Bigg Boss Telugu 6: తారుమారవుతున్న ఓటింగ్.. శ్రీహాన్ ను వెనక్కి నెట్టిన ఇనయా, కారణాలు ఇవే..

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఇంటి సభ్యులు తగ్గుతున్న కొద్ది గొడవలు ఎక్కువవుతున్నాయి. టాస్క్ ల్లోనే కాకుండా గేమ్ లేనప్పుడు కూడా గ్రూపులుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎమోషన్స్, బంధాలు, బలహీనతలు, రిలేషన్ షిప్స్ అంటూ ఇంతకుముందు కంటే ఆసక్తిగా షో నడుస్తోంది. ఇక నామినేషన్లలో ఉన్నవాళ్లను వాళ్ల ఆటతీరు, ప్రవర్తన శైలిని బట్టి ప్రేక్షకులు ఓట్ చేస్తారు. కొంతమంది మాత్రం టైటిల్ ఫేవరేట్ గానే ఉంటారు. ఈ వారం జరిగిన టాస్క్ తో ఓటింగ్ అనేది మారిపోతుంది. అంతకుముందు బెటర్ అనుకున్నవాళ్ల ఓటింగ్.. వారి బిహేవియర్ తో పోగోట్టుకుంటున్నారు. ఆ వివరాళ్లోకి వేళితే..

నామినేషన్లో 10 మంది..

నామినేషన్లో 10 మంది..

సాధారణంగా బిగ్ బాస్ షోలో నామినేషన్స్ టాస్కు ఎన్నో గొడవలతో సాగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తొమ్మిదో వారం ప్రక్రియ కూడా చాలా వాగ్వాదాలు, దూషణలతో రసవత్తరంగా సాగింది. ప్రస్తుతం ఇంట్లో ఉన్న 13 మంది ఇంటి సభ్యుల్లో ముగ్గురు శ్రీహాన్, వాసంతి, రాజ శేఖర్ తప్పా మిగిలిన 10 మంది కంటెస్టెంట్స్ గీతూ రాయల్, ఇనయా సుల్తానా, శ్రీ సత్య, రేవంత్, బాలాదిత్య, కీర్తి భట్, ఆదిరెడ్డి, మెరీనా అబ్రహం, రోహిత్ సహ్ని, ఫైమా నామినేట్ అయ్యారు.

 ఎప్పటిలానే అతనే ఫస్ట్..

ఎప్పటిలానే అతనే ఫస్ట్..

ఈవారం కూడా ఎప్పటిలానే టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన సింగర్ రేవంత్ మొదటి స్థానంలో ఉన్నాడు. అతను తన అగ్రేషన్ తో చాలా రూడ్ గా బిహేవ్ చేసిన ఓటింగ్ మాత్రం పడుతూనే ఉంది. ఇక తాజాగా జరిగిన నవబంర్ 2 ఎపిసోడ్ లో మాత్రం రేవంత్ ఒక విలన్ లా బిహేవ్ చేశాడు. గేమ్ లో అపొనెంట్ అమ్మాయిలతో ఆడిన తీరు, వాళ్లు ఔట్ అయ్యాక రేవంత్ బిహేవ్ చేసిన తీరు నాగార్జున అన్నట్లు ఉన్మాదిని తలపించింది.

 మారిపోయిన రెండో స్థానం..

మారిపోయిన రెండో స్థానం..

మొదటి స్థానంలో ఉన్న రేవంత్ కు 17.97 శాతం ఓట్లు పడ్డాయి. ఇక రెండో స్థానం ఈవారం అయితే మారిపోయందనే చెప్పాలి. ఇంతకుముందు సెకండ్ ప్లేస్ లో శ్రీహాన్ కొనసాగగా.. ఈ సారి అతన్ని వెనక్కి నెట్టి ఇనయా సుల్తానా వచ్చింది. 12.27 శాతం ఓటింగ్ తో రెండో స్థానం దక్కించుకుంది. సూర్య ఎలిమినేట్ అయ్యేందుకు తనే కారణమని హౌజ్ మొత్తం టార్గెట్ చేసింది. దీంతో ఆమె బాత్రూమ్ లోకి వెళ్లి ఏడ్చింది. అలాగే తాజా ఎపిసోడ్ లో కొంత నోరు జారిన గేమ్ మాత్రం అదరగొట్టింది. దీంతో ఆమెకు రెండో స్థానం వచ్చిందనుకోవచ్చు.

