Bigg Boss Telugu 6: పేమెంట్స్ ఈ సారి చాలా తక్కువే.. పిసినారి ప్లాన్.. అందుకే స్టార్స్ లేరు!

తెలుగులో అసలు బిగ్ బాస్ సక్సెస్ అవుతుందా లేదా అనే కామెంట్స్ అయితే మొదట్లో చాలానే వచ్చాయి. కానీ ఈ కాంట్రవర్సి షో మొదలైన తర్వాత భారీ స్థాయిలో నిర్వాహకులకు ప్రాఫిట్స్ అందే విధంగా రేటింగ్స్ అయితే వచ్చాయి. ఒక్క ఓటిటి నాన్ స్టాప్ షో తప్పితే మిగతా టెలివిజన్ బిగ్ బాస్ షోలన్నిటికీ కూడా మంచి లాభాలు వచ్చాయి. అయితే కంటెస్టెంట్స్ విషయంలో ప్రతిసారి అడిగినంత పారితోషికాలు పేమెంట్లు ఇచ్చిన బిగ్ బాస్ నిర్వాహకులు.. ఈసారి మాత్రం చాలా పిసినారితనంగా వ్యవహరిస్తున్నారు అనే కామెంట్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. అందుకే పెద్దగా పేరున్న సెలబ్రిటీలు కూడా రావడం లేదని టాక్.. ఆ వివరాల్లోకి వెళితే..

ఆ సీజన్స్ లో తప్పితే..

ఆ సీజన్స్ లో తప్పితే..

బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎంట్రీ విషయంలో ప్రతిసారి కూడా ఏదో ఒక తరహాలో నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తూనే ఉంటాయి. అసలైతే మొదటి రెండు సీజన్స్ కు వచ్చినంత క్రేజీ సెలబ్రిటీలు ఆ తర్వాత సీజన్స్ లో అయితే ఎక్కువగా కనిపించింది లేదు. ఎవరో ఒకరిద్దరూ ముగ్గురుని మాత్రమే మేజర్ హైలెట్ గా ఉండేవారిని తీసుకువచ్చేవారు. ఇక వారిలో ఒకరు ఫైనల్ విన్నర్ అని ఒక వారం గడవక ముందే తేల్చేస్తున్నారు.

మంచి ఎంటర్టైన్మెంట్

మంచి ఎంటర్టైన్మెంట్

ఓటీటీ నాన్ స్టాప్ షో ను పక్కన పెడితే టెలివిజన్ బిగ్ బాస్ షోలలో ప్రతిసారి యాంకర్స్ తో పాటు టెలివిజన్ నటులు అలాగే కమెడియన్స్, యూట్యూబర్స్ ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ కు చెందిన ఫిలిం సెలబ్రిటీలను కూడా తీసుకువస్తున్నారు. ప్రతిసారి కొన్ని కేటగిరీలుగా విభజించి మంచి ఎంటర్టైన్మెంట్ ఉండేలాగా ప్లాన్ అయితే చక్కగా వేస్తున్నారు.

 మొత్తం ఎంతమంది అంటే..

మొత్తం ఎంతమంది అంటే..

ఇక ఈసారి మాత్రం కంటైస్టెంట్ విషయంలో పెద్దగా ఆశ్చర్యపరిచే వారు ఏమి రావడం లేదు అని తెలుస్తోంది. ఎవరో ఇద్దరు ముగ్గురు తప్పితే మిగతా అందరూ కూడా దాదాపు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియని వారే అనిపిస్తోంది. మొత్తంగా 19 మంది బిగ్ బాస్ లోకి వచ్చే అవకాశం ఉందట ఇక అందులో 3 మాత్రం కొన్ని వారాల తరువాత వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇస్తారు అని తెలుస్తోంది.

ఫైనల్ లిస్ట్ ఇదే..

ఫైనల్ లిస్ట్ ఇదే..

ప్రస్తుతం అయితే ఒక 16 మంది పేర్లు ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. శాని సాల్మన్, వాసంతి, శ్రీహాన్, శ్రీ సత్య, ఆర్జే సూర్య, ఆదిరెడ్డి, గీత రాయల్, యాంకర్ నేహా చౌదరి, చలాకీ చంటి, బాలాదిత్య, మెరిన్, రోహిత్, అలాగే విశాల్ రాజశేఖర్, అభినశ్రీ, ఇనియా సుల్తానా ,సింగర్ రేవంత్ ఇలా 16 మంది ఫిక్స్ అయినట్లుగా ఒక లిస్ట్ అయితే ప్రస్తుతం వైరల్ గా మారుతుంది.

వారు తప్పితే..

వారు తప్పితే..

ఇక ఈ లిస్టు లో ఎక్కువగా అందరికీ తెలిసిన వారిలో జబర్దస్త్ కమెడియన్ చలాకి చంటి, శ్రీ సత్య, బాలాదిత్యా అలాగే యూట్యూబర్ శ్రీహన్, సింగర్ రేవంత్ తో పాటు మరో ఇద్దరు ముగ్గురు టెలివిజన్ ఆర్టిస్టులు తప్పితే పెద్దగా అట్రాక్ట్ చేసేంత కంటెస్టెంట్స్ అయితే ఎవరూ లేరు అని చెప్పాలి. బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్స్ విషయంలో ఈసారి చాలా పిసినారితనంగా వ్యవహరించినట్లుగా కూడా టాక్ వినిపిస్తోంది.

ఐదుగురికి మాత్రమే ఆ రేంజ్ పేమెంట్?

ఐదుగురికి మాత్రమే ఆ రేంజ్ పేమెంట్?

బిగ్ బాస్ లో అవకాశం అందుకొని మళ్ళీ కెరీర్ ను దారిలో పెట్టుకోవాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వారిని మాత్రమే ఈసారి బిగ్ బాస్ ఎక్కువగా హౌస్ లోకి తీసుకువస్తున్నాడు అనిపిస్తోంది. ఇక వారికి పేమెంట్ ఎంత ఇచ్చినా కూడా తీసుకుంటారు. కేవలం ఒక ఐదుగురికి మాత్రమే ఈసారి వారానికి ఒక లక్ష ఇచ్చే విధంగా అగ్రిమెంట్ అయితే సెట్ అయినట్లు సమాచారం. ఒకవేళ ఎవరి కారణంగా అయితే రేటింగ్స్ వస్తే మాత్రం పేమెంట్స్ పెంచుతారట. మరి ఈ లెక్కలు ఎంతవరకు నిజం అనేది మరి కొన్ని రోజులు అయితే తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X