Bigg Boss Telugu 6: ఎలిమినేషన్ కానున్న కంటెస్టెంట్ కు లెజండరీ క్రికెటర్ సపోర్ట్!

బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతోంది బిగ్ బాస్. ఇప్పటి వరుక 5 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ రియాలిటీ షో తాజాగా రసవత్తరంగా ఆరో సీజన్ సాగుతోందన్న విషయం తెలిసిందే. అరుపులు, కేకలు, గొడవలు, బూతులు, ప్రేమయణాలు, స్ట్రాటజీలతో మంచి కంటెంట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు బిగ్ బాస్ హౌజ్ మేట్స్. ఇక బిగ్‌బాస్ తెలుగు 6 రియాలిటీ షో మూడో వారం ఎలిమినేషన్‌కు సిద్దమైంది. ఇందులో అనూహ్యంగా యాంకర్ నేహా చౌదరి ఎలిమినేషన్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈమెకు ఓ లెజండరీ క్రికెటర్ మద్దతుగా నిలిచారు.

బిగ్ బాస్ నామినేషన్..

బిగ్ బాస్ నామినేషన్..

బిగ్ బాస్ తెలుగు 6 రియాలిటీ షో మంచి రసవత్తరంగానే సాగుతోంది. చివరి వారం డబుల్ ఎలిమినేషన్ స్ట్రోక్ తో షానీ సాల్మాన్, అభినయశ్రీని హౌజ్ నుంచి బయటకు పంపించివేసి ఇంటి సభ్యులకు డైరెక్ట్ గా షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో డైరెక్ట్ గా ఇద్దరిని ఎలిమినేషన్ కు నామినేట్ చేసి మరో షాక్ ఇచ్చాడు.

ఊహించని విధంగా..

ఊహించని విధంగా..

తాజాగా బిగ్‌బాస్ తెలుగు 6 రియాలిటీ షో మూడో వారం ఎలిమినేషన్‌కు సిద్దమైంది. గతవారం ఇంటిలో కెప్టెన్సీ టాస్క్‌లో ఆటగాళ్ల టాలెంట్ ఓటింగ్ ప్రక్రియపై ప్రభావం చూపడంతో కొందరు కంటెస్టెంట్ల తలరాతలు తారుమారయ్యాయి. అయితే ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఆసక్తికరంగా ఊహించని కంటెస్టెంట్ నేహా చౌదరి ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు సమాచారం.

నేహా చౌదరికి సపోర్ట్ గా..

నేహా చౌదరికి సపోర్ట్ గా..

ఇప్పటివరకు ఇనయ సుల్తానా గానీ, వాసంతి గానీ బయటకు వెళ్తారని అనుకున్నారంతా. కానీ, 'ఇది బిగ్ బాస్. ఇక్కడ ఏమైనా జరగొచ్చు' అన్న విధంగా యాంకర్ నేహా చౌదరిని ఎలిమినేట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే నేహా చౌదరి నామినేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఆమె నామినేషన్ లో ఉన్న విషయం తెలిసి ఓ లెజండరీ క్రికెటర్ ఆమెకు మద్దతుగా నిలిచారు.

సోషల్ మీడియా వేదికగా పోస్ట్..

సోషల్ మీడియా వేదికగా పోస్ట్..

ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు షో కంటెస్టెంట్లకు తెలుగు రాష్ట్రాల నుంచే సపోర్ట్ వచ్చేది. కానీ ఇప్పుడు సడెన్ గా నేహా చౌదరిని సేవ్ చేసేందుకు లెజండరీ క్రికెటర్ బ్రియన్ లారా సపోర్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఓట్లా వేయాలని పోస్ట్ ద్వారా కోరాడు. అయితే బ్రియన్ లారా లాంటి స్టార్ క్రికెటర్ నేహాకు మద్దతు తెలపడం ఏంటని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

 బ్రియన్ లారాతో అలా పరిచయం..

బ్రియన్ లారాతో అలా పరిచయం..

ఇదివరకు నేహా చౌదరి యాంకర్ గా, స్పోర్ట్స్ ప్రజెంటర్ గా పని చేసిన విషయం తెలిసిందే. ఇండియా క్రికెట్ మ్యాచ్ లకు తెలుగు కామెంట్రీ చేసే వ్యక్తుల్లో నేహా కూడా ఉంది. అలా కామెంట్రీ చెప్పే క్రమంలోనే బ్రియన్ లారాతో నేహాకి పరిచయం ఏర్పడి ఉంటుందని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు నేహా చౌదరిని సపోర్ట్ చేసేందుకు బ్రియన్ లారా ముందుకు వచ్చాడు.

ఫలించని మద్దతు..

ఫలించని మద్దతు..

కానీ బ్రియన్ లారా సపోర్ట్ ఏమాత్రం నేహాకు ఉపయోగపడలేకపోయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 25 ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్ లో అనూహ్యంగా, ఎవరు ఊహించని విధంగా నేహా చౌదరి ఎలిమినేట్ అవనున్నట్లు ఇప్పటికే వార్తలు చక్కర్లు కొట్టాయి. మూడో వారం నామినేషన్లలో వాసంతి, ఇనయ సుల్తానా, బాలాదిత్య, చలాకీ చంటి, ఆరోహి రావు, శ్రీహాన్, రేవంత్, గీతూ రాయల్, నేహా చౌదరి తొమ్మిది మంది నామినేషన్లలో ఉన్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X