Don't Miss!
- News నెల్లూరు జైలుకు జగన్ పై దాడి కేసు నిందితుడు సతీష్-14 రోజుల రిమాండ్..!
- Sports PBKS vs MI: అందుకే రెండు మార్పులు చేశాం: సామ్ కరణ్
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
Bigg Boss Telugu 6: అతనిపై నాగార్జున షాకింగ్ కామెంట్స్, నీ బాధ్యతేంటీ? పిట్ట కథలు అంటూ ఫైర్
బిగ్ బాస్ తెలుగు 6 రేటింగ్ పరిస్థితి ఎలా ఉన్నా.. హౌజ్ లో సభ్యులు మాత్రం గొడవలు, అరుపులు, ప్రేమాయణాలతో బాగానే కంటెంట్ ఇచ్చే ప్రయత్నమైతే చేస్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు హౌజ్ మేట్స్ ఆడిన గేమ్ పై శని, ఆది వారాలలో హోస్ట్ నాగార్జున రివ్యూ ఇస్తాడని తెలిసేందే. లాస్ట్ టైమ్ వచ్చిన నాగార్జున బిగ్ బాస్ ఇంటి సభ్యులకు గట్టిగానే క్లాస్ పీకారు. దాంతో కొంతమంది ఆటలో మార్పు కనిపడింది. కొంతమందిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. అయితే మళ్లీ శనివారం రానే వచ్చింది. ఈ శనివారం అంటే సెప్టెంబర్ 24న ప్రసారమయ్యే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదలైంది.
మరోసారి నాగార్జున ఫైర్..
శనివారం వచ్చిందటే చాలు బిగ్ బాస్ తెలుగు 6కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున వచ్చేస్తారు. బిగ్ బాస్ ఇంటి సభ్యుల ఆడిన ఆటపై రివ్యూ చేస్తారు. కొంతమందిని పొగుడుతారు, మరికొంతమందికి చురకలు అంటిస్తారు. గేమ్ తీరును మార్చుకోమని హిత బోధ చేస్తారు. ఇలానే గత శనివారం వచ్చిన నాగార్జున బిగ్ బాస్ హౌజ్ మేట్స్ ఆట తీరుపై మండిపడిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఇంటి సభ్యులపై ఫైర్ అయినట్లు తెలుస్తోంది.
పర్ఫామ్ చేశారని అనుకుంటున్నారా..
తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో ఇంటి సభ్యులకు నాగార్జున మళ్లీ క్లాస్ తీసుకునేటట్లు అనిపిస్తుంది. నాగార్జున రావడంతోనే ఏం అంటారో అన్నట్లుగా శ్రీ సత్య మొహం పెట్టడం చూడొచ్చు. స్టేజ్ పైకి వచ్చిన నాగార్జున.. ''ఆ సోఫాల వెనుక లాస్ట్ టైమ్ తొమ్మిది మంది నిలుచున్నారు. అందులో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. మిగతా ఏడుగురు వెళ్లి నిల్చోండి'' అని చెబుతాడు. తర్వాత ఈవారం మీరు పర్ఫామ్ చేశారని అనుకుంటున్నారా అని అడిగిన నాగార్జున ప్రశ్నకు అందరూ ఎస్ సర్ అని సమాధానం ఇస్తారు.
మేము కూడా షాక్ అయ్యాం..
శ్రీ సత్య, శ్రీహాన్ మీరు బాగా ఆడారు ముందుకు రండి అని చెప్పిన నాగార్జున.. వారి కోసం చప్పట్లు కూడా కొట్టరా అని అంటాడు. 'సోఫా వెనుక ఉన్న షాక్ లో ఉన్నాం సర్' అని బాలాదిత్య అనగా.. 'నీ ఆట తీరు చూసి మేము కూడా షాక్ అయ్యాం' అని కౌంటర్ ఇచ్చాడు నాగార్జున. బాలాదిత్యకు సంబంధించిన వీడియో వేయమన్నాడు నాగార్జున. అందులో ఇనయను ముగ్గురు, నలుగురు లాక్కెళ్తుంటే బాలాదిత్య ఏం అనకుండా సైలెంట్ గా కూర్చోవడం చూపించారు.
నీ బాధ్యత ఏంటీ?
అది చూపిస్తూ ''ఇది నా ఆట తీరు కాదు, నా తీరే అంత అని అన్నావ్ కదా.. పోలీసీ టీమ్ లో నీ బాధ్యత ఏంటీ?'' అని నాగార్జున అడగ్గా.. 'సర్ నేను అప్పుడు పోలీసు కన్నా.. మనిషిగా ఆలోచించాను' అని చెబుతాడు బాలాదిత్య. దీంతో నాగార్జున 'బాలాదిత్య మంచి వాక్చాతుర్యంతో ఇచ్చిన సమాధానాన్ని ఒప్పుకుంటారా' అని ఆడియెన్స్ ను అడిగాడు. అందుకు ప్రేక్షకులు నో అని సమాధానం ఇస్తారు. ఆ తర్వాత నాగార్జున ముందున్న వాళ్ల పిట్ట కథలు చెప్పాలి అంటూ ఇనయ, శ్రీహాన్ ల పిట్ట గొల గురించి హింట్ ఇచ్చినట్లయింది. దీంతో శ్రీహాన్, ఇనయ, గీతూ రాయల్ ఎక్స్ ప్రెషన్స్ మారిపోయాయి.