ట్రెండింగ్ లో బాలాదిత్య..

ట్రెండింగ్ లో బాలాదిత్య..

మూడో స్థానంలో 11.73 శాతంతో బాలాదిత్య ఉన్నాడు. సోమవారం నుంచి బాలాదిత్య ట్రెండింగ్ లో ఉన్నాడు. తాజా ఎపిసోడ్ లో గీతూ రాయల్ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్నాడు బాలాదిత్య. అందరితో కూల్ గా మాట్లాడే బాలాదిత్య ఒక్కసారిగా అంతలా కన్నీరుమున్నీరు కావడంతో ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. ఇక నాలుగో స్థానంలో 11.59 శాతంతో కీర్తి నిలిచింది. గేమ్ పరంగా, ఫిజికల్ టాస్క్ లో కీర్తి మంచి పర్ఫామెన్స్ చూపిస్తోంది.

 ఐదో స్థానంలో ఆదిరెడ్డి..

ఐదో స్థానంలో ఆదిరెడ్డి..

9.08 శాతంతో ఐదో స్థానంలో ఆదిరెడ్డి ఉన్నాడు. ఆదిరెడ్డి గేమ్, మాటలు, పాయింట్స్ కరెక్ట్ గా ఉన్నా గీతూ రాయల్ చెంత చేరడంతో ఎక్కువగా నెగెటివ్ అవుతున్నాడు. ఆమెకు దూరంగా ఉంటేనే అతనికి సేఫ్ అని చాలామంది భావిస్తున్నారు. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో బ్లూ టీమ్ లీడర్ గా ఆదిరెడ్డి మంచి నాయకుడు అనిపించుకున్నాడు. ఇక అందరిని తన మాటలతో, బిహేవియర్ తో చిరాకు తెప్పించే చిత్తూరు చింతకాయ (నెటిజన్ల ఫీలింగ్) గీతూ రాయల్.. 7.62 శాతంతో ఆరో స్థానంలోకి పడిపోయింది. ఇక ఆమె ఆట, ప్రవర్తన, మాటల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 అతి కొంచెం తేడాతో..

అతి కొంచెం తేడాతో..

గీతూతో పోల్చుకుంటే అతి కొంచెం తేడాతో ఏడో స్థానంలో ఉన్నాడు రోహిత్ సహ్ని. అతనికి 7.61 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక అతని భార్య మెరీనా అబ్రహం 7.38 శాతంతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక శ్రీ సత్య తొమ్మిదో స్థానంలో 7.38 శాతంతో నిలిచింది. మెరీనా, శ్రీ సత్యకు వచ్చిన ఓటింగ్ శాతం సేమ్ ఉంది. టాప్ 5లో కొనసాగే ఫైమా ఇటీవలి ప్రవర్తనతో పదో స్థానంలోకి వెళ్లిపోయింది.

 నామినేషన్లలో మాట్లాడిన తీరు..

నామినేషన్లలో మాట్లాడిన తీరు..

జబర్దస్త్ కమెడియన్ గా వచ్చిన ఫైమాకు 7.37 శాతం ఓటింగ్ నమోదైంది. అంతకుముందు వారం నామినేషన్లలో మెరీనాతో ఈవారం నామినేషన్లలో బాలాదిత్యతో ఫైమా వ్యవహరించిన తీరుతో ప్రేక్షకులు ఆమెకు చివరి స్థానాన్ని కట్టబెట్టినట్లు తెలుస్తోంది.

ఎలిమినేట్ అయిన 8 మంది..

ఎలిమినేట్ అయిన 8 మంది..

ఇక బిగ్ బాస్ తెలుగు 6 సీజన్‌లోకి మొత్తం 21 మంది అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, శ్రీ సత్య, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌ ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ఇప్పటికీ 8 వారాలకు గాను 8 మంది షానీ సల్మాన్, అభినయ శ్రీ, నేహా చౌదరి, ఆరోహి రావు, చలాకీ చంటి, సుదీప పింకీ, అర్జున్‌ కల్యాణ్, ఆర్జే సూర్య వెళ్లిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X