లాడుతూ ఇప్పుడున్న పిల్లలను అమ్మలు ఎలా చూసుకోవాలి అనే విషయం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీకు ఏమైనా చిన్నవి చెబితే చిరాకుగా ఉండొచ్చు. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో వారు చెప్పకపోతే చిరాకు వస్తుంది.. అని శ్రీసత్య బాధపడింది. ఆమెను చాలామంది ఓదార్చే ప్రయత్నం చేశారు.

    కళ్ళముందే మా అమ్మ కాలిపోయింది

    కళ్ళముందే మా అమ్మ కాలిపోయింది

    ఇక చాలకి చంటి మాట్లాడుతూ.. కళ్ళముందే ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. నా కళ్ళ ముందే మా అమ్మ చూస్తుండగానే కాలిపోయింది. ఆ బాధ నన్ను చాలా రోజులు ఏడిపించింది. ఆ దేవుడు నా బాధను గ్రహించాడు. నాకు ఇద్దరు అమ్మలను కూతుళ్లుగా పంపించాడు. నేను చెప్పేది ఒకటే.. అదేమిటి అంటే.. అడుక్కున్నా సరే పిల్లలను రోడ్డు మీద వదలకండి అని.. చంటి తనలోని ఎమోషనల్ విషయాన్నీ బయటపెట్టాడు.

    English summary
    Bigg boss telugu 6 latest promo contestants emotional stories
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X