For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: ఓవరాక్షన్ చేసిన గీతు.. టెంకాయలా పగలగొట్టాలి అని నాగ్ కౌంటర్

  |

  బిగ్ బాస్ 6వ సీజన్ మొదటి వారంతరానికి వచ్చేసరికి మరింత ఆసక్తికరంగా మారుతోంది. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎవరికి వారు చివరి వరకు నిలవాలి అని చాలా బలంగా పోరాడుతున్నారు. ఇక శని ఆదివారాల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచే నాగార్జున మరోసారి హైలెట్ కాబోతున్నాడు. ఈ వారం నామినేషన్స్ తో కాస్త హడావుడిగా కనిపించిన కంటెస్టెంట్స్ ఆదివారం రోజు మాత్రం ఫన్ డే తో గేమ్స్ ఆడబోతున్నారు. నాగార్జున హడావుడి మరింత ఎక్కువ కానుంది. అందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

  శ్రీహన్ బాత్రూమ్ కామెడీ

  శ్రీహన్ బాత్రూమ్ కామెడీ

  నాగార్జున ఎంట్రీ ఇవ్వగానే ఈ రోజు సండే.. అంటే ఫన్ డే అంటూ.. ఆటలు పాటలు ఉంటాయి అలాగే మధ్యలో ఎలిమినేషన్ కూడా ఉంటుందని అన్నారు. ఇక వెరైటీ గా ఈ రోజు గేమ్ ఆడబోతున్నాము అంటూ ఎవరికి ఎంత తెలుసు అనే ఆటను స్టార్ట్ చేశారు. ఇక మొదటగా శ్రీహన్ ఎక్స్ ప్లోర్ చేసిన ప్లేస్ ఏది అనగానే స్నేహ ముందుగా బజర్ నొక్కి వ్వాష్ రూమ్ అని నవ్వుకుంటూ చెప్పింది. దీంతో నాగార్జున 200% కరెక్ట్ అని చెప్పా

  షాని పేరుకి అర్థం

  షాని పేరుకి అర్థం

  ఇక ఆర్జే సూర్య ఎంతమందిని మిమిక్రీ చేయగలడు అని అడగడంతో చాలామందిని చేయగలడు అని ఇనయా చా ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. ఇక తర్వాత షానీ పేరు ఫుల్ ఫామ్ ఏమిటి అని అడగడంతో కొందరు చెప్పడానికి ముందుకు వచ్చినప్పటికీ మళ్ళీ వెనుకడుగు వేశారు. ఇక నాగార్జున వెంటనే దానికి సమాధానం ఇచ్చేశారు. శ్రీలత హర్షిత అనిత నిషా దిశ అని అన్నారు. శానికి సంబంధించిన గర్ల్ ఫ్రెండ్స్ అక్షరాల నుంచి మొదటి అక్షరంతో ఆ పేరు వచ్చింది అని తెలియజేశాడు.

   సస్పెన్స్ లో పెట్టిన నాగ్

  సస్పెన్స్ లో పెట్టిన నాగ్

  ఇక గీతూకి బాత్రూంకి మధ్యలో ఉన్నటువంటి.. అనే ప్రశ్న అడుగుతూ నాగార్జున కంటెస్టెంట్స్ అందరితో కూడా ఒక ఆటాడుకున్నాడు. ప్రశ్న పూర్తి చేయకుండా వారిని సస్పెన్స్ లో కూడా పెట్టాడు. ఇక బజర్ పైన మీద కూర్చోవాలి అని మరికొందరికి సెటైర్ కూడా వేశారు. ఇక ఆ తర్వాత హౌస్ లో ఉన్న వారిలో బుట్ట బొమ్మ ఎవరు అంటూ నాగార్జున ఇంటి కెప్టెన్ బాలాదిత్యను అడిగాడు. ఇక అందుకు బాలాజీ మెరీనా పేరు చెప్పడంతో చాలా సేఫ్గా గేమ్ ఆడినట్లు నాగార్జున తనని పొగిడాడు.

   ఫైమా ఒక ఫైర్

  ఫైమా ఒక ఫైర్

  సత్య శేఖర్ కమ్ముల హీరోయిన్ హై బ్రీడ్ పిల్ల.. గ్లామర్ ఆఫ్ బిగ్ బాస్ స్రవంతి. ఇక ఫైమా గురించి చెబుతూ కొంత ఆలోచించి తను హ్యూమర్ బాగా చేస్తుంది అని బాలాదిత్య అన్నాడు. దీంతో నాగర్జున లక్షణాలు చెప్పకు వర్ణించండి అని చెప్పడంతో పైమా ఒక ఫ్లవర్ కానీ ఫ్లవర్ కాదు ఫైర్ అని తెలివిగా మరో ఆన్సర్ ఇచ్చాడు.

  గీతుకి నాగ్ కౌంటర్

  గీతక్క మరొక సీతక్క అంటూ చెప్పడంతో అందుకు గీతు నేను ఒక టెంకాయ లెక్కన అంటూ పైకి గట్టిగా ఉన్నప్పటికీ లోపల చాలా స్వీట్ గా ఉంటాను ఉంటాను అని చెప్పింది. బేసిగ్గా పగలగొట్టాలి అంటావు.. అని నాగార్జున అందుకు తగ్గట్టుగా కౌంటర్ కూడా ఇచ్చాడు. ఇక మీ అందరికీ హ్యాపీ కదా అంటూ గీతూ మరోసారి నవ్వుకుంటూ తెలియజేసింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం ఎలిమినేట్ ఎవరీ అవుతారు అనే విషయంలో సస్పెన్స్ కొనసాగినప్పటికీ అసలు ఎలిమినేషన్ లేకుండానే మొదటి వారాన్ని ముగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

  English summary
  Bigg boss telugu 6 latest promo nagarjuna big counter to galaata geetu
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X