Bigg Boss Telugu 6: గీతు రచ్చ మామూలుగా లేదు.. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఆమెకు చిరాకు వచ్చేలా..

బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ మొదలైన రోజే కంటెస్టెంట్స్ ఎంట్రీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇక రెండవ రోజు నుంచి కంటెస్టెంట్స్ మధ్యలో గొడవలు సృష్టించిన బిగ్ బాస్ అప్పుడే దాయాది శత్రువులను కూడా క్రియేట్ చేస్తున్నాడు. ఇక గీతు తన మాటలతో కాస్త అతిగా ప్రవర్తిస్తోంది అనే కామెంట్స్ ఎక్కువగా అందుకుంటోంది. ఇక ఇనాయాకు ఆమెకు అస్సలు పడడం లేదు.

ఇక ఇప్పుడు ఒక అవకాశం రావడంతో గీతు మరింత చిరాకు వచ్చేలా చేసింది. ఇనాయా కూడా సీరియస్ అయ్యింది. ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేయగా అది వైరల్ గా మారుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

క్లాస్ ట్రాష్

క్లాస్ ట్రాష్

బిగ్ బాస్ మొదట క్లాస్ ట్రాష్ అనే టాస్క్ లతో గేమ్ ను స్టార్ట్ చేశారు. ఇక ఈ టాస్క్ ఉన్న వారిలో ఎవరు క్లాస్ నుంచి ట్రాష్ లోకి వెలుతున్నారు. అలాగే ఎవరు ట్రాష్ నుంచి క్లాస్ లోకి వెళుతున్నారో తెలియజేయాలి అని బిగ్ బాస్ ఒక అవకాశం ఇచ్చాడు. ఇక ఇక గీతుని అందరూ కలిసి క్లాస్ లోకి రప్పించడంతో ఆమె తనకు కావాల్సిన పనులన్నీ కూడా చేయించుకునే హక్కును సంపాదిస్తుంది.

గీతూ హైలెట్

గీతూ హైలెట్

ఇక మొదటి నుంచి కూడా గీతుకు ఇనాయా సుల్తానుకు అస్సలు పడడం లేదు. ఇక మొదటి రోజే గీతు ఆమెను టార్గెట్ చేసి కోపంగా మాట్లాడినట్లు అనిపించింది. బిగ్ బాస్ లో ఈ సీజన్ లో జరిగిన మొదటి గొడవ అదే కావడంతో జనాల ఫోకస్ ఇప్పుడు ఎక్కువగా వీరి మీద పడింది. ముఖ్యంగా గీతూ అయితే తన మాటలతో కెమెరాలను తనవైపు తిరిగేలా చేసుకుంటోంది.

అందరికి పనులు చెబుతూ..

అందరికి పనులు చెబుతూ..

ఇక క్లాస్ అధికారం రావడంతో ఊహించినట్లే గీతు మళ్ళీ ఇనాయాను టార్గెట్ చేసింది. చుట్టూ మిగతా వాళ్ళు ఉన్నా కూడా గీతు ఆమెను పిలిచి నా బాటిల్ తీసుకు రాపో అని ఆర్డర్ వేసింది. ఇక ఆమె మాటలకు ఇనయా చిరాకుతో వెళ్ళింది. అనంతరం ఆరోహిని కూడా పిలిచి గిన్నె తెస్తే చేయి కడుక్కుంటాను అంటూ గీతు షాక్ ఇస్తుంది. కూర్చున్న చోట ఆమె అందరికి పనులు చెబుతుంది. అలాగే టిష్యు ఎవడు తెస్తాడాని అంటుంది. ఇక తమ్ముడు బాలా యాక్సిస్ కార్డ్ ఎక్కడా అని అడుగుతుంది.

అమ్మగారు నిన్ను పిలుస్తున్నారు

అమ్మగారు నిన్ను పిలుస్తున్నారు

అలాగే ఇనియాను పిలువు అని అనడంతో అప్పుడు ఆమె రెస్ట్ రూమ్ లో ఉంటుంది. అమ్మగారు నిన్ను పిలుస్తున్నారు అని మిగతా వాళ్ళు నవ్వుకుంటూ చెబుతారు. మిమ్మల్ని గీతు రమ్మంటున్నారు అంటూ బాలాదిత్య చెప్పడంతో ఇనయా 10 నిమిషాలు అని అంటుంది. ఇక అసలే కాలుతున్న సమయంలో ఏంటిది అని మిగతా కంటెస్టెంట్స్ గీతుతో అంటారు. వాళ్ళకు కాళితే నేను ఏమి చేసేది అని గీతూ సమాధానం ఇస్తుంది. ఇక నిమ్మకాయ నీళ్లు కావాలని అంటుంది.

గీతూపై సీరియస్

గీతూపై సీరియస్

అలాగే పాట పాడాలని కూడా ఇనాయకు చెప్పగా ఇనాయా నాకు పాటలు రావని అంటుంది. ఇంట్లో పనులు మాత్రమే చేయాలని చెప్పినట్లు ఇనయా ఆన్సర్ ఇస్తూ.. పని చెబితేనే చేస్తాను అని అంటుంది. ఇక దువ్వెన తీసుకు రావాలని గీతు చెబుతుంది. ఏదేమైనా ఇనయా సుల్తానా మధ్య ఈ రోజు టాస్క్ చాలా ఆసక్తికరంగా కొనసాగబోతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ గొడవలు ఎంత వరకు వెళతాయో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X