twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss telugu 6: కన్ను కొడతావా అంటూ అతనిపై గీతూ క్రష్.. దొంగచాటుగా వెళ్లిన సూర్య

    |

    బిగ్ బాస్ ఈవారం ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతోంది. ముఖ్యంగా కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా సీరియస్ గానే పోరాడుతున్నారు. ఎలాగైనా ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవాలని అనుకుంటూ కెప్టెన్సీ టాస్క్ కోసం వారి శక్తిని మొత్తం ఉపయోగిస్తున్నారు. అయితే ఈ క్రమంలో గొడవల తర్వాత కంటెస్టెంట్స్ మధ్యలో కొనసాగుతున్న మాటలు కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా విడుదల చేసిన ఒక ప్రోమో అయితే ఈ రోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ పై ఆసక్తిని కలిగించింది. ఆ వివరాల్లోకి వెళితే..

    సూర్య, ఆరోహి

    సూర్య, ఆరోహి

    ఇక మొన్నటి వరకు ఆరోహి అలాగే సూర్య ఇద్దరూ మధ్యలో కూడా చాలా మంచి అనుబంధమైతే కొనసాగింది. ఇద్దరి మధ్యలో ఏదో నడుస్తోంది అని కూడా చాలామంది కామెంట్ చేశారు. ఆఖరికి నాగర్జున కూడా వారి మీద డౌట్ క్రియేట్ చేశాడుమ్ దీంతో ఇప్పుడు ఈ జోడి షోలో హైలెట్ గా నిలుస్తోంది ఇక ఇటీవల టాస్క్ లో గొడవలు అయినా తర్వాత సూర్య ఆరోహి మధ్యలో కొంత గ్యాప్ పెరిగింది

    ఆరోహి ఏడుపు

    ఆరోహి ఏడుపు

    ఇక వారి మధ్యలో చేరి శ్రీహన్ కూల్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక వారు మాట్లాడుకుంటూ ఉండగా మధ్యలో లేచి వెళ్లిపోయిన సూర్య ఏదో బాధతో వెళ్ళిపోతున్నాను అనుకున్నారు. అంతే కాకుండా ఆరోహి కూడా అతను ఏడుస్తున్నాడేమో అనుకుంది. సూర్య తిట్టినందుకు ఏడుస్తున్నాను అని కన్నీరు పెట్టుకుంది. ఇక తర్వాత లోపలి గదిలోకి వెళ్లిన సూర్య ఏదో తింటూ కనిపించాడు.
    ఇక లోపల తల కొట్టుకుంటున్నాడు ఏమో అని శ్రీహాన్ ఆరోహీ ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. కానీ సూర్య, ఆరోహి రాగానే ఒక్కసారిగా పడుకున్నాడు.

     కన్ను కలడుతున్నవా?

    కన్ను కలడుతున్నవా?


    ఇక మరోవైపు సోఫాలో కూర్చుని ఉన్న ఫైమా అలాగే గీతు ఇద్దరు కూడా రాజశేఖర్ పై రొమాంటిక్ సెటైర్స్ వేసారు. నామీద నీకు క్రష్ ఉంది కదా రాజు అంటు గీతు చెప్పడంతో.. ఫస్ట్ మీరు చేసుకోండి బ్రష్.. అని పక్కనే ఉన్న ఫైమా పంచ్ వేసింది. కన్ను కొడుతున్నావా అంటూ గీతు రాజశేఖర్ తో మాట్లాడింది. ఇక ఆ డోర్ ఓపెన్ అయిందా నేను వెళ్ళిపోతాను అని ఫైమా వారి ఓవరాక్షన్ పై సెటైర్ వేసింది.

    ఎత్తర జెండా

    ఎత్తర జెండా

    ఇక కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా రెండో లెవెల్ టాస్క్ ఎత్తర జెండా అనే టాస్క్ బిగ్ బాస్ స్టార్ట్ చేశాడు. అందులో ఇసుకను తెచ్చి ఒక టబ్లో పోయాల్సి ఉంటుంది. శ్రీ సత్య అలాగే ఆదిరెడ్డి గట్టిగానే పోటీపడ్డారు. ఇక ఆఖరికి ఈ ఆటలో శ్రీ సత్య గెలిచినట్లుగా తెలుస్తోంది. చూస్తూ ఉంటే మరోసారి ఆదిరెడ్డి కెప్టెన్సీ టాస్క్ లో ఓడిపోయినట్లు కూడా అనిపిస్తోంది. మరి వీరి ఆట తర్వాత హౌస్ లో ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయో చూడాలి.

    టాప్ లో ఉండే కంటెస్టెంట్స్

    ఇక ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లలో అయితే టాప్ 3 కంటెస్టెంట్స్ దాదాపు ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా రేవంత్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతాడు అని బిగ్ బాస్ విన్నర్ కూడా అతనే అంటూ సోషల్ మీడియాలో ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఇక అతని తర్వాత అత్యంత బలమైన కంటెస్టెంట్స్ గా గీతూ శ్రీహన్ కొనసాగుతున్నట్లుగా కూడా అభిప్రాయాలు వస్తున్నాయి. ఏదేమైనా కూడా ఈసారి టాప్ ఫైవ్ లో ఈ ముగ్గురు కూడా టాప్ త్రీ లో కొనసాగుతారు అని టాక్ వస్తోంది.

    English summary
    Bigg Boss Telugu 6 latest promo new captaincy task started and geetu romantic comments
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X