Bigg Boss Telugu 6: మొదలైన హడావుడి.. మొదటి పని పూర్తి చేసిన నాగార్జున!

టెలివిజన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మరికొన్ని రోజుల్లో మొదలు కాబోతున్న విషయాన్ని తెలిసిందే. ఇప్పటికే ఐదు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఓటీటీ లో కూడా ఎంట్రీ ఇచ్చి నాన్ స్టాప్ గా బాగానే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు టెలివిజన్లో 6వ సీజన్ ను మొదలుపెట్టాలని నిర్వాహకులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే పూర్తి ప్రణాళిక సిద్ధమైంది. ఇక ప్రస్తుతం కొంతమంది సెలబ్రిటీలను కూడా ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.

కంటెస్టెంట్స్ లో ఈసారి ఎక్కువగా టెలివిజన్ నటులు అలాగే కొంతమంది యూట్యూబ్ స్టార్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మొదటి ప్రోమో కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇటీవల నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన ఒక సెట్ లో బిగ్ బాస్ ప్రోమో షూట్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రోమోను మరో రెండు వారాల్లో సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు చూపించబోతున్నారు.

Bigg boss telugu 6 latest promo shoot update

హోస్టింగ్ విషయంలో అయితే మళ్లీ ఎలాంటి మార్పులు లేవు అని క్లారిటీ వచ్చేసింది మొన్నటి వరకు అయితే సమంత కూడా బిగ్ బాస్ 6వ సీజన్ కు హోస్టింగ్ చేసే అవకాశం ఉన్నట్లు అనేక రకాల వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు నాగార్జున స్పెషల్ ప్రోమో లో కనిపించడంతో అవన్నీ అబద్ధాలు అని తేలిపోయింది.

ఇక ఈసారి మరింత కొత్తగా ఉండే విధంగా నిర్వాహకులు బిగ్ బాస్ సెట్ ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి విభిన్నమైన క్యాటగిరీలలో కంటెస్టెంట్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. టెలివిజన్, యూట్యూబ్, సినిమా ఇండ్ట్రీ నుంచి 20 మందిని అలాగే కామన్ మ్యాన్ క్యాటగిరి లో కూడా మరో ఇద్దరిని బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్స్ గా సెలెక్ట్ చేయనున్నారు. ఎంటర్టైన్మెంట్ విషయంలో మాత్రం సరికొత్త రూల్స్ కూడా ఈసారి ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. ఇక ఫైనల్ గ బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోనే ప్రసారం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X