Bigg Boss Telugu 6: ఈ వారం కెప్టెన్సీ టాస్క్.. గీతూ డైపర్ మార్చాలని ఆదేశాలు.. రేవంత్ మళ్ళీ సీరియస్!
బిగ్ బాస్ తెలుగు 6 వ సీజన్ కాస్త నీరసంగా కొనసాగుతున్నట్లు కామెంట్స్ చాలానే వస్తున్నాయి. ఎవరో ఒకరిద్దరు తప్పితే ఈసారి హౌస్ లో ఎవరు కూడా అంతగా హైలెట్ కావడం లేదు అని.. చిరాకు తెప్పించే వాళ్ళే ఎక్కువగా ఉన్నట్లు కామెంట్స్ వచ్చాయి. ఇక బగ్ బాస్ అందరి మధ్యలో మరింత పోటీని క్రియేట్ చేసేందుకు ఈ వారం విభిన్నంగా కెప్టెన్సీ టాస్క్ ను స్టార్ట్ చేశాడు. ఇక ఈ రోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
Photos Courtesy: Star మా and Disney+Hotstar

కెప్టెన్సీ టాస్క్
మొదటివారం కెప్టెన్సీ టాస్క్ లో అందరూ ఊహించినట్లే బాలాదిత్యా గెలిచిన విషయం తెల్సిందే. ఇక రెండో వారం కెప్టెన్సీ పోటీ దారుల కోసం బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. సిసింద్రీ అనే కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా అందరికి ఒక బేబీ బొమ్మను ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ బేబీ బాగోగులు చూసుకుంటూ ఉండగానే బిగ్ బాస్ సమయానుసారం కొన్ని ఛాలెంజ్ లు ఇవ్వడం జరుగుతుంది.. అని రేవంత్ వివరంగా టాస్క్ గురించి తెలియజేశాడు.

నాకు గిల్లడం అలవాటు
ఇక మొదట గీతూ బేబీ ని పట్టుకొని నాకు చిన్నప్పటి నుంచి ఏ పిల్లకాయలు కనిపించినా నాకు గిల్లడం అలవాటు అని అంటుంది. ఆ తరువాత రోహిత్ మెరినా బేబీ ఏడుస్తూ ఉండడంతో మెరినా వచ్చి దగ్గరికి తీసుకుంటుంది. ఇక ఆ తరువాత గీతూ డైపర్ మార్చాలి అని వాయిస్ వినిపిస్తు ఉంటుంది. దీంతో అందరూ నవ్వేస్తారు.

మరో ఛాలెంజ్
ఇక ఆ తరువాత కంటెస్టెంట్స్ అందరూ కూడా గార్డెన్ ఏరియాలో ఉన్న కుర్చీలలో బేబీలను పెట్టాల్సి ఉంటుంది. ఇక ఆ తరువాత సిసింద్రీ టాస్క్ లో కెపెన్స్ పోటీ దారులు కావడానికి మొదటి ఛాలెంజ్ ఇచ్చాడు. సాక్స్ అండ్ షేప్స్ ఛాలెంజ్ లో గోను సంచులలో గెంతుకుంటు వాటిని అమార్చాల్సి ఉంటుంది. ఇక మధ్యలో రేవంత్ కాస్త తడబడ్డాడు.
రేవంత్ సీరియస్
ఇక ఆ తరువాత రేవంత్ ఒక విషయంలో చంటి పై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఒకరిని ఓడగొట్టాలి అని చూస్తే మనమే ఒడిపోతాం అని కంగ్రాట్స్ అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇక ఆ తరువాత యూ ఆర్ ద రియల్ ఫైటర్ అంటూ రేవంత్ మరింత కోపంగా కనిపించాడు. ఇక చంటికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఇక ఫైమా గేమ్ చెంజర్ అని అభినయ చెప్పగా రేవంత్ అసంతృప్తితోనే కనిపించాడు. దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షు కాబట్టి ఆ మాత్రం ఉంటది అనే డైలాగ్ కూడా చెప్పాడు. నువ్వు గెలవడం కోసమే అయితే నేను ఆడేది ఎందుకున్నా అని ఫైమా మరో పవర్ఫుల్ కౌంటర్ ఇచ్చింది. అసలు వీరి మధ్య ఎం జరిగిందో తెలియాలి అంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











