Bigg Boss 6 Telugu: అఫీషియల్ డేట్ వచ్చేసింది.. మాస్ స్టైల్ లో నాగార్జున స్పెషల్ ప్రోమో వైరల్!
బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 6 మరికొన్ని రోజుల్లో మొదలు కాబోతున్న విషయం తెలిసిందే. అయితే షో స్టార్ అయ్యే డేట్ పై యాజమాన్యం ఇంతకుముందు ఎప్పుడూ కూడా అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చింది లేదు. కానీ బిగ్ బాస్ మొదలయ్యేది ఆరోజే అంటూ చాలా కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక మొత్తానికి ఆ రూమర్స్ కు చెక్ పెడుతూ బిగ్ బాస్ నుంచి అఫీషియల్ గా ఒక ప్రోమో వచ్చింది. ఇక అందులో నాగార్జున అఫీషియల్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ 6వ సీజన్
బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. అలాగే కొన్ని నెలల క్రితం మొదటిసారి ఓటీటీ లో కూడా నాన్ స్టాప్ షో గా మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ నాన్ స్టాప్ ద్వారా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ షో దగ్గర అయింది. అయితే ఇప్పుడు టెలివిజన్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న అసలైన 6వ సీజన్ మొదలుకావడానికి రంగం సిద్ధమయింది. ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్టు కూడా ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది.

హై డిమాండ్
గత మూడు సీజన్స్ తో పాటు నాన్ స్టాప్ సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించి ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు మరోసారి ఆయన ద్వారానే బిగ్ బాస్ ముందుకు కొనసాగబోతోంది. ఈసారి నాగార్జున అత్యధికంగా 15 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నట్లుగా కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. గతంలో కరోనా నేపథ్యంలో నాన్ స్టాప్ కోసం ఆయన చాలా తక్కువగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు మాత్రం టెలివిజన్ షో కోసం అంతకుమించి అనేలా డిమాండ్ చేసినట్లు సమాచారం.

ఎంటర్టైన్మెంట్ కు అసలైన అడ్డా
ఇక బిగ్ బాస్ 6వ సీజన్ మొదలవడానికి ఇంకా ఎక్కువ రోజులు సమయం లేదు. రెగ్యులర్ ప్రమోషన్స్ తో టీం కూడా అలర్ట్ అయింది. ఇక నాగార్జున అయితే ప్రత్యేకమైన ప్రోమోలతో కూడా అంచనాలను పెంచేస్తున్నారు. ఈసారి ఎంటర్టైన్మెంట్ కు అసలైన అడ్డా ఫిక్స్ అంటూ డైలాగ్స్ తో ఆకట్టుకుంటున్నారు.

ప్రోమో రిలీజ్
ఇటీవల రీలీజ్ చేసిన బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లోగో కు మంచి క్రేజ్ అయితే దక్కింది. ఇక షో ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది అనే విషయంలో అనేక రకాల రూమర్స్ అయితే కొంత కన్ఫ్యూజన్ కు గురిచేసాయి. ఇక మొత్తానికి కొద్దిసేపటికి క్రితం అఫీషియల్ గా ఒక ప్రోమో కూడా విడుదల చేశారు. అందులో నాగార్జున గల్లి క్రికెట్ ఆడుతున్న సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి.. అట్టా ఎర్రి ముఖం వేసుకొని చూస్తావ్ ఏంట్రా.. ఇక్కడ నీ ఆట ఆగింది అంటే.. అక్కడ అసలైన ఆట స్టార్ట్ అయినట్లే అని మాస్ స్టైల్ లో ఆకట్టుకున్నారు.
బిగ్ బాస్ 6.. డేట్ ఫిక్స్
అలాగే లైఫ్ లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ తరువాతే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ కు అడ్డా ఫిక్స్.. అంటూ నాగర్జున తనదైన శైలిలో చెప్పారు. ఇక సెప్టెంబర్ 4వ తేదీ నుంచి బిగ్ బాస్ సందడి మొదలు కాబోతున్నట్లుగా అఫీషియల్ డేట్ ను కూడా తెలియజేశారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా ఎవరూ పాల్గొంటారు అనే విషయాలని తెలుసుకోవాలి అని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈసారి బిగ్ బాస్ లో ఎలాంటి వివాదాలు హైలైట్ అవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